Health Tips

Face Glowing Tips: అందమైన ముఖానికి ఆరు సూత్రాలు

Face Glowing Tips: నేడు మానవులు చిన్న పెద్ద ఆడ మగ అని తేడా లేకుండా ఎదుటివారికి వారు చాలా అందంగా కనపడాలని తాపత్రయం ఎక్కువగా ఉంది ముఖ్యంగా టీనేజీ యువతీ యువకులలో వారు అందంగా కనపడాలని ఎదుటివారిని ఆకర్షించాలని తాపత్రయం ఎక్కువగా ఉంటుంది అందుకే వారు వారి ముఖ సౌందర్యం కోసం చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటారు దానికోసం వివిధ రకాలైన ప్రోడక్ట్ సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తూ ఉంటారు కొంతమందికి ఇవి ఒప్పుతాయి కొందరిలో కొన్ని రకాలైన చర్మ సంబంధ రుగ్మతలు వస్తూ ఉంటాయి.

ఇలా బయట ప్రోడక్ట్ లు వాడటం కన్నా ప్రాచీన కాలం నుంచే ఆరోగ్యానికి,అందానికి ఆయువు పట్టువైనటువంటి ఆయుర్వేదం ద్వారా సాధారణంగామనకు అందుబాటులో గల వాటి ద్వారానే ముఖాన్ని కాంతివంతంగా, సౌందర్యంగా,జిడ్డు లేకుండా చేసుకోవచ్చును. అయితే ఈ సౌందర్య లేపనాలను తయారు చేసుకుంటున్నప్పుడు ఓర్పు,సహనం లాంటివి అవసరం.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఆయిల్ స్కిన్ వారికోసం కమలా ఫలం ద్వారా ముఖము పై జిడ్డు ను తొలగించుకోవచ్చును.

కమలాఫలం: కమలాఫలంలో ఉండే విటమిన్స్ మొటిమల్ని రాకుండా నిరోధిస్తుంది .రెండు చెంచాల కమలాఫలం రసంలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి పూతలా వేయాలి,10 నిమిషాల తర్వాత స్వచ్ఛమైన మంచినీటితో డిటర్జెంట్ లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే ఫలితం గమనించగలరు. బొప్పాయిలో A,C విటమిన్లు ఉంటాయి ఇవి ముఖంపై జిడ్డును తేమను అదుపులో ఉంచుతాయి.

బొప్పాయి:బొప్పాయి గుజ్జుతో కొంచెం తేనె వేసి ముఖానికి అప్లై చేసుకోవాలి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో డిటర్జెంట్ వాడకుండా కడిగి వేయాలి ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖము కాంతివంతంగా మారుతుంది.

దాల్చిన చెక్క: చిటికెడు దాల్చిన చెక్క పొడిలో రెండు స్పూన్ల తేనె,కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో డిటర్జెంట్ వాడకుండ కడిగి వేయాలి ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే నల్లటి మొటిమలు,మొటిమల వల్ల కలిగిన మచ్చలు తొలగిపోతాయి.

కలబంద: కలబంద పసుపు ఈ రెండు కూడా మొఖంపై పేరుకుపోయిన జిడ్డును దూరం చేస్తాయి కలబందలో లోపలి భాగంలో గల తెల్లటి గుజ్జు, చిటికెడు పసుపు రెండింటిని సమపాళ్లలో తీసుకొని ముఖానికి పూతల ప్యాక్ వేసు కోవాలి 15 నిమిషాల పాటు ఆ ప్యాక్ ను ఉంచుకొని చల్లటి నీటితో కడిగి వేసుకోవాలి. వీటివల్ల ముఖంపై పేరుకుపోయిన జిడ్డు,మొటిమలు, కండ్ల కింద నల్లటి వలయాలు కూడా దూరం అవుతాయి.

బాదం గింజలు: నాలుగు బాదం గింజలను రాత్రంతా నానబెట్టి తెల్లవారిన తర్వాత వాటిని పేస్ట్ గా చేసుకొని అందులో కొద్దిగా తేనె వేసుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేసుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది.

పెరుగు నిమ్మరసం:ఒక స్పూన్ పెరుగులో ఒక టీ స్పూన్ నిమ్మ రసం కలిపి ముఖానికి రాసుకోవాలి పదినిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగి వేయాలి ముఖం కాంతివంతంగా స్మూత్ గా అవుతుంది.

ముల్తాని మట్టి:రోజ్ వాటర్ లో ముల్తానీ మట్టిని ముఖానికి రాసుకోవాలి పదినిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగి వేయాలి ఈ మిశ్రమం మెటిములు రాకుండా నివారిస్తుంది.

విటమిన్E క్యాప్సిల్స్: నేడు లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ఈ క్యాప్సిల్స్ ని చాలా మంది అప్లై చేస్తున్నారు రాత్రి సమయంలో ముఖానికి అప్లై చేసిన తర్వాత తెల్లవారుజామున చల్లటి నీటితో కడిగియడం వల్ల కళ్ళ క్రింద నల్లటివలయాలు మాయమై,మొఖం కాంతివంతంగా తయారవుతుంది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Check Also
Close
Back to top button