Draupadi Murmu:ఎన్ని ఆటంకాలు వచ్చిన పట్టు వదలని విక్రమార్కుడిలా’ ద్రౌపది ముర్ము.రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన ద్రౌపతి ముర్ము జీవితంలో ఎన్ని విషాదలను అయితే ఎదుర్కొన్నదో, అదే విధంగా విజయాలను కూడా సాధించింది. తన కుటుంబంలో ఎన్నో తీవ్ర విషాదాలు ఎదురైనా తన ప్రయాణం ఏమాత్రం ఆపకుండా కొనసాగించారు. దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ద్రౌపతి ముర్ము ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధిస్తే, రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి ఆదివాసీ మహిళగా చరిత్రలో నిలుస్తారు.
గతంలో ఆమె ఝార్ఖండ్ గవర్నర్ గానే కాకుండా మరెన్నో రాజకీయ పదవుల్లో ఉండి సేవలను అందించడం జరిగింది. ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ గురువారం కొనసాగుతోంది. మొదటగా జరిగిన రౌండ్ లో ద్రౌపతి ముర్ము నే ముందున్నారు. సాయంకాలానికి పూర్తి ఫలితాలు విడుదలవుతాయి.
ప్రతిపక్షాలు మాత్రం ద్రౌపది ముర్ము గెలిస్తే రబ్బర్ స్టాంప్ గా మిగిలిపోతారు అని విమర్శలు చేసిన కూడా ఆమె వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్నికల్లో తన ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంది. ద్రౌపది ముర్ము జి ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు ఆమె ప్రకటించిన ప్పటి నుంచి ఆమె గురించి తెలుసుకునేందుకు దేశం అంతా ఆసక్తి కనబరిచింది. దేశంలో అత్యున్నత పదవికి పోటీ పడుతున్న ఆమె జీవితంలో విజయాలతో పాటు, ఎన్నో విషాదాలు కూడా ఉన్నాయి.
ఆమె వ్యక్తిగత జీవితంలో తీవ్ర విషాదాన్ని 2009-2014 మధ్యకాలంలో ఎదుర్కొనడం జరిగింది. తన భర్తతో పాటు తన ఇద్దరు కొడుకుల్ని కూడా ఈ ఐదేళ్ల కాలంలో పోగొట్టుకుంది. తన సోదరుడ్ని, తల్లిని కూడా ద్రౌపది ముర్ము కొడుకు అయిన లక్ష్మణ్ ముర్ము అనుమానాస్పద స్థితిలో 2009 లో మరణించడం జరిగింది. రెండో కొడుకు రోడ్డు ప్రమాదంలో 2012లో మరణించాడు.
కార్డియాక్ అరెస్ట్ కారణంగా భర్త 2014లో మరణించాడు. ద్రౌపది ముర్ము కూతురైన ఇతిశ్రీ ముర్ము ప్రస్తుతం బ్యాంకులో జాబ్ చేస్తుంది. ద్రౌపది ముర్ము కూతురు యొక్క భర్త రగ్బీ ప్లేయర్. ద్రౌపది ముర్ము రాజకీయాల్లోకి రావడానికి కంటే ముందు ఒడిశాలోనీ రాయి గంగాపూర్ లో టీచర్ గా వర్క్ చేసింది. ద్రౌపది ముర్ము బంధువులు ఆమె చిన్నప్పటి నుంచి ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్నట్టు తెలిపారు. ద్రౌపది ముర్ము చదువుకోడానికి వెళ్తుంటే ఇరుగు,పొరుగు వాళ్ళు ఒక ఆడపిల్ల చదువుకుని ఏం చేస్తుందని హేళన చేసే వారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు తను ఎం సాధించగలదో నిరూపించిందని బంధువులు పేర్కొన్నారు.