రైతు ఇంటికి క్యూ కట్టిన జనం. ఒడిస్సా రాష్ట్రంలోని భద్రక్ జిల్లా వెంకటాపూర్ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నా రైతుకు అదృష్టం బంగారు తాబేలు రూపంలో పలకరించింది. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు బంగారు తాబేలును పరీక్షించారు. ఇది సుమారుగా రెండు కేజీల బరువు ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు.
తేటగా ఉన్న నీటిలో జీవించడం ఈ తాబేలు యొక్క ప్రత్యేకత. తేటగా ఉన్న నీటిలో జీవించే ఈ తాబేలును భద్రపరచడానికి అటవీ శాఖ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.అందుకే అటవీ శాఖ అధికారులు ఈ తాబేలును పరిశుభ్రంగా ఉన్న నీటిలో తరలించారు. ఇలాంటి తాబేలును మ్యూజియంలో భద్రపరచడానికి అటవి శాఖా అధికారులు రైతు నుంచి తాబేలు స్వాధీనం చేసుకున్నారు. చూడటానికి ఈ తాబేలు నిజమైన బంగారమే అనుకుంటాం.
ఈ అరుదైన తాబేలు భద్రాచలం జిల్లా కోర్సాహి బ్లాక్ లోని కస్తూరి కాల గ్రామంలో వైతరని నది ఒడ్డున రక్షించబడుతుంది. చాలా అరుదైన జాతిగా ఉండే ఈ తాబేలు తుఫాను కారణంగా ఈ గ్రామంలోకి వచ్చి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.