FruitsRecipes

Jujube Fruit benefits: రేగి పండ్ల ఉపయోగాలు

Jujube Fruit benefits: రేగి పండు పులుపు, తీపి రుచులతో కలిగి ఉండి మనకు ఈ సీజన్లో ఎక్కువగా లభిస్తాయి .ఇవి ఉష్ణ మండల ప్రాంతాలలో ఎక్కువగా పండుతాయి. మనదేశంలో అనేక ప్రాంతాలలో రేగుపండు పండుతాయి. వీటిలో 40 జాతులకు పైగా ఉన్నాయి. పసుపు, కాఫీ రంగు కలిసి, ఎరుపు లేదా గ్రీన్ తదితర రంగులలో ఇవి మనకు లభిస్తున్నాయి. కొన్ని రేగి పండ్లు పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. మరికొన్ని పెద్దవిగా ఉన్నాయి. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ సమయంలో భోగి పండుగ రోజున రేగి పళ్ళు చిన్న పిల్లలకు పోస్తారు. ఇలా చేయడం వల్ల చిన్న పిల్లలు భోగభాగ్యాలతో తులతువుతారని పెద్ద వాళ్ళ నమ్మకం. ఈ రేగుపళ్ళను తినడం వల్ల అనేక పోషక పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి.

విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. జామకాయ తర్వాత విటమిన్ సి రేగిపండ్లలో ఎక్కువగా ఉంటుంది. రేగి పండ్లు ఆకులను ఒకటి లేదా రెండు ఆకులను ప్రతిరోజు చిన్నపిల్లలకి ఉదయం లేదా సాయంత్రం పూట తినిపిస్తే వారికి కలిగే అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. కడుపులో మంటను తగ్గించే గుణం రేగి పండ్లకు ఉంది. అజిర్తి కి బాగా పనిచేస్తాయి . గొంతు నొప్పి, అస్తమా, కండరాల నొప్పులను ఇవి తగ్గిస్తాయి. రేగి పళ్ళ గింజలను పొడిచేసి నూనెతో కలిపి రాసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రేగి చెట్టు బేరుడను,నీటిలో మరిగించి, డికాషన్ చేసుకొని త్రాగితే నీల విరేచనాలు తగ్గుతాయి.

రేగి పళ్ళను చేతినిండా తీసుకొని ఒక అర లీటర్ నీటిలో వేసుకొని అవి సగం అయ్యేవరకు నీటిని మరగనివ్వాలి. ఆ ద్రావణాన్ని చెక్కెర లేదా తేనె కలుపుకొని రాత్రి నిద్రపోయేముందు త్రాగితే చక్కటి ఆరోగ్యం చేకూర్చుతుంది. ఈ మిశ్రమంలో గుటామిక్ ఆసిడ్ మెదడుబాగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. జ్వరం, జలుబురాకుండా ఉండాలంటే తరచుగా రేగి పండ్లను తినాలి. రేగి ఆకులను నూరి కురుపుల మీద రాస్తే త్వరగా నయమవుతాయి.

Jujube Fruit benefits
Jujube Fruit plant

బరువు పెరిగేందుకు ,కండరాలకు బలాన్ని ఇవ్వడంలో ,శరీరానికి శక్తినిచ్చేందుకు ,రేగి పండ్లు చక్కగా ఉపయోగపడతాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాన్ని కలిగి ఉన్నాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రక్తహీనత, నీరసం, గొంతు నొప్పి, శ్వాసనాల వాపు వంటి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రేగి చెట్ల వేర్లను పొడిచేసి గాయాలపై పెడితే త్వరగా ఉపశమనం కలుగుతుంది. వెంట్రుకలు బాగా పెరిగేందుకు రేగి పండ్లు తోడ్పడతాయి…

రేగి పండు పచ్చడి:

రెండు కప్పుల రేగిపళ్ళను తీసుకోవాలి. వీటిని రెండుసార్లు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని వాటర్ లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. పుల్లటి రేగి పండును తీసుకోవాలి. తొడిమెలు లేకుండా తీసివేయాలి. 250 గ్రాముల రేగి పండ్లను తీసుకోవాలి. కప్పు మెజర్మెంట్ తో రెండు కప్పుల రేగి పండ్లను తీసుకోవాలి. 100 గ్రాముల పండుమిర్చిని తీసుకోవాలి. వీటికి వాటర్ తగలనివ్వకూడదు .ముందుగానే కడిగి వాటర్ లేకుండా శుభ్రం చేసుకోవాలి. వీటిని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని, రెండు స్పూన్ల ఆవాలు వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి.

అదే కడాయిలో ఒక స్పూన్ మెంతులు తీసుకొని వాటిని కూడా దోరగా వేయించుకొని చల్లార్చిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 150 గ్రాముల ఆయిల్ ని తీసుకోవాలి. కప్పుల రేగుపండ్లు తీసుకున్నాను కదా అందువల్ల ఒక కప్పు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, టికెట్ మెంతులు వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఒక వెల్లుల్లి మొత్తం తీసుకుని పొట్టు తీసి కచ్చాపచ్చా దంచుకోవాలి. వీటిని ఆయిల్లో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని తీసుకోవాలి.

2 స్పూన్ ఆవాలపొడిని, ఒక స్పూన్ మెంతుల పొడిని తీసుకొని, 50గ్రాముల ఉప్పును తీసుకొని, ఇందులో వేసుకోవాలి. మిక్సీపట్టుకున్న పండుమిర్చి పేస్టు కూడా ఇందులో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. తరువాతరేగి పళ్ళను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరగా రెండు స్పూన్ల కారంపొడిని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. మూడు రోజుల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. దీని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని,నిలువచేసుకోవాలి. సంవత్సరం వరకు నిల్వ ఉండే రేగి పచ్చడి రెడీ…

రేగిపండ్ల వడియాలు:

ఈ రేగి పండు అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు దొరుకుతాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పుల్లగా ఉంటాయి కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా ఎక్కువగా తింటారు. రేగిపండ్లలో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి అలాగే క్యాల్షియం, ప్లాటియాసిడ్, ఫైబర్ ఉన్నాయి. ఇందులో పోషక విలువలు కూడా ఎక్కువ ఉన్నాయి. గర్భిణి
స్త్రీలు తినడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. రేగిపండ్ల వడియాల తయారీ. 500 గ్రాముల రేగి పండ్లను తీసుకోవాలి. వాటిని సాల్ట్ వేసుకుని శుభ్రంగా నీటితో రెండు లేదా మూడుసార్లు శుభ్రం చేసుకోవాలి. లోపల పుచ్చులు లేదా పురుగులుఉన్నాయేమో అని రేగిపళ్ళను ఓపెన్ చేసుకొని ప్రతి దానిని చెక్ చేసుకోవాలి.. 11 పండుపచ్చిమిరపకాయలు తీసుకోవాలి. రేగి వడి రుబ్బురోలు లేదా రోట్లో గాని దంచుకుంటే చాలా టేస్ట్ గా ఉంటాయి. ఒక టీ స్పూన్ ఫుల్ జీలకర్రను తీసుకోవాలి.

అలాగే నేను తీసుకున్న 11 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని తర్వాత ,దానికి రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ మూడింటిని రుబ్బురోలు వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని దంచుకోవాలి. రేగిపళ్ళను కొద్ది కొద్దిగా వేసుకుని మెత్తగా దంచుకోవాలి. ఇందులో 250 గ్రాముల బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. రేగిపళ్ళను మొత్తం దంచుకున్న తర్వాత ఒక ప్లేట్లు తీసుకొని లేదా ఒక పాలిథిన్ కవర్ పైన స్పూన్ తీసుకొని చిన్నచిన్న వడియాలు పెట్టుకోవాలి. వీటిని ఎండలో పెట్టుకొని ఆరిన తర్వాత తినాలి. ఈ విధంగా రేగిపండ్ల వడియాలను పెట్టుకోవాలి.

రేగి పండ్ల ఉపయోగాలు (Jujube Fruit benefits):

పిల్లలకు భోగి పండుగ రోజున భోగి పండుగ రేగిపండ్లను పోస్తూ ఉంటారు. ఎందుకంటే రేగి పండ్లు పిల్లల మానసిక రుగ్మతాలను తగ్గిస్తుంది. నమ్మకం, ఆయుర్వేదంలో కూడా దీన్ని రుజువు చేసినారు. విటమిన్ సి సమృద్ధిగా కలిగి ఉండడి,కాబట్టి ఆయుర్వేదంలో కూడా రేగిపళ్ళను వాడతారు. రేగిపళ్ళతో పాటు బెరడు, ఆకులు ,గింజలు ఇలా రేగి చెట్టే ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది.. రేగిపండ్లలో అధిక మొత్తంలో ఐరన్ మరియు ఫాస్పరస్ లభిస్తుంది. ఇది రక్తంలోని ఎర్ర రక్తకణాల వృద్ధికి దోహదపడుతుంది.

అందువల్ల ఐరన్ మరియు రక్తహీనత సమస్యలతో బాధపడేవారు కండరాలు మరియు అజిర్తి సమస్యలతో బాధపడేవారు రేగిపళ్ళను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. రేగిపండ్లలో అనేక పోషకాలతో పాటు, క్యాల్షియం, ఫాస్పరస్ మరియు ఐరన్ ఎముకలను బలోపేతం చేస్తుంది. వయసు పై పడటం వలన కొందరిలో ఎముకలు పే లుసుగా మరియు బలహీనంగా మారే ప్రమాదం ఉంది. అలాంటివారు రేగిపళ్ళను తీసుకుంటే చాలా మంచిది. అంతే కాకుండా ఎదుగుతున్న పిల్లలకు రేగి పండ్లు తినిపిస్తే అది వారి శారీరిక మరియు మానసిక ఎదుగుదలకు ఎంతో మంచిది.

అధిక బరువు సమస్యలతో బాధపడే వారికి రేగి పండ్లు తీసుకోవడం ఒక చప్పదగ్గ సలహా. రేగి పండ్లను తొక్క మోతాదులో క్యాలరీలు, ఎక్కువ మొత్తంలో ప్రోటీన్స్, ఫైబర్ ను కలిగి ఉంది.అందువల్ల తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం చేసి, జీర్ణక్రియ వ్యర్ధాలను బయటకు తేలికగా విసర్జించడంతోపాటు ,శరీరానికి అనేక పోషకాలను అందిస్తుంది. రేగిపండ్ల యాంటీ ఆక్సిడెంట్లను మరియు ఆంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉండటంవల్ల రేగి పండు వృద్యాప ఛాయలను దరిచేరనీయువవు. శరీరాన్ని అనేక చర్మపు ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. వయసు పై పడటం వల్ల చర్మంపై ఏర్పడే ముడతలు, వృద్యాప లక్షణాలను తగ్గించి, చర్మాన్ని యవ్వనంగా మరియు కాంతివంతంగా మారుస్తుంది.

అంతేకాకుండా జలుబు, జ్వరం ,తలనొప్పి, కీళ్ల నొప్పులు ,మలబద్ధకం ముత్రాశయంలో రాళ్లు, వంటి సమస్యలకు రేగిపండు అద్భుత పరిష్కారం. రేగి పండ్ల లో ఉండే సుగుణాలు శరీరంలో హార్మోన్లను సమతుల్యం చేసి, శరీరం మరియు వెదుడుకు విశ్రాంతిని కలిగిస్తుంది. అంతేకాకుండా క్యాన్సర్ ను నివారించడంలో కూడా రేగిపండు అద్భుతంగా పనిచేస్తుంది. రేగి పండు లో ఉండే ఆల్కలాయిడ్స్ రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు ,శరీరంలో ఏర్పడే హానికర టాక్సిన్ లను బయటకు పంపడంలో సహాయపడుతుంది.

ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ అనేక రకాల ,రుగ్మతాల నుండి శరీరాన్ని కాపాడుతుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలు రేగిపండ్లలో కలిగి ఉన్నాయి. రేగి పండు శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చేసి, శరీర అవయవాలకు కావాల్సిన ప్రాణవాయువును అందించడంలో సహాయపడుతుంది, మానసికంగా ఎదుగుదల లేని పిల్లలకు రోజు ఈ పండును తినిపిస్తే కొన్ని నెలలకు వారిలో గొప్ప మార్పును గమనించవచ్చు..

రేగు ఆకుల గురించి:

Jujube Fruit benefits
Jujube Fruit leafs

ప్రతిరోజు ఐదు రేగు ఆకులను తింటూ ఉంటే గుండె సంబంధించిన వ్యాధులు రావు. మనం తీసుకునే ఆహారం బాగా జీర్ణమై గ్యాస్ ,మలబద్ధకం ,కడుపు ఉబ్బరం ,వంటి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు రెండు రేగు ఆకులను తీసుకుంటే ప్రశాంతమైన చక్కని నిద్రను పొందుతారు. దగ్గు జలుబు సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు రెండు ఆకులు తింటే దగ్గు ,జలుబు నుండి ఉపశమనం పొందుతారు. గాయాలైన చోట రేగు ఆకులను పేస్ట్ చేసి అప్లై చేస్తే గాయాలు తొందరగా మాని పోతాయి. వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో రేగు ఆకులు బాగా ఉపయోగపడతాయి. రేగు ఆకులుక్యాన్సర్ తో పోరాడే వ్యతిరేక లక్షణాలు చాలానే ఉన్నాయి.

రేగు ఆకులు గొంతు నొప్పి ,హిస్టీరియా ,రక్తహీనత వంటి రోగాలను ని వరిస్తాయి. ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో రేగు ఆకులలు తోడ్పడతాయి. కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఉదయం లేదా సాయంత్రం కానీ రెండు రేగు ఆకులను తినిపించడం వల్ల వారిలో రోగనిద క శక్తి పెరిగి వారిలో అనారోగ్య సమస్యలు రావు. బరువు తగ్గడంలో కూడారేగు ఆకుల రసం బాగా ఉపయోగపడుతుంది. ఆకలినితగ్గించడంలో కాకుండా ,గ్లూకోస్ ఎథిక్స్ స్థాయిలను తగ్గించడంలో కూడా రేగు ఆకుల రసం బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వును తగ్గిస్తుంది. కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకునే వారికి రేగు ఆకుల రసoబాగా ఉపయోగపడుతుంది.

అందంలో రేగు ఆకుల ప్రయోజనాలు…..

ముఖం పైన ఉండే మొటిమలు ,మచ్చలు, చుండ్రు సమస్యలను నివారించడంలో రేగు ఆకులు ఉపయోగపడతాయి. మొటిమలు ఉన్నచోట రేగు ఆకులను పేస్టును తీసుకొని ,అందులో కొద్దిగా నిమ్మరసం కలిపిమొటిమలు ఉన్న చోటు రాసి ,పది నిమిషాలు ఉంచిన తర్వాత కడిగేస్తే మొటిమలు తగ్గడమే కాకుండా మచ్చలు కూడా పోయి అందంగా కాంతివంతంగా మెరుస్తుంది.చుండ్రు సమస్యలతో బాధపడేవారు రేగు ఆకులను మెత్తగా పేస్ట్ చేసి ,అందులో కొద్దిగా పెరుగును కలిపి దానిని తలకు పట్టించి 20 నిమిషాలు పాటుమర్దన చేయాలి. అలా అరగంట తో పాటు వదిలేసి తేలికపాటి షాంపూతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది…

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Check Also
Close
Back to top button