Gujarat Suspension Bridge: గుజరాత్‌లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన సస్పెన్షన్ బ్రిడ్జ్.. 

Gujarat Suspension Bridge: గుజరాత్ ప్రాంతంలోని మోర్బి వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య సోమవారానికి 134 చేరింది. ఆదివారం రాత్రి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గుజరాత్ రాష్ట్రంలోని మోర్భి బి నగరాన్ని సందర్శించారు. ఈ సంఘటనకు సంబంధించి జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ని ఈయన పరిశీలించారు.

ఈ వంతెన ఒక పురాతనమైన వంతెన. అక్టోబర్ 26వ తేదీన ఈ వంతెనకు సంబంధించి అనేక మరమ్మతులు చేశారు. అని అక్టోబర్ 30 ఆదివారం సాయంత్రం ఆరు గంటల 30 నిమిషాలకు ఈ వంతెన కుప్పకూలింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు ఈ ప్రాంతాన్ని పర్యటించనున్నారు. ప్రధాని మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సహాయక చర్యల లో ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటానని చెప్పారు.

గుజరాత్‌లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన సస్పెన్షన్ బ్రిడ్జ్.. 

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గుజరాత్ హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి రాత్రి అక్కడే ఉండి రెస్క్యూ ఆపరేషన్ ని పర్యవేక్షిస్తున్నారు. ఈ సంఘటన జరిగిన కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హర్యానాలోని అడంపూర్లో సోమవారం రోజు నిర్వహించాల్సిన రోడ్డు షోను రద్దు చేసినట్లు తెలిపారు. వంతెన నిర్వహణ, వివాహన సంస్థలపై ఎఫ్ ఐ ఆర్ దాఖలయింది.

ఈ సంఘటనలో ప్రాణం కోల్పోయిన మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండగా ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటుందని తెలియజేశారు.

1922 వరకు మోర్భి ప్రాంతాన్ని పాలించిన వ్యక్తి సర్ వాఘ్జీ ఠాకోర్. ఈ వంతెన 1.25 మీటర్ల వెడల్పు, మరియు 233 మీటర్లు విస్తరించి ఉంది.NDRF యొక్క ఆరు బృందాలు,SDRF యొక్క 6 ప్లాటూన్లు, వైమానికా దళం, ఆర్మీ యొక్క రెండు స్తంభాలు మరియు స్థానిక రెస్క్యూ బృందాలు, భారత నావికా దళానికి చెందిన రెండు బృందాలు కూడా ఈ ఆపరేషన్ లొ పాల్గొన్నాయి.

పశ్చిమ భారతదేశంలోని మోర్భి ప్రాంతంలో ఉండే వంతనపై చుట్టుపక్కల ఉన్న మహిళలు, చిన్న పిల్లలు దాదాపు 500 మంది ప్రజలు మతపరమైన పండుగను జరుపుకుంటారని చీకటి పడగానే దానికి సంబంధించిన కేబుల్స్ తెగిపోయాయని అధికారులు చెప్పారు.

భారత ఆర్మీ బృందాలు కూడా ఈ సంఘటనలో నీటిలో మునిగిపోయిన వారిని బయటికి తీయడానికి సహాయపడుతున్నాయి. ఈ ఘటనలో గాయపడిన వారిని మోర్భి సివిల్ ఆసుపత్రిలో చేర్చారు. ఇంకా ఎంతమంది చనిపోయారో తెలియాల్సి ఉంది. మొత్తానికి ప్రస్తుతం వరకు చనిపోయిన వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది.