Health Tips

health tips of the day

health tips of the day

హెల్త్ టిప్స్: జీవనశైలిలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. ప్రపంచమంతా ఈ మార్పును అంగీకరించాల్సిందే! కొందరు బరువు పెరగడంతో బాధపడుతుంటే ,మరికొందరు చాలా సన్నగా ఉన్నామని బాధపడుతుంటారు. కొందరికి గుండె జబ్బులు, మరికొందరికి కీళ్ల నొప్పులు.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహారం కలుషితంగా మారింది. అందువలన మన శరీరానికి కావాల్సిన పోషకాలు లభించక అనేక వ్యాధుల బారిన పడుతున్నాము. తాజా నివేదిక ప్రకారం ఎక్కువ శాతం మంది కీళ్లనొప్పులతో బాధపడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు.

arthritis
arthritis

హెల్త్ టిప్స్ ఆఫ్ ద డే: ఈరోజు హెల్త్ టిప్స్ ఆఫ్ ద డే లో కీళ్ల నొప్పుల గురించి తెలుసుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుందాం.

కీళ్లనొప్పి వ్యాధిని ఆర్థరైటిస్ అనే పేరుతో పిలుస్తారు. ఇది ఎక్కడైతే ఎముకలు జాయింట్ చేయబడి ఉంటాయో అక్కడ ఈ వ్యాధి వస్తుంది. ఇది బయటకు కనిపించదు, కానీ దీని వలన తీవ్రమైన నొప్పి అలాగే వాపు కూడా ఉంటుంది. ఇది ఎక్కువగా మోకాళ్ళ దగ్గర వస్తుంది. దీని వలన నిలబడడం, నడవడం, కూర్చోవడం కూడా కష్టంగా మారుతుంది.

దీనికి డాక్టర్స్ వద్ద చూపించిన ఎక్కువ లాభం ఉండదు. మందులు పనిచేసిన అంతవరకే రిలాక్స్ గా ఉండి తిరిగి మామూలు అవుతుంది. అందువలన కీళ్లనొప్పులు ప్రారంభ దశలో ఉన్నప్పుడే కొన్ని జాగ్రత్తలు వాడితే వాటి వలన చాలా ఉపయోగం ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కీళ్లనొప్పితో బాధపడే వారికి, వారి కుటుంబంలోని వారికి ఈ కీళ్ల సంబంధించిన వ్యాధి గురించి అవగాహన ఇస్తుంది.

కీళ్లనొప్పుల వ్యాధిని నివారించడానికి ముఖ్యంగా మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అంతేకాక శారీరక శ్రమ కూడా చాలా అవసరం. ఆహార పదార్థాలకు దూరంగా ఉండి మంచి పోషకాలను ఇచ్చే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల సమస్యల నుండి తొందరగా బయటపడవచ్చు. మనం ప్రతిరోజు తీసుకునే ఆహార పదార్థాలు, డ్రింక్స్ వంటివి ఈ సమస్యను పెరిగేలా చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాక కీళ్ల నొప్పులు తగ్గుముఖం పట్టకుండా శాశ్వతంగా ఉండేలాగా చేస్తాయని తెలిపారు.

కీళ్ల నొప్పులను మరింత ప్రభావితం చేసే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం:

చక్కెర: చక్కెర గురించి మనకు తెలిసిందే. ప్రస్తుత కాలంలో చాలామంది దీని వలన వచ్చే సమస్యలను గుర్తించి దీని వాడకం తగ్గించి, దీనికి బదులుగా బెల్లం వాడుతూ తమ ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నారు. అంతేకాక షుగర్ ఉన్నవారు చక్కెరను వాడకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు.

షుగర్ ఉన్న వారికే కాక కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా చక్కెర వాడకాన్ని తగ్గించడం చాలా మంచిది. అంతేకాకుండా స్వీట్స్, ఐస్ క్రీమ్, సోడా వంటి డ్రింక్స్ కు దూరంగా ఉండటం మంచిది. ఈ విధంగా చేయడం ద్వారా కీళ్ల నొప్పుల వ్యాధిని ప్రారంభ దశలోనే అరికట్టవచ్చు.

చిరు తిండ్లు: ఎక్కువగా మనం బయట దొరికే స్ట్రీట్ ఫుడ్ నే ఇష్టపడుతుంటాము. బయట దొరికే స్నాక్స్ ఐటమ్లను నూనెలలో డీప్ ఫ్రై చేసి అమ్ముతారు. కీళ్లనొప్పుల ఉన్నవారికి ఫ్రై చేసిన పదార్థాలు తినకుండా ఉండటం మంచిది. అంతేకాక వీటివలన అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. నూనెలలో వేయించిన మాంసం అలాగే చికెన్ లాంటివి కాక ఫ్రై చేసిన అనేక రకాల వంటలు కూడా తినకూడదు.

ఇంటిలో తినకూడని ఆహార పదార్థాలు: మనం ప్రతిరోజు ఆహారాన్ని తినడానికి చేసుకుంటాము. అది కొంచెం మిగిలిపోయిన దాన్ని పారే వేయకుండా మరుసటి రోజు తింటూ ఉంటాం. అలా తినడం ద్వారా చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా చల్లబడిన ఆహార పదార్థాలు తింటే కీళ్ల నొప్పులు అధికమవుతాయి. అందువలన ఎప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని తినడం మంచిది.

ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు: ప్రస్తుత కాలంలో ఇంటిలో చేసుకోవడానికి ఓపిక లేదని ఆర్డర్స్ చేసుకొని తింటూ ఉంటారు. ఇలా ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు అసలు తినకూడదు. ఎక్కువగా పిజ్జా, బర్గర్, నూడిల్స్, గోబీ వంటి వాటిని ప్యాక్ చేసి అమ్ముతారు. వీటిని తినడం వలన ఆర్థరైటిస్ వ్యాధి అధికమవుతుంది. అందువలన వీలైనంత తొందరగా వీటిని మానివేయడం చాలా మేలు.

ఇంటిలో నిల్వ చేసి పెట్టుకున్న ఆహార పదార్థాలు:

కొంతమంది ఇంటిలో వంటలు చేస్తూ రేపటి కోసం అని కొంత ఆహారాన్ని తీసి ఫ్రిడ్జ్ లలో నిలువ చేస్తూ ఉంటారు. అలాంటి ఆహారం తినడం చాలా ప్రమాదం. వీటిలో ఎక్కువగా మాంసంతో చేసిన ఆహార పదార్థాలను నిలువ ఉంచి వాటిని తీసుకోవడం ద్వారా ఆర్థరైటిస్ సమస్య మరింత అధికమవుతుందని ఒక నివేదిక ద్వారా బయటపడింది. మాంసమే కాక నిల్వ ఉంచుకున్న పాలు, పాలతో చేసిన పదార్థాలు తినకూడదు.

నిల్వ ఉంచిన పాలపదార్థాలలో ఉండే ప్రోటీన్ కీళ్ల చుట్టూ ఉన్న కణజాలాన్ని దెబ్బతీస్తుంది. కొందరికి నొప్పితో సహా వాపు కూడా ఉంటుంది. అటువంటి వారికి నిల్వ ఉంచిన మాంసంలో ఉండే సంతృప్తి క్రోవ్వులు ఈ వాపులను మరింత అధికం చేస్తాయి. అంతేకాకుండా చెడు క్రొవ్వును పెంచుతాయి.

ఒమేగా-6: ఒమేగా సిక్స్ అనేది ప్యాటి యాసిడ్. ఈ సమస్యను మరింత తీవ్రంగా చేస్తుంది. పొద్దు తిరుగుడు విత్తనాలు, పల్లీలు, సోయా నూనెలో అధికంగా ఉంటాయి. అందువలన వీటిని ఎట్టి పరిస్థితులలో వాడకూడదు.

సంతృప్త కొవ్వులు కలిగిన పదార్థాలు: వనస్పతి, క్రీమ్ చీజ్, వెన్న, చీజ్ లలో సంతృప్త కొవ్వులు ఉంటాయి. వీటికి దూరంగా ఉండటం చాలా మంచిది. వీటివియోగం అధికంగా ఉండకూడదు. పరిమితికి తగ్గట్టుగా ఉండాలి. లేదంటే కీళ్ల నొప్పులు సమస్య అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఆల్కహాల్: ఆల్కహాల్ తీసుకోవడం వలన కూడా ఈ సమస్య అధికమవుతుందని అందువలన కీళ్ల నొప్పుల సమస్య ఉన్నవారు ఆల్కహాల్ను పరిమితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

గుడ్లు: సాధారణంగా గుడ్లు తినడం వలన మనకు అనేక లాభాలు ఉన్నాయని మనం త్వరగా అనారోగ్యాల బారిన పడకుండా ఉండవచ్చని మనకు తెలిసిందే. కానీ కీళ్ల నొప్పుల సమస్య ఉన్నవారు గుడ్లను ఎక్కువగా తీసుకోకూడదు అని వైద్యులు చెబుతున్నారు.

eggg for arthritis
eggg for arthritis

ఎందుకంటే గుడ్లలో ఉండే పచ్చ సోనలో ఎక్కువ మొత్తంలో అరాకిడోనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కీళ్లలో మంటను పుట్టేలా చేస్తుంది. అందువలన వైద్యులు వీటిని పరిమితికి మించి తీసుకోకూడదని సలహా ఇస్తుంటారు.

ఉప్పు: మనం చేసుకునే ప్రతి ఆహార పదార్థాలలో ఉప్పును కచ్చితంగా వాడతాము. ఎందుకంటే ఉప్పు లేకపోతే వంట టేస్ట్ కూడా తగ్గిపోతుంది. అంతటి ప్రాముఖ్యత ఉప్పుకు ఉంది. అదేవిధంగా దీనిని ఎక్కువగా వేసుకోకూడదు. చీజ్, రొయ్యలు, పిజ్జా వంటి ఆహార పదార్థాలలో సహజంగానే ఉప్పు నిల్వలు ఉంటాయి.

అందువలనవీటిలో కాస్త తగ్గించి వేసుకోవాలి. ఎక్కువ శాతం బీపీ ఉన్నవారు ఉప్పును అధికంగా తీసుకోకూడదని వైద్యులు చెబుతుంటారు. అంతేకాక కీళ్ల నొప్పుల సమస్య ఉన్నవారు కూడా ఉప్పును కొంచెం తగ్గించి వాడటం చాలా మంచిది.

health tips for women
health tips for women

హెల్త్ టిప్స్ ఫర్ వుమెన్: ప్రస్తుత కాలంలో ఆడవారికి అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిలో ఎక్కువ శాతం బరువు పెరగడం. బరువు ఎక్కువగా పెరగడం వలన శరీరాకృతి మారి, శరీరం బరువు మొత్తం కాళ్లపై ఆధారపడి ఉంటుంది. శరీర బరువు పెరగగానే కాళ్ళ మీద భారం అధికమై కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి.

అందువలన కీళ్ల నొప్పులను ప్రారంభంలోనే అరికట్టాలి. లేకపోతే చాలా ఇబ్బందులు పాలవుతారు. ఇంట్లో కానీ బయట కానీ ఇది పెద్ద సమస్యగా మారుతుంది. ఇంట్లో పనులు చేసుకోలేరు. బయట తిరగలేరు. ఆఫీసులలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువలన ఈ వ్యాధిని ప్రారంభంలోనే అరికట్టడానికి పై టిప్స్ ఫాలో అవ్వడం ఉత్తమం. ఈ టిప్స్ ను ఫాలో అవ్వడం వల్ల కీళ్ల నొప్పుల వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button