Plants

Fenugreek Leaves Benefits in Telugu: మెంతికూర

Fenugreek Leaves Benefits in Telugu menthi kura: పచ్చటి,ఆకుకూరలు సాధారణంగా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను  కలిగిస్తాయి. ఒక్కో ఆకుకూరతో శరీరానికి అనేక లాభాలు కలుగుతాయి. మెంతికూర ఇందులో ముఖ్యంగా. రుచిని పెంచడమే కాకుండా అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. కాబట్టి మెంతులకూర ను బహురోగ నివారిణిగాకూడ పిలుస్తారు.మెంతి గింజలు అనేగా ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేస్తాయి.

అది మనకు తెలిసిన విషయమే.  మెంతం కూరfabaceae కుటుంబానికి చెందినది. దీన్ని శాస్త్రీయ నామంtrigonella foenum graecum. దీనిని ఇంగ్లీషులోFenugreek greens అంటారు.హిందీలోmethi అంటారు.దీంతోపాటు మెంతి ఆకులు గుండె సంబంధిత సమస్యలను మరియు మధుమేహం తగ్గించడంలో ఉపయోగపడుతుంది. మ్యాంగనీస్ ,క్యాల్షియం ,సెలీనియం ,ఐరన్ మినరల్స్, జింక్ వంటి పోషకాలు మెంతి ఆకులో  సమృద్ధిగా లభిస్తాయి. ఈ మెంతిఆకులను తీసుకోవడం ద్వారాtype -1,type-2 మధుమేహ వ్యాధిగ్రస్తులలో గ్లూకోస్ స్థాయిని కంట్రోల్ ఉంచడంలో సహాయపడుతుంది. 

మంచి కొలెస్ట్రాల్ ను పెంచి,చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఈ మెంతి ఆకులు ఉపయోగపడతాయి. దీనివల్ల గుండె సమస్యలు దరిచేరనీయవు. పీచు పదార్థం అధికంగా మెంతి ఆకులలో ఉంటుంది. కాబట్టి జీనక్రియను సక్రమంగా పనిచేసేటట్లు చేస్తుంది .దీని ద్వారా మల బద్ధకం వంటి సమస్యను తగ్గిస్తుంది. కడుపులో ఉండే నులిపురుగులు ఈ మెంతిఆకుల రసాన్ని తీసుకోవడం ద్వారా చనిపోతాయి.

Fenugreek Leaves Benefits in Telugu మెంతికూర
Fenugreek Leaves Benefits in Telugu: మెంతికూర

ఐరన్ అధికంగా కలిగి ఉంటుంది మెంతం కూర. రక్తహీనత సమస్యలతో బాధపడుతున్న వారు వీటిని తీసుకోవడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. అనేక పోషక విలువలు కలిగి ఉంటుంది కాబట్టి దీనిని ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. మెంతులను సువాసన ద్రవ్యంగా కూడా ఉపయోగిస్తారు కాబట్టి మసాలా దినుసులలో మరియు పోగు పెట్టే వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

కూరలోని క్యాలరీస్:

100 గ్రాముల మెంతం కూరలో పోషక విలువలు. 100 గ్రాములు 323 కిలో క్యాలరీల శక్తిలభిస్తుంది. నీరు 8.84g. ఒక కప్పు మెంతం కూరలో 28 గ్రా,ప్రోటీన్ 1.23 గ్రామ్స్, కార్బోహైడ్రేట్స్ 1.68 గ్రామ్స్ కొవ్వు 0.25 గ్రామ్స్ లభిస్తుంది. ఐరన్ 1.59 మిల్లీగ్రామ్స్, సోడియం 21.30 మిల్లీగ్రామ్స్, ఫాస్పరస్ 14.28 మిల్లీగ్రామ్స్, ఫైబర్ 2.52 మిల్లీగ్రామ్స్. విటమిన్ b 6,0.10 మిల్లీగ్రామ్స్ విటమిన్ బి టు 0.08 మిల్లీగ్రామ్స్.

కూర ఆకు కూర పప్పు తయారీ విధానం. ముందుగా ఒక కట్ట మెంతమాకులను తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే మరీ చేదుగా వస్తుంది. కాబట్టి మీడియం సైజులో ఒక కట్ట తీసుకోవాలి. దీనిని తుంచుకొని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక కుక్కర్ తీసుకోవాలి. అందులో ఒక పెద్ద కప్పు కంది బ్యాళ్లను వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు నీటితో వాష్ చేసుకోవాలి. అందులోనే మనం తుంచుకొని పక్కన పెట్టుకున్న మెంతి ఆకును కూడా వేసుకోవాలి. టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి.

ఒక పది పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక పెద్ద సైజు టమాటా పండును సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక చిన్న గోలి సైజు  చింతపండును వేసుకోవాలి. కొద్దిగా కోతిమీరు కూడా వేసుకోవాలి. ఒక చిన్న సైజు ఉల్లిగడ్డను కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ను కూడా వేసుకోవాలి. తర్వాత పప్పు మునిగేంత వరకు నీ టిని వేసుకోవాలి. అనగా రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి. తర్వాత కుక్కర్ కి మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి.

మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పప్పు మరీ మెత్తగా ఉడికిపోతే బాగుండదు కాబట్టి మూడు విజిల్ కి ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ చల్లార్చిన తర్వాత మూత తీసి చూస్తే మెంతం కూర పప్పు ఉడికిపోయి ఉంటుంది. దీనిని పప్పు గుత్తితో మెత్తగా మాష్ చేసుకోవాలి. తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత నాలుగు వెల్లుల్లి రొమ్ములను కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలి. 

చిన్న సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయినంతవరకు దోరగా వేయించుకోవాలి అప్పుడే తాలింపు చాలా బాగుంటుంది. వీటిని అన్నింటిని దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపు ని మెంతుకూర పప్పులో వేసి బాగా కలుపుకోవాలి. టేస్ట్ కుసరిపడినంత ఉప్పు ఉందో లేదో చూసుకోవాలి. వేడివేడిగా ఉండే మెంతం కూర పప్పు రెడీ దీనిని అన్నంలో గాని ,రొట్టెలోకి గాని చాలా బాగుంటుంది.

మెంతం కూర పచ్చడి తయారీ విధానం.

ముందుగా ఒక పెద్ద సైజు మెంతం కూర కట్టను తీసుకోవాలి. తరువాత ఆకులను తుంచుకొని శుభ్రంగా నీటితో వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హిట్ అయిన తర్వాత  త్రీ టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పును వేసుకుని దోరగా వేయించుకోవాలి. 10 ఎండుమిరపకాయలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి.

అందులోనే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న మెంతి ఆకులు కూడా వేసుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత చూస్తే మెంతం కూర మొత్తం ఉడికిపోయి ఉంటుంది. దీనిలోకి చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ మరియు కొద్దిగా చింతపండును వేసుకొని ముగించుకోవాలి. వీటిని అన్నింటిని పక్కన తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చిన తర్వాత మిక్సీకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ను ఒక బౌల్ లోకి తీసుకోవాలి.

తర్వాత మెంతం కూర పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకోవాలి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలను వేసుకోవాలి. నాలుగు వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలి. ఒక ఎండు మిరపకాయలను సగానికి తుంచి వేసుకోవాలి. కొద్దిగా కరేపాకును వేసుకొని చిటపటలాడిన oత వరకువేయించుకోవాలి. ఈ తాలింపును మెంతం కూర పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. వేడివేడిగా ఉండే అన్నంలోకి గాని ,రొట్టెలకు గాని చాలా బాగుంటుంది.

పెసరపప్పుతో మెంతం కూర తయారీ విధానం. మనం ముందుగా ఒక కప్పు పెసరపప్పును నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక పది నిమిషాల ముందు నీటిలో వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక కప్పు మెంతం కూరను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అయిన తరువాత ఒక స్పూన్ శనగపప్పు మినప్పప్పు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి దొరగా వేగిన తరువాత ఎండుమిరపకాయ సగానికి కట్ చేసుకుని వేసుకోవాలి.

తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను సన్నగాకట్ చేసుకుని వేసుకోవాలి. ఐదు పచ్చిమిర్చి సన్నగా సగానికి కట్ చేసుకుని వేసుకోవాలి. దోరగా వేగిన తరువాత చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ముగించుకోవాలి.అందులోనే శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న మెంతి ఆకును వేసుకోవాలి. మెంతి ఆకులను మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి. 5 నిమిషాల  తరువాత మూత తీసి చూస్తే మెంతి ఆకు మొత్తం మగ్గిపోయి ఉంటుంది.

ఒకసారి బాగా కలుపుకున్న తరువాత మన ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక చిన్న సైజు గ్లాస్ వాటర్ వేసుకోవాలి. పెసరపప్పు ఉడకడం కోసం. మూత పెట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత తీసి చూస్తే పెసరపప్పు మెంతి ఆకు మొత్తం ఉడికిపోయి ఉంటుంది. టేస్ట్ కి సరిపడినంత ఉప్పు ఉందో లేదో టేస్ట్ చూసుకోవాలి.చి వరికి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడిగా ఉండే పెసరపప్పు ,మెంతి ఆకుకూర రెడీ. దీన్ని రసంలో గాని ,సాంబార్ లోకి గానీ ,సైడ్ డిష్ లో ,చాలా బాగుంటుంది.

మెంతి ఆకు వేపుడు తయారీ విధానం.

ముందుగా మనం మెంతం కూర తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హిట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హిట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలను వేసుకోవాలి. ఇవి కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఒక ఐదు పచ్చిమిరపకాలను ,సగానికి కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఆఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. చిక్కుడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి. తరువాతమనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మెంతం ఆకులను వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి .

ఆకు మొత్తం ఉడికిపోయి దగ్గరగా వచ్చినంత వరకు  మధ్య, మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మెంతం కూర మొత్తం దగ్గరికి వచ్చిoత వరకు మగ్గించుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక టేబుల్ స్పూన్ నువ్వుల పౌడర్ ,ఒక టేబుల్ స్పూన్ కారం , కొద్దిగా కొత్తిమీర,వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మెంతం కూర మొత్తం ఉడికిపోయి దగ్గరికి వచ్చి కొద్దిగా ఉంటుంది. ఈ విధంగా మెంతం కూర వేపుడు చేసుకోవాలి. దీన్ని సైడ్ డిష్ గా గాని, అన్నంలోకి గాని ,చపాతీల్లోకి గాని చాలా బాగుంటుంది.

ఆలు,మెంతం కూర రెసిపీ తయారీ విధానం.

ముందుగా మనము మూడు కట్టాల మెంతి ఆకులు తీసుకోవాలి. వీటిని రెండు, మూడు సార్లు నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. రెండు బంగాళదుంపలను తీసుకోవాలి. వీటి పైన ఉండే పొట్టును తీసుకొని బంగాళదుంప సన్నగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. మనం గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. కాడా యి హిట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత అందులో ఒకటేబుల్ స్పూన్ జీలకర్ర ,ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. రెండు లవంగాలు వేసుకోవాలి ఒక ఇలాచి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇది దొ రగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఐదు పచ్చిమిరపకాయలను సగానికి కట్ చేసుకుని వేసుకోవాలి.

ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక పెద్ద సైజు టమాటా పండును మిక్సీ పట్టుకొని పేస్టును వేసుకోవాలి. టమాటా పేస్టు లోని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకుని నీటిలో వేసుకున్న బంగాళదుంపలను వేసుకోవాలి.

ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకొని , ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోని,మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి చూస్తే బంగాళాదుంప ఉడికిపోయి ఉంటుంది. మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు కప్పుల మెంతి ఆకులను వేసుకోవాలి. మెంతం కూరలో వాటర్ ఉంటాయి. కాబట్టి వాటర్ వేసుకోకూడదు. వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పెట్టకుండా  చూసుకోవాలి.

తరువాత ఆఫ్ కప్పు పాల మీద ఉండే మీగడను మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంత వాటర్ వేసుకోవాలి. ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ముగించుకోవాలి.వేడివేడిగా ఉండే ఆలు, మెంతం కూర రెడీ. టేస్ట్ కు సరిపడినంత ఉప్పు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అన్నంలోకి గాని, చపాతీలోకి గాని చాలా టేస్టీగా ఉంటుంది.

Menthi కూర బెనిఫిట్స్ (Fenugreek Leaves Benefits):

ఈ menthi కూర అనేగా ఔషధ ప్రయోజనాలను కలిగి ఉంది. రక్తహీనత కలిగిన వారు ఈ మద్యం కూడా తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది మరియు ఏ మెంతికూరలో ఎక్కువగా ఐరన్ లభిస్తుంది మెంతికూర జ్యూస్ గా చేసుకొని ఉదయం ఉదయం పూట తాగితే షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ కంట్రోల్లో ఉంటుంది. కాకరకాయ రసం వలే చేదుగా ఉన్నప్పటికీ షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంచడానికి చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తుంది. మెంతికూరలో విటమిన్ k అధికంగా ఉంటుంది. ఇచ్చు పదార్థం అధికంగా ఉండటం వల్ల మలబద్ధంగా సమస్యను నివారిస్తుంది. ప్రోటీన్లు నీకోటినిక్ ఆసిడ్లు టాయ్ కాబట్టి వెంట్రుకలు పెరుగుదలకు చక్కగా సహాయపడతాయి.

జుట్టు పెరుగుదల కోసం మహిళలు ఈ ఆకుకూరను ఒక వరంగా భావిస్తారు. కూరను తాజాగే కాకుండా ఎండలో ఎండబెట్టుకొని కూడా ఆహార పదార్థాలు ఉపయోగిస్తారు. ఎండిన మెంతికూరను ఆహారాల్లో ఉపయోగించడం వల్ల మనం చేసే వంటకాలకు ఎక్కువ రుచిని కలిగిస్తుంది. మెంతికూరను మెంతికూర పప్పుగా ,ఫ్రైగా ,మెంతికూర పరోటాలు, మెంతికూర వేపుడు, మెంతికూర రెసిపీస్, ఇలా చాలానే చేసుకోవచ్చు. తాజా మెంతి కూర కొద్దిగా చేదు గుణాన్ని కలిగి ఉంటుంది.

ఈ మెంతికూర మహిళలకే ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ప్రతిరోజు తమ ఆహార పదార్థాలలో మెంతికూరను తీసుకోవడం వల్ల నడుము నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది. అధిక బరువుతో బాధపడే వారికి ప్రతిరోజు తమ ఆహార పదార్థాలలో మెంతికూరను చేర్చుకోవడం వల్ల బరువు సమస్య నుండి విముక్తి పొందవచ్చు. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువు తొందరగా తగ్గుతారు. ఈ మెంతులను తీసుకోవడం వల్ల చర్మ సమస్యల నుండి కూడా రక్షణ కలుగుతుంది.

మెంతులలో నికోటినిక్ యాసిడ్ సమృద్ధిగా లభిస్తుంది. కాబట్టి జుట్టు రాలే సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ ఆకులను దంచి పేస్టుగా చేసి తనకు పట్టించడం వల్ల చుండ్రు సమస్యను నివారిస్తుంది మరియు వెంట్రుకలు మెరిసేలా చేస్తుంది.కీళ్ల నొప్పులను తగ్గించడం కూడా ఈ మెంతి ఆకులు ఉపయోగపడతాయి. మెంతి ఆకులను జ్యూస్ చేసుకుని రాత్రి భోజనానికి ముందు తీసుకోవడం ద్వారా చక్కగా నిద్ర పడుతుంది.

ఈ మెంతుల పొడిని నీళ్లలో గాని కలిపి తీసుకోవడం ద్వారా మధుమేహ వ్యాధిగ్రస్తులకు తీసుకోవడం ద్వారాకొలెస్ట్రాల్ తగ్గుతుంది. శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు మెంతి tea తీసుకోవడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. కిడ్నీ ,మూత్ర సంబంధిత వ్యాధులకు మెంతులు చక్కని ఔషధల గా పనిచేస్తుంది. గొంతులో గరగర ఉన్నవారికి ఈ మెంతుల నీటిని తీసుకోవడం ద్వారా వెంటనే ఉపశమనం కలుగుతుంది. శరీరంలో ఏర్పడే బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది

పొటాషియం మెంతం కూరలో అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నివారిస్తుంది. గుటమిన్ అనే పదార్థం మెంతుల్లో ఉండటం వల్ల రక్తంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు మెంతుల నీటిని ప్రతిరోజు ఉదయం తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. శరీరంలో పేర్కొన్న జీర్ణక్రియ వ్యర్ధాలను తొలగించడంలో ఈ మెంతులు సహాయపడతాయి దీనివల్ల ప్రేగుల ఆరోగ్యం మెరుగు పడుతుంది. కిడ్నీలో ఏర్పడిన రాళ్లను తొలగించడం కోసం మెంతుల వాటర్ ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఉపశమనం కలుగుతుంది.

సైడ్ ఎఫెక్ట్స్;

గర్భిణీ స్త్రీలు ఈ మెంతులు తీసుకోకూడదు దీనివల్ల పుట్టబోయే బిడ్డలో వైకల్యం ఏర్పడవచ్చు. రక్తంలో చక్కర స్థాయిలు (hypoglycemia)తక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి హ ని కలగజేస్తాయి .కాబట్టి తగు మోతాదులో వైద్యుని సంప్రదించి తీసుకోవాలి. ఆరు నెలల కంటే ఎక్కువ కాలం ఔషధపరంగా ఈ మెంతులను తీసుకోకూడదు. పిల్లలు ఈ మెంతులకు దూరంగా ఉండాలి. అధికంగా తీసుకోవడం ద్వారా అతిసారం, కడుపునొప్పి, తలనొప్పి ,వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి తగుమోతాదులోని తీసుకోవాలి.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button