Horse gram in Telugu: ఉలవలు ఉపయోగాలు తెలిస్తే వదిలిపెట్టరు

Horse gram in Telugu: సాధారణ జబ్బుల నుంచి కరోనా వరకు రక్షణ గా మన ఆహారపు అలవాట్ల ను, జీవన శైలిని మార్చుకోవాలి. జీవనశైలిలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం,శుచి,శుభ్రత లను పాటించటం అలాగే ఆహారపు అలవాట్ల లో తాజా కూరగాయలను,ఆకుకూరలను, చిరుధాన్యాలు, నవధాన్యాలు వంటి వాటిని చేర్చుకోవాలి. అత్యంత పోషక విలువలు కలిగిన నవధాన్యాలలోని ఒకటైన ఉలవల గురించి తెలుసుకుందాం.

పూర్వకాలం లో రాజులు తమ యొక్క రక్షణ దళం లోని గుర్రాలకు, ఏనుగులకు ఆహారంగా ఈ ఉలవలను దాన గా వాడేవారు.అలాంటి ఉలవలను నేటి ఆధునిక యుగంలో మారిన జీవనశైలి మేరకు ఆహారపు పదార్థాలలో తప్పనిసరిగా చేర్చుకోవాలి.ఉలువలు రుచుకే కాక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉలవలు మాంసం కంటే ఎక్కువ పోషక విలువలు కలిగి ఉన్నాయి.ప్రతి 100 గ్రాముల ఉలవ గుగ్గిళ్ళలో 321 క్యాలరీల శక్తి,22 గ్రాముల ప్రోటీన్లు,57 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 27 మిల్లీగ్రాముల క్యాల్షియం,311 మిల్లీ గ్రాముల పాస్పరస్, మరియు చాలా ఎక్కువ మోతాదులో పీచు పదార్థాలు ఉన్నాయి.

Horse gram in Telugu

అయితే ఉలువలను ఆహారంగా తీసుకునే ముందు సుమారు 8 గంటలు నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెట్టిన ఉలవలను గుగ్గిళ్ళలాగా, నీటిని ఉలవచారుగాను తయారు చేసుకోవచ్చు. ఉలవలు తినడం వలన ప్రయోజనాలు ముఖ్యంగా కిడ్నీలలో రాళ్లు ఏర్పడిన వాళ్లకి రాళ్లు కరగడానికి ఎంతో ఉపయోగకారి, అధిక బరువు తగ్గాలి అనుకునే వారికి ఉలవలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్లు పుష్కలంగా ఉండటం వలన సులభంగా బరువు తగ్గవచ్చు.

కొత్తగా పెళ్లయిన జంట లో మగవారికి వారి ఆహారపు పదార్థాలలో ఉలవలను చేర్చాలి. అలాగే సంతానం కలగని మగవారిలో స్పెర్మ్ కౌంట్ పెరుగుదలకు తోడ్పడును. త్వరగా అలసిపోయిన వారికి, నీరసించే వారికి, బలహీనవంతులకు ఈ ఉలవలను రోజు ఒక కప్పు చొప్పున తినిపిస్తే అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చును. ముఖ్యంగా పిల్లలకు రెడీమేడ్ ఫుడ్ బదులు ఈ ఉలవలను వివిధ రకాల లో వండి పిల్లలకి తినిపించడం వలన పిల్లలు ఎదుగుదలకు, బుద్ధి వికాసానికి మంచి గా ఉపయోగపడుతుంది.

నెలసరి సరిగ్గా రాని మహిళల్లో  ఉలవలను తినడం వలన రుతుసంబంధ సమస్యలు రావు. అలాగే సైనికులకు వారి దైనందిన ఆహారంలో ఉలవలను ప్రముఖ స్థానం కల్పించారు. అకారణంగా వేడిమి వలన కంటిలో పులుసులు కట్టడం,నీరు కారడం లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చును. ముఖ్యంగా లివర్ పని వ్యవస్థను వేగవంతం చేస్తుంది.రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను, రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది. అయితే ఈ ఉలవలను ఎక్కువ మోతాదులో తినరాదు కారణం శరీరం వేడి చేస్తుంది. కనుక ఉలవలతో చేసే పదార్థాలు తిన్న తర్వాత తప్పనిసరిగా తగినంత మజ్జిగ లేదా పెరుగు ను తీసుకోవాలి.

Exit mobile version