ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికమవడంతో ప్రపంచ దేశాలు వాతావరణ సమతుల్యాన్ని కాపాడడానికి దానికి తగ్గ చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తున్నాయి. ఈ చర్యలలో భాగంగా పలు యూరోప్ దేశాలు గ్యాస్ ఆధారిత కంపెనీలను వినియోగదారులను వినియోగం తగ్గించుకోవాలని సూచిస్తున్నాయి. ఈ దిశలో భాగంగా స్పెయిన్ ప్రధాని ఫెబ్రోస్ ఛాన్సెస్ ఆ దేశ పౌరులకు మరియు ఉద్యోగస్తులకు తాత్కాలికంగా టై ధరించకూడదని సూచించాడు. తాత్కాలికంగా ధరించకపోవడం వలన ఉష్ణోగ్రత తక్కువగా ఉండి వినియోగదారులు కూలర్లు ఇంధన పరికరాలు తక్కువగా వాడడం వల్ల వాతావరణ ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపాడు. తాత్కాలికంగా ఈ విధానాన్ని అమలు చేద్దామని తమ దేశ పౌరులకు పిలుపునివ్వడం జరిగింది.
ఇప్పుడిప్పుడే ప్రపంచ క్రికెట్లో అడుగులు వేస్తున్న నేపాల్ జట్టు తమ జాతీయ జట్టుకు హెడ్ కోచ్ గా భారత మాజీ క్రికెటర్ మనోజ్ ప్రకారం నియమించుకుంది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇండియన్ విజన్ ప్లానింగ్ 2030 అనే ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం రావట్నున్న భవిష్యత్ తరాలలో భారతదేశ వార్షిక జనాభా వృద్ధిరేటు తగ్గుదల నమోదు చేస్తుందని తెలిపింది.
ఆ క్రమంగా 2026 తర్వాత దేశ జనాభా వార్షిక వృద్ధిరేటు ఒక శాతం కంటే తక్కువగా ఉంటుంది అని అంచనాలు వేసింది.
ఏపీ ప్రభుత్వం ఎంతోప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్య శ్రీ పథకమును రాష్ట్ర ప్రజలకు అందరికీ వర్తింపజేసేలా పలు చర్యలు తీసుకుంటుంది. ఈ చర్యలలో భాగంగా పేద మధ్యతరగతి ప్రజలతోపాటు వివిధ నేరాలతో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను కూడా ఆరోగ్యశ్రీ ప్రబ్దారుల జాబితాలో చేర్చాలని నిర్ణయించింది. శిక్ష అనుభవిస్తూ వివిధ అనారోగ్య పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నవారు ప్రైవేట్ ఆసుపత్రులలో సాధారణ ప్రజల మాదిరిగానే ఆరోగ్య శ్రీ పథకం ఉపయోగించుకోవచ్చని తద్వారా జైల్లో అనారోగ్య పరిస్థితుల కారణంగా మరణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది.