Dhoni: క్రికెటర్లు సాధారణంగా వారి కుటుంబాలతో వారి స్నేహితులతో కలసి ఆనందంగా గడిపే సమయం చాలా తక్కువ. సమయం లేని షెడ్యూలు తో వివిధ దేశాల్లో తిరుగుతున్న ఆటగాళ్లు. అయినా సరే క్రికెట్ వీడ్కోలు పలికిన తర్వాత సమయం మొత్తాన్ని వారి కుటుంబంతో వారి స్నేహితులతో తమకు ఇష్టమైన ఆటలతో జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతుంటారు.
ప్రస్తుతం ఇదే పని చేస్తున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని. ఓ పక్క ఫ్యామిలీకి సమయం కేటాయిస్తూనే తనకి ఇష్టమైన టెన్నిస్ ఆటను కూడా ఆడుకుంటూ వారి స్నేహితులతో కలిసి పార్టీలను తెగ ఎంజాయ్ చేస్తున్న ఆటగాడు. కొత్తగా ఓ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో ధోని తన స్నేహితులతో కలిసి డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని…మిస్టర్ కూల్ గా డాషింగ్ ఫినిషర్ గా క్రికెట్ ప్రపంచానికి సూపరిచితుడు. అయితే ధోని లో ఉన్న మరో యాంగిల్ అందరికీ పరిచయం చేశాడు. కొత్తగా దుబాయ్ లో ఉన్న ఫ్రెండ్ పుట్టినరోజు వేడుకకు వెళ్ళాడు. మహి హాలీవుడ్ స్టైలిష్ లుక్ లో అందరికీ హీరోలా కనిపించిన ధోని. లుక్స్ తోనే కాక తన డాన్స్ తో కూడా పార్టీలో రచ్చ రచ్చ చేసిన స్టార్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని.
స్టార్ రాప్ సింగర్ బాద్ షా పాటలు పాడుతుంటే భారత్ క్రికెటర్లు అయితే హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, ఇషాన్ కిషన్ లతో కలసి డాన్స్ చేశాడు. ఈ వీడియోను ధోని భార్య సాక్షి సింగ్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే ధోనీని మైదానంలో కెప్టెన్ కూల్ గా చేసిన అభిమానులు ఇదో రకమైన సర్ప్రైజ్. ఇక న్యూజిలాండ్తో టీమిండియా టి20 తర్వాత హార్దిక్ పాండ్యాకు, ఇషాన్ కిషన్ లకు వన్డే సిరీస్ కు విశ్రాంతి ఇచ్చారు సెలెక్టర్లు. దాంతో నేరుగా వీళ్ళిద్దరూ దుబాయ్ వచ్చి బర్త్ డే సంబరాలలో పాల్గొన్నారు.