Nagajemudu:సాధారణంగా జముడు జాతి మొక్కలు నాగజెముడు,బ్రహ్మజెముడు,జముడు అన్ని రకాల ప్రాంతాలలో,ఉష్ణ ప్రాంతాలలో,ఎడారి నేలల్లో,కొండలపై,గుట్టలపై ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. పల్లెటూర్లో ప్రజలు ఈ జముడు జాతి మొక్కలలో జముడు మొక్కను తీసుకొని వ్యవసాయ ఆధారిత తాళ్లుగాను,పగ్గాలు గాను తయారు చేసుకుంటారు.
అలాగే వీరికి తెలియని మరో రహస్యం ఏమిటంటే ఈ జముడు జాతి మొక్కలలో నాగజెముడు మొక్క విశిష్టత తెలుసుకోవాల్సింది ఉంది. ఈ మొక్క ఉష్ణ మండల మొక్కగా పేరు గాంచినది,దీని యొక్క ఉనికి మెక్సికో నగరంలో మొదట కనుగొన్నట్టు చరిత్రకారులు చెబుతారు. ఈ మొక్క చూడడానికి నాగుపాము పడగ ఆకారంలో భయంకరంగా ఉంటుంది.ఈ మొక్క ఆకులు ముల్లు గాను కాండం ఆకులుగాను మారి ఉష్ణ ప్రాంతంలో,ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి.ఈ మొక్క ఇలా మారడానికి కారణం సూర్యుని ఎండ నుంచి ఈ మొక్కలోని తేమ హరించుకు పోవకుండా ఉండేందుకు తనను తాను రక్షించుకోవడానికి రూపాంతరం చెందుతాయి. అయితే ఈ మొక్క యొక్క ఉపయోగాలు తెలిస్తే ఎవరూ వదులుకోరు.
ఈ మొక్క నుండి వచ్చే ప్రయోజనాల గురించి తెలుసుకుందాము. ఈ మొక్కకు పసుపు, లేత గులాబీ రంగులో పుష్పాలు వస్తాయి ఈ పుష్పాలు కాయలుగా మారి ఎర్రటి ఆకారంలోకి మారిపోవును.ఈ పండ్లు సకల రోగాలకు నివారిణిగా చెప్పుకోవచ్చును. ఎర్రగా మాగిన పండ్ల లో అనేక పోషకాలు ఉంటాయి.ఇక ఈ ఎర్రటిపళ్ళలో విటమిన్ C అధికంగా ఉంటుంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉన్నందున అందువల్ల తెల్ల రక్త కణాల వృద్ధి చెందుటలో ప్రయోజన కారి,రోగ నిరోధక వ్యవస్థను బలిష్టం చేస్తుంది. సీజనల్ వ్యాదుల నుంచి దూరంగా ఉంచుతుంది.
పిల్లల ఎదుగుదలలో,మానసిక వికాసంలో ఈ పండ్ల లోని పోషకాలు ఉపయోగపడతాయి.పెద్దలలో వచ్చే అల్జీమర్స్, డెమోన్షియా లాంటి వాటి నుండి కాపాడును. విటమిన్ E ఉండుట వలన చర్మ సౌందర్యం కాపాడబడును, చర్మం కాంతివంతంగా నిగనిగలాడును. పండులోని పీచు పదార్థం వలన మలబద్దకాన్ని నివారించును. ఇందులోని కూలర్ క్యాన్సర్ రాకుండా ఉపయోగపడను. మధుమేహ రోగు లకు ఉపయోగకారి.ధూమపానం,మద్యపానం వల్ల లివర్ కలిగిన నష్టానికి ఈ పండ్లు తినడం వల్ల లివర్ పనితనం మెరుగవును. పురుషులలో వీర్యకణాల అభివృద్ధికి ఎంతో గాను దోహదపడను.అలాగే శృంగారంపై ఆసక్తి కలిగే విధంగా చేస్తుంది. చర్మ సౌందర్యంతో పాటు కేసు సంరక్షణ లో కూడా ఉపయోగపడను. ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే విదేశాల్లో నాగజెముడు మొక్కలను తోటలు గా,పొలాల్లో పంట గా వేసుకొని వాటి కార్యని సేకరించి సూపర్ మార్కెట్లో సైతం విప్లయిస్తున్నారు.
Read more: Face Glowing Tips అందమైన ముఖానికి ఆరు సూత్రాలు