Health Tips

Onion Uses for Hair: ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకునే ఉల్లిపాయ గురించి తెలుసా?

Onion Uses for Hair: ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకునే ఉల్లిపాయ గురించి తెలుసా?

ఉల్లిపాయ అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ తెలిసినదే. ఎందుకంటే దీని వాడకం అంత ఎక్కువ మనం ప్రతిరోజు తినే ఆహారంలో భాగంగా ఉల్లితో చేసిన వంటలనే తింటున్నాం. ఈ ఉల్లిపాయలను ప్రపంచం మొత్తంగా అన్ని రకాల వంటలలో ఉపయోగిస్తారు. అందువల్ల దీని గురించి మనందరికీ తెలిసిందే.

ఉల్లిపాయలలో చాలా రకాలు ఉన్నాయి. తెల్లని ఉల్లిపాయలు, ఎర్రని ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు, ఎక్కువ వాసన వచ్చేవి మరియు తక్కువ వాసన వచ్చేవి మరికొన్ని తియ్యనివి కూడా ఉంటాయి. ఈ ఉల్లిపాయకు ప్రభుత్వాలను పడగొట్టగలిగే శక్తి ఉంటుంది.

Onion Uses for Hair

ఈ ఉల్లిపాయ దొరికితే అది తక్కువ రేటుకు దొరుకుతుంది, లేకపోతే సామాన్యుడు కొనలేనంతగా పెరుగుతుంది. కొంతకాలం క్రితం ఈ ఉల్లిపాయ రేటు పెరిగి ప్రతిరోజు వార్తల్లో నిలిచింది. ప్రపంచంలో చాలా దేశాల్లో ఉల్లి పంటను సాగు చేస్తున్నారు. చాలా దేశాల్లో ఉల్లిపాయకు ఉన్నంత డిమాండ్ అంతా ఇంత కాదు. ఉల్లిగడ్డను పండించడానికి 4,000 ఏళ్ల నుంచి ప్రయోగాలు జరిగాయి.

ఎల్ విశ్వవిద్యాలయం దాచిపెట్టిన వెసుక్పుటేనియా నాగరికత నాటి పత్రం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిని 1995లో ఫ్రెండ్స్ పురావస్తు శాస్త్రవేత్త జిన్బుటేరో ఆ పత్రాన్ని గుర్తించి ప్రపంచానికి తెలియజేశారు. అంతవరకు ఉల్లికి ఇంత చరిత్ర ఉందని ఎవరికీ తెలియలేదు. ఉల్లితో పాటు ఉల్లికాడలు, వెల్లుల్లి ,అడవి వెల్లుల్లి వెసుక్పుటేనియాలో ఉపయోగించేవారని అర్థమవుతుంది.

ఐరోపాలో కూడా ఉల్లిపాయల వినియోగం పూర్వం నుంచి వాడుకలో ఉన్నట్లు తెలుస్తుంది. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం కనీసం 180 దేశాలకు పైగా ఉల్లి సాగును చేస్తున్నారు. గోధుమలు పండించే దేశాల కంటే ఉల్లిని పండించే దేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉల్లిని దిగుమతి చేసుకోవడంలో భారత్, చైనా ముందంజలో ఉన్నాయి. దిగుబడిలో కూడా 50% వాటా ఈ రెండు దేశాలదే చైనా కంటే భారత్లో ఎక్కువ సాగు చేస్తారు. అయినప్పటికీ చైనాలో దిగుబడి ఎక్కువగా వస్తుంది.

భారత్ పండించిన ఉల్లిని90 శాతం స్వదేశంలో ఖర్చు చేసి మిగిలిన 10 శాతాన్ని ఎగుమతి చేస్తుంది. ఉల్లి వినియోగంలో లిబియా మొదటి స్థానంలో ఉంది. బ్రిటన్ లోచాలా తక్కువ ఉల్లిని వినియోగిస్తారు.

ఉల్లి వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. సహజమైన చక్కెర విటమిన్ ఏ, బి,  విటమిన్ సి ,ఈ, పొటాషియం, ఐరన్ ,సల్ఫర్, కోరిక్ ఆమ్లం, పీచు పదార్థం, వంటి పోషకాలు ఉల్లిలో ఉన్నాయి. తక్కువ క్యాలరీలు కలిగినది ఉల్లిపాయ. ఆంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల క్యాన్సర్ వ్యాధి ఉన్నవారు దీనిని ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

200 గ్రాముల ఉల్లి ముక్కలు ప్రతిరోజు తీసుకోవడం ద్వారా షుగర్  నియంత్రణలో ఉంటుంది. అలాగే ఆడవారు ఉల్లి రసాన్ని ప్రతిరోజు తీసుకుంటే నెలసరి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే రక్తపోటు, అలర్జీ, దగ్గు, జలుబు, గుండె జబ్బులు అస్తమా, ఇన్ఫెక్షన్స్ వంటి వాటిని కూడా తగ్గించుకోవచ్చు. ఉల్లిపాయ రసానికి తేనె కలిపి చుక్కల మందుల చేసుకొని కంటిలో వేసుకుంటే కంటి చూపు మెరుగు పడుతుంది.

ఉల్లి గుజ్జుకు కొంచెం వెనిగర్ కలిపి తీసుకుంటే జీర్ణాశయ శక్తి పెరుగుతుంది. అలాగే ఉల్లిపాయ  జుట్టుకు కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ గుజ్జు జుట్టుకు రాసుకోవడం ద్వారా జుట్టు రాలిపోవడం ఆగిపోతుంది. అలాగే వెట్రుకలు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది.

Hair fall remedy Onion Uses for Hair:

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Check Also
Close
Back to top button