Vastu tips: మానవుల దయానందనీయ జీవితంలో ఎన్నో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. మానవులు ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అదేవిధంగా దేవునిపై ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటూ, ఆచరించాల్సిన నియమాలను పాటిస్తూ, దేవునిపై భారం వేస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. మానవులు కనీసం ఒక ఇల్లు నిర్మించాలంటే కూడా వాస్తు దోషం ఉందో లేదో తెలుసుకొని వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకుంటారు.
ప్రపంచం మొత్తంలో అందరూ ఎప్పుడు కాకపోయినా, ఏదో ఒక సందర్భంలో వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకుంటారు. దీనివల్ల మనిషి మనసులో ఉండే అలజడి తగ్గి ప్రశాంతంగా ఉంటాడు. ఎటువంటి అనుమానాలు ఉండవు. వాస్తు శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు పరిష్కార మార్గాలు ఉంటాయి. అందుకే తమ చేతులలో డబ్బు నిలవకపోయినా వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకుంటారు.
డబ్బు నష్టాన్ని తగ్గించే మార్గం గురించి తెలుసుకుందాం: డబ్బు నష్టాన్ని తగ్గించుకోవడానికి వాస్తు శాస్త్రంలో అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో లవంగాలు ఒకటి.
లవంగాలను ఏ విధంగా ఉపయోగించి డబ్బు నష్టాన్ని తగ్గించుకోవాలో తెలుసుకుందాం:
వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు కట్టకపోతే ఆ ఇంట్లో ఎప్పటికీ మంచిగా ఉండదని చెబుతుంటారు. అంతేకాకుండా ఇంట్లో సంతోషాలు ఉండవని, ఎన్నో ఇబ్బందులు వస్తాయని చెబుతారు. అలాంటప్పుడు వాస్తు శాస్త్రంలో ద్వారా దోషాలను తొలగించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాస్తు శాస్త్రాన్ని అనుసరించడం ద్వారా అన్ని సమస్యలు తొలగిపోతాయని నమ్ముతుంటారు. లవంగం, కర్పూరం కలిపి వాడటం వల్ల వాస్తు దోషం తొలగి డబ్బు నష్టం తగ్గుతుందని ప్రగాఢ నమ్మకం. కర్పూరాన్ని, లవంగాన్ని కలిపి వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
లవంగం, కర్పూర పరిహారం వల్ల కలిగే ప్రయోజనాలు: ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందాలంటే, అలాగే ఇంట్లో ఆనందం శ్రేయస్సు సమకూరాలంటే, కొన్ని లవంగాలను, కర్పూరం కలిపి ఒక గిన్నెలో వేసి వంట గదిలోనే వాటిని కాల్చాలి. ఇలా ఉదయం, సాయంత్రం చేయడం ద్వారా డబ్బు సమస్య తగ్గి, ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.
ఒక వ్యక్తి దగ్గర లేదా సంస్థ దగ్గర మీ డబ్బు ఇరుక్కొని ఎంత కాలానికి మీ చేతికి రాకపోతే, ఎర్ర గులాబీలో కొన్ని కర్పూరం ముక్కలు, కొన్ని లవంగాలు వేసి దుర్గాదేవికి సమర్పించడం వల్ల సమస్యలు తొలగి, చిక్కుకున్న డబ్బు త్వరగా మీ చేతికి అందుతుందని కూడా వాస్తు శాస్త్రం తెలుపుతుంది.
లక్ష్మీదేవికి విశ్వాసంతో కర్పూరంతో హారతిని ఇవ్వాలి. ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి అమ్మవారికి ప్రతిరోజు కర్పూర హారతి ఇవ్వాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు అని వాస్తు శాస్త్రం ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా ఒక గిన్నెలో ఐదు లవంగాలు, కర్పూరం, యాలకులు కలిపి వాటిని కాల్చి ఆ పొగను ఇల్లంతా ధూపం వేయడం చాలా మంచిది.
ఇల్లంతా ధూపం వేసిన తర్వాత ఆ ధూపాన్ని దేవుడి దగ్గర ఉంచాలి. ఇలా చేయడం ద్వారా ధూపం వేసిన పొగ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని తీసివేసి, పాజిటివ్ ఎనర్జీతో నింపుతుంది. దీని వలన మనకు, మన కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందని వాస్తు శాస్త్రం తెలుపుతుంది.
ఇంట్లో సుఖ సంతోషాలు తక్కువైనప్పుడు, ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కర్పూరాన్ని ఆవు నెయ్యిలో ముంచి, ఇత్తడి కుండీలో లేక దేవునికి హారతిని ఇచ్చే హారతి పళ్లెంలో వేసి కాల్చాలి. ఇలా కాల్చడం ద్వారా ఇంట్లో సంతోషం, శాంతి చేకూరుతాయని వాస్తు శాస్త్రం ద్వారా తెలుస్తుంది.
చాలామందికి తామంటే ఇష్టం లేని వారు ఉంటారు. వారు ఎలాంటి పనిచేయడానికి కూడా వెనకాడరు. అటువంటి వారితో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, హనుమాన్ పూజ చేసి, ఏడుసార్లు బజరంగబన్ చదివి, లడ్డూలను ప్రసాదంగా పెట్టాలి. అలాగే ఐదు లవంగాలతో కర్పూరాన్ని కలిపి దేవునికి హారతి ఇవ్వాలి.
అంతా పూర్తయిన తర్వాత లవంగాలు, కర్పూరాన్ని కాల్చితే వచ్చిన బస్మాన్ని ప్రతిరోజు బయటకు వెళ్లేటప్పుడు నుదుటిన తిలకంగా పెట్టుకుని వెళ్ళాలి. ఈ విధంగా చేయడం ద్వారా శత్రువులను ఓడించవచ్చు. వారి వల్ల వచ్చే అపాయాలను తొలగించుకోవచ్చు. ఈ విధంగా వాస్తు శాస్త్రాన్ని అనుసరించి, వాస్తు శాస్త్రంలో తెలిపినట్లుగా చేయడం ద్వారా, ఎటువంటి కష్టాలు లేకుండా కుటుంబంతో సంతోషంగా ఉండవచ్చు.