ఈజిప్ట్ మమ్మీలు ఇలా ఉండేవారా? ముఖం ఆవిష్కరణ

ప్రపంచంలో చూడదగిన ప్రదేశాలలో ఈజిప్ట్ ప్రాంతం కూడా ఒకటి. ఈజిప్ట్ అని పేరు వినగానే ఈజిప్ట్ మమ్మీ లు అందరికీ గుర్తొస్తాయి. ఇక్కడ ఉన్న మమ్మీలు, పిరమిడ్లు ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని అందరికీ తెలియజేస్తూనే ఉంటాయి. ఈ మమ్మీ లు అయితే వేల సంవత్సరాల క్రితం నాటివి అయినా వాటిని ఎంతో జాగ్రత్తగా భద్రపరిచి ఉంటారు. వీటిలో దాగి ఉన్న రహస్యం గురించి ఫారెన్సీ క్ యంత్రపాలజిస్టులు ఎప్పుడు పరిశోధన చేస్తూ ఉంటారు.

ఈ ఫోరెన్సిక్ ఆంథోపాలజిస్టులకు ఈ ప్రదేశం వాళ్లను ఏదో ఒక విధంగా ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఈ మమ్మీలపై కొన్ని ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నారు. అత్యంత ప్రాచీన సమాధుల్లో ప్రత్యేక విధానంలో మృతదేహాలను భద్రపరిచి ఉండే విధానమే ఈ మమ్మీ లు.

మమ్మీలపై వార్సా మమ్మీ ప్రాజెక్టు పేరుతో ఒక అధ్యయనం కొనసాగుతుంది. ఇటీవలే ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఫోరెన్సిక్ నిపుణులు ఓ మిస్టరీ మమ్మీకి ముఖ ఆకృతిని కల్పించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మమ్మీ ఒక స్త్రీ. ఆమె బతికి ఉన్నప్పుడు ఈ విధంగా ఉండేది అని వారు ఆమె ముఖాన్ని ఆవిష్కరించారు.

ఫారెన్సీక్ ఆంథోపాలజిస్టుల ముఖ్య విధి-
వీళ్ళ యొక్క ప్రాథమిక పని ఏంటి? అంటే మానవ అవశేషాలను గుర్తించడంలో, మరణానికి కారణాన్ని గుర్తించడంలో సహాయపడటానికి సాక్షాలను సేకరించడం మరియు వివరించడం వాళ్ళ యొక్క ముఖ్య విధి. అందువల్ల ఈ వృత్తిని నేర న్యాయవృత్తిగా పరిగణిస్తారు. అలాగే అనేక సంస్థలు ఈ వృత్తి యొక్క సేవలను కోరుకుంటారు.ఫోరెన్సీక్ యాంథోపాలజీ అనేది ఒక ప్రత్యేకమైన విభాగం.

ఈ పనిలో భాగంగానే ఒక మిస్టరీ మమ్మీకి ముఖాకృతిని తయారు చేసరు వార్సా మమ్మీ ప్రాజెక్ట్ లో భాగంగా అందులోని నిపుణులు. ఆధునికంగా వచ్చిన 2డి, 3డీ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఆమె ముఖాన్ని వాళ్ళు రూపొందించగలిగారు. ముఖంలో ఉన్న ఎముకలు, పుర్రె ఆకారం వాటి కొలతలను ఆధారంగా చేసుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఆమె ముఖాన్ని రూపొందించగలిగారు. బ్రతికున్నప్పుడు ఆమె ఇలానే ఉండేది అని చెప్పి ఆమె ముఖాన్ని వాళ్ళు ఆవిష్కరించారు.

ఈజిప్ట్ మమ్మీలు ఇలా ఉండేవారా? ముఖం ఆవిష్కరణ

ముఖంలో ఉండే ఎముకలు, పుర్రె ఆకారం ద్వారా కచ్చితంగా కాకపోయినా ముఖ ఆకృతిని కొంతవరకు అంచనా వేయొచ్చు అని చెప్పి ఈ ప్రాజెక్టులో పాలు పంచుకున్న ఇటలీకి చెందిన ఫోరెన్సిక్ ఆంధ్రపాలజిస్ట్ అయినా చాంటల్ మిలాని పేర్కొన్నారు.

సదరన్ పోలాండ్ లోని కాటో వైస్ నగరంలో ఉన్న సిసిలియా మ్యూజియంలో ఈ మమ్మీ ముఖాన్ని ప్రదర్శించారు. ఈ ముఖము 20 ఏళ్ల వయసులో ఉన్న ఒక యువతి ముఖం అని చనిపోయేటప్పటికి ఆమె ఏడో నెల గర్భవతిగా ఉందని పరిశోధనలో తేలింది. ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చనిపోయి ఉండొచ్చని ఫారెన్సీకి నిపుణులు చెప్తున్నారు. మమ్మీ స్థితిలో ఉన్న ఆమె దేహంలో అంతర్గత అవయవాలన్నీ తొలగించి ఉండగా ఆమె కడుపులో గర్భం మాత్రం అలానే ఉందని వెల్లడించారు.

ఈజిప్టు దేశ పురాతన భావన-
గర్భంలో శిశువు ఉన్నంతకాలం అది తల్లికే సొంతం. అనే భావన ఈజిప్టు దేశానికి చెందిన ఒక పురాతన భావనలకు ఇది ఒక నిదర్శనం అయి ఉంటుందని పరిశోధకులు చెప్పారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఒక ఈజిప్ట్ మమ్మీ యొక్క ముఖ ఆకృతిని తీర్చిదిద్దిన ఘనత వార్సా మమ్మీ ప్రాజెక్ట్ లోని నిపుణులది.