Health Tips

Surrogacy: సరోగసి అంటే ఏమిటి? దీనిపై వివాదం ఎందుకు ?

surroacy

Surrogacy: ప్రముఖ సినిమా దంపతులైన నయనతార, విగ్నేష్ లకు కవల పిల్లలు పుట్టారని మనకు తెలిసిన విషయమే. కానీ వారిద్దరికీ ఈ సంవత్సరం జూన్ 9 మహాబలేశ్వరంలో వివాహం చేసుకున్నారు. అయితే పెండ్లైన నాలుగు నెలలకే వీరికి కవలలు జన్మించారని తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

అయితే వీరు సరోగసి ద్వారా పిల్లల్ని కన్నారని సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిచ్చామని ఇటీవల ప్రకటించిన విషయం వివాహ వివాదాస్పదంగా మారింది. అయితే సరోగసి విధానాన్ని పెళ్లి కాకముందే ఒప్పందం చేసుకున్నారు అనే విషయం క్లుప్తంగా అర్థమవుతుంది.

సరోగసి విధానం పాటించే అర్హత మీకు ఉందా అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. గతంలో కూడా చాలామంది సినీ ప్రముఖులు ఈ విధానాన్ని అనుసరించి సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చారు.

బాలీవుడ్ స్టార్స్ అయినా షారుక్ ఖాన్, శిల్పా శెట్టి, ప్రీతి జింటా, కరణ్ జోహార్, సన్నీలియోన్, ప్రియాంక చోప్రా వారంతా సరోగసి ద్వారానే పిల్లల్ని కన్నారు. అంతేకాక టాలీవుడ్ లో నటి మంచు లక్ష్మి కూడా ఈ విధానం వల్లనే విద్య, నిర్వాన లకు జన్మనిచ్చారు. అయితే ఈ సరోగసి విధానం ఈ సంవత్సరం జనవరి నుండి రద్దు చేయబడింది. అలాంటప్పుడు విగ్నేష్, నయనతారలకు కవలలు ఎలా జన్మించారని విషయం అనేక సంఘర్షణలకు దారితీస్తుంది.

surrogate
surrogate

సరోగసి అంటే ఏంటో తెలుసుకుందాం: అద్దెగర్భం ద్వారా పిల్లలు కనడాన్ని సరోగసి అంటారు.

సరోగసి విధానంలో రెండు రకాలు ఉన్నాయి.

1. సాంప్రదాయ సరోగసి

2. గేస్టేషనల్ సరోగసి

సంప్రదాయ సరోగసి అంటే ఏంటో తెలుసుకుందాం:

పిల్లలు కావాలనుకునే దంపతులు తమ గర్భం నుండి కాకుండా మరొక మహిళ గర్భం అద్దెకు తీసుకొని పిల్లలను కనే విధానం సరోగసి అంటారు. పురుషుడు వీర్యాన్ని, మహిళ యొక్క అద్దెగర్భంలో ప్రవేశపెడతారు. ఈ విధంగా అద్దెగర్భం ఇచ్చే మహిళలను సరోగ్రేట్ మదర్ అంటారు.

ఈ మహిళ బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ, ప్రసవం తర్వాత బిడ్డతో ఎటువంటి సంబంధం కలిగి ఉండదు. ఈ విషయాలు ముందుగానే ఒప్పందం ద్వారా నిర్ణయించుకుంటారు. దీనిని సంప్రదాయ సరోగసి అంటారు.

గేస్టేషనల్ సరోగసి అంటే ఏంటో తెలుసుకుందాం:

ఈ సరోగసిలో మరొక విధానం కూడా ఉంది. దీనిని గెస్టేషనల్ సరోగసి అంటారు. ఈ విధానంలో దంపతులు యొక్క ఇద్దరు ప్రమేయం ఉంటుంది. స్త్రీ యొక్క అండాన్ని మరియు, పురుషుడు వీర్యాన్ని ఫలదీకరణం చెందించి, ఆ తర్వాత వాటిని మరొక శ్ స్త్రీ గర్భంలో ప్రవేశపెడతారు.

ఎవరి అండల ద్వారా బిడ్డ జన్మిస్తాడో వారు బిడ్డకు బయోలాజికల్ పేరెంట్స్ అవుతారు. ఇందులో సరోగ్రేట్ మదర్ కు ఎటువంటి సంబంధం ఉండదు. ఒప్పందం ప్రకారం వారికి డబ్బు కూడా చెల్లించాల్సి ఉంటుంది.

సరోగసిపై ఎందుకు ఆసక్తి చూపుతారు:

సరోగసి ద్వారా పిల్లలను కనాలనుకోవడం వెనుక దంపతులకు అనేక కారణాలు కలవు. వారి వ్యక్తిగత కారణాలు, దంపతులలో సంతాన ఉత్పత్తి సమస్యలు, మరియు ఆరోగ్య సమస్యలు అనేకం ఉన్నాయి. కొందరు మహిళలు గర్భాధారణ చేయలేనప్పుడు, గర్భాధారణవారికి ప్రాణాంతకం అయినప్పుడు, వైద్యుల సలహాతో సరోగసిని ఎంచుకుంటారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు ముఖ్యంగా ఈ విధానం వైపు ఆసక్తి చూపుతున్నారు. అందులో ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన మహిళలు ముందు వరుసలో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం కాన్పు అనంతరం స్త్రీ శరీరంలో వచ్చే మార్పులు. తమ కెరీర్ ను దెబ్బతీస్తాయని, ఆ మార్పుల కారణంగా సినిమాలలో తమకు అవకాశాలు రావు అని భావించి ఈ విధానం వైపు ఆసక్తి చూపుతున్నారు. ఫ్యాషన్ రంగంలో కలవారు కూడా తమ కెరియర్ కోసం సరోగసిపై ఎక్కువగా ఆధారపడుతున్నారు.

surrogacy for swalinga  sampark
surrogacy for swalinga sampark

సరోగసి విధానంను పాటించి పిల్లలు కనడానికి అర్హత ఎవరికి ఉందో తెలుసుకుందాం.

ఒక స్త్రీ మరొక స్త్రీ కొరకు ఈ విధానమును పాటించవచ్చు. ఒక మహిళ తను గర్భధారణ చేయలేనప్పుడు, తను పిల్లలు కనలేదని నిర్ధారించుకున్నప్పుడు, డాక్టర్ల ద్వారా ఈ విషయం నిరూపితమైనప్పుడు మాత్రమే సరోగసి విధానాన్ని పాటించవచ్చు.

స్వలింగ సంపర్కులు తమకు బిడ్డలు కావాలని కోరుకున్నప్పుడు కూడా సరోగసి విధానాన్ని పాటించవచ్చు.

సరోగసి విధానాన్ని ఎందుకు నియంత్రించారో తెలుసుకుందాం.

సరోగసి విధానాన్ని వాణిజ్యపరంగా కూడా పాటిస్తారు. సరోగసిలో డబ్బు తీసుకొని బిడ్డను కనివ్వటంను వాణిజ్యపరమైన సరోగసి అంటారు. ఈ విధానంలో అనేక క్రమాలు జరుగుతున్నాయని పలు దేశాలు ఈ సరోగసి నియమాన్ని నిషేధించాయి. పిల్లల కోసం దంపతులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఎన్నో పూజలు దానాలు చేస్తుంటారు.

ఆరోగ్య కారణాల వల్ల సంతానం లేకపోవడంతో వారికి మాత్రమే సరోగసి ద్వారా సంతానం కలిగించాలని ప్రభుత్వాలు తెలుపుతున్నాయి. కానీ మన దేశంలో మాత్రం సరోగసిని ఒక వ్యాపారం మార్గం భావిస్తున్నారు. ఆర్థిక సమస్యల వల్ల మహిళలు ఈ విధానాన్ని ఎంచుకుంటున్నారు.

లాక్ డౌన్ లో ఉద్యోగాలు కోల్పోయిన స్త్రీలు డబ్బు సంపాదన కోసం ఈ విధానాన్ని ఎంచుకుంటున్నారని ఒక నివేదిక ద్వారా వెళ్లడయ్యింది. ఒక మహిళ తన గర్భాన్ని అద్దెకి ఇస్తే అక్కడి పరిస్థితులను బట్టి 15 నుంచి 30 లక్షల వరకు డబ్బు వసూలు చేస్తున్నారు. ఈ డబ్బుతో తమ ఆర్థిక సమస్యలు తీరుతాయని మహిళల ఆలోచిస్తున్నారు.

కొందరు అక్రమ రవాణాకు కూడా అద్దె గర్భాన్ని ఉపయోగిస్తున్నారు. వీటన్నిటిని పరిశీలించిన ప్రభుత్వం సరోగసి పాటించడాన్ని కొన్ని నియమ నిబంధనల ద్వారా పాటించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Surrogacy:? సరోగసి నియమాలు మరియు సరోగసి ద్వారా పిల్లలు కనడానికి ఎవరు అర్హులు తెలుసా?

సరోగసి విధానాన్ని పాటించడానికి ఆచరించవలసిన నియమాలు:

అద్ద గర్భాన్ని పాటించే మహిళలకు పెళ్లి అయి ఉండాలి.

విడాకులు తీసుకున్న మహిళలకు కూడా అర్హత ఉంటుంది.

ఆమెకు గతంలో ఒక బిడ్డ జన్మించి ఉండాలి.

సర్ ఓ గ్రేట్ అయ్యే వారి వయసు 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

సరోగసి ఎంచుకున్న జంటకు దగ్గర బంధువులు కూడా ఉండవచ్చు.

సరోగసి ద్వారా ఎవరు బిడ్డను పొందవచ్చు:

పెళ్లయిన ఐదు సంవత్సరములు పూర్తయిన వారు మాత్రమే అర్హులు.

భార్య వయసు 25 సంవత్సరంల నుండి 50 సంవత్సరాలు మధ్య ఉండాలి.

భర్త వయసు 26 సంవత్సరంలో నుండి 50 సంవత్సరాలు మధ్య ఉండాలి.

వీరికి గతంలో పిల్లలు కలిగి ఉండకూడదు.

దత్తత ద్వారా కూడా పిల్లలు కలిగి ఉండకూడదు.

ఇద్దరిలో ఎవరికైనా ఇన్ పెరిట్రిలిటీని నిరూపిస్తూ జిల్లా వైద్యులు సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది.

అద్దెగర్భం ధరించిన తల్లికి ప్రసవం తర్వాత 16 నెలలు ఇన్సులెన్స్ చేయాల్సి ఉంటుంది.

ఇండియాలో సరోగసి విధానం:

ఇండియాలో కొత్త సరోగసి విధానం 2022 జనవరిలో అమలులోకి వచ్చింది.

ఇండియాలోని ఏ జంటకు అయినా బిడ్డను కానీ ఇవ్వటానికి అనుమతి ఉంటుంది.

డబ్బు తీసుకొని సరోగసి పాటించడంను ఇండియాలో నిషేధించారు.

సరోగసి ద్వారా బిడ్డను కానీ వదిలిపెట్టడం రవాణా చేయడం లాంటి వాటిని కేంద్రం నిషేధించింది.

సరోగసి ద్వారా తల్లి అయినా మహిళ ప్రభుత్వ ఉద్యోగులకు 180 రోజుల మెటర్నిటీ సెలవులను పొందే అవకాశాన్ని కల్పించింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Check Also
Close
Back to top button