Rice with curry leaves:ఈ ఆధునిక కాలంలో మనిషి ఉరుకుల, పరుగుల కాలంలో ఏదైనా చాలా త్వరగా కావాలని అనుకుంటున్నాడు.వస్త్రాల విషయంలో,ఆహార విషయంలో,ఏదైనా సరే సమయం ఆదా చేసుకోవాలని అనుకుంటున్నారు.ఉద్యోగానికి వెళ్లిన,స్కూల్ కి వెళ్ళిన,పనికి వెళ్లిన టైం మేనేజ్మెంట్ కు అలవాటు పడి త్వరగా రెడీ అయ్యే లంచ్ బాక్స్ ను తయారుచేయడానికి మొగ్గుచూపుతున్నారు.అలాంటి ఆహార పదార్థాల్లో కరివేపా రైస్ తయారీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము.
దీనికి కావాల్సిన పదార్థాలు:
కరివేపాకు ఆకులు, పచ్చిమిరప కాయలు,ఇంగువ,తగినంత ఉప్పు. ముందుగా నాణ్యమైన బియ్యంతో అన్నం ను వండుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. తర్వాత నాలుగు రెమ్మల కరివేపా ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి సిద్ధంగా ఉంచుకోవలెను,మరియు నాలుగు పచ్చిమిరపకాయలను తీసుకొని బాగా కడిగి కరివేపాకులతో పాటుగా మిక్సీలో వేసుకొని తగినంత ఉప్పు వేసి పేస్టుగా చేసుకోవలెను. ఇలా తయారైన కరివేపా పచ్చిమిర్చి పేస్టులో కొద్దిగా ఇంగువాను కలుపుకోవలెను.
తయారు చేసే విధానం
ఈ పేస్టు అంతయు ఒక బౌల్లో తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని సన్నని మంటపై వేయించుకోవలెను.ఇలా వేయించుకున్న పేస్టులో ముందుగానే తయారు చేసుకున్న అన్నమును బాగా కలపాలి,ఇక ఈ అన్నంలో రుచి కొరకు ఒక టీ స్పూన్ నిమ్మరసం ను కలుపుకోవలెను,మరియు రెండు రెమ్మల కొత్తిమీర ఆకులను కూడా కలుపుకోవచ్చును. ఇలా చాలా తక్కువ సమయంలోనే కరివేపా రైసును లంచ్ బాక్స్ గా తయారు చేసుకుని సమయం ఆదా చేసుకోవచ్చును.