Pearl Millet Uses in Telugu: సజ్జల ఉపయోగాలు
Pearl Millet Uses in Telugu: సజ్జలను ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణశక్తి గుండె పనితీరు మెరుగుపడతాయి. ఇందులో అమినో ఆమ్లాలు జీర్ణశక్తికి తోడ్పడతాయి. మధుమేహంతో బాధపడేవారు రోజు సజ్జ అన్నం లేదా రొట్టెలు తినడం వల్ల గోధుమ రొట్టెల కన్నా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. సజ్జల ఆహారం నిదానంగా జీర్ణం అవుతుంది. వెంటవెంటనే ఆకలి కాదు ఫలితంగా ఊబకాయం రాకుండా పరిమితంగా తినడం అలవాటవుతుంది.
6 నెలలు దాటిన శిశువులకు సబ్జా అన్నాన్ని కూరగాయలు పండ్లతో కలిపి అందించాలి. వరి అన్నంతో పోలిస్తే ఇది తల్లులకు చిన్న పిల్లలకు ఎంతో మంచిది అని పరిశోధనల్లో గుర్తించారు. కడుపులో మంట అజీర్తి వంటి వాటితో ఇబ్బంది పడే వారి సంఖ్య పెరుగుతుంది. ఈ సమస్యలను సజ్జలు నియంత్రిస్తాయి.
ఉదాహరణకు ఒక మనిషి 100 గ్రాముల సజ్జల ఉత్పత్తులను తింటే దానికి 364 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. 100 గ్రాముల వరి అన్నం తింటే 345 గోధుమలు అయితే 346 కిలో క్యాలరీలే లభిస్తాయి. సజ్జలను ఆహారంగా నిత్యం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీవనశైలి వ్యాధులను నియంత్రించే అనేక పోషకాలు వీటిలో ఉంటాయి.
ప్రపంచవ్యాప్తంగా 56% జనాభా రక్తహీనత అనీమియాతో బాధపడుతున్నారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఈ శాతం ఇంకా ఎక్కువగా ఉండటం వల్ల వరిబియం, గోధుమల కన్నా సజ్జలలో ఇనుము జింకు పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనిమియా బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.
సజ్జల బిస్కెట్లు కేకులు రొట్టెలు ఇంకా మరింటిని తయారు చేసుకోవచ్చు. నానబెట్టిన సజ్జలతో దోస, లడ్లు సజ్జ జావా ,సజ్జ ఇడ్లీ సజ్జనం తయారు చేసుకోవచ్చు . రోజు పడుకునే ముందు నానబెట్టిన సజ్జలను తాగడం వల్ల బరువు తగ్గుతారు. ఈ సజ్జ ఎక్కువగా నల్గొండ జిల్లా మహబూబ్నగర్, చిత్తూరు, నిజామాబాద్, కర్నూలు లలో ఎక్కువగా పండిస్తున్నారు.
షుగర్ వ్యాధిగ్రస్తులు నానబెట్టిన సజ్జలను తీసుకోవడం వల్ల షుగర్ ను తగ్గిస్తుంది. మొలకెత్తిన సజ్జలను తినడం వల్ల కండరాలకు శక్తినిస్తుంది. పిల్లలకు ఇవ్వడం వల్ల ఎముకలు గట్టితనాన్ని ఇస్తుంది. చాలా పెరుగుదలను పిల్లలకు ఇస్తుంది. ఎముకలు పుష్టి కరంగా ఉంటాయి. బీ కాంప్లెక్స్ విటమిన్లు లభిస్తుంది. అంతేకాకుండా శరీరానికి శక్తినిస్తుంది.
నిద్రలేని తనానీ తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. పిల్లలకు పాలిచ్చే తల్లులకు కూడా ఇవ్వడం మంచిది. మంచి బలాన్ని ఇస్తుంది వారానికి రెండు సార్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సజ్జలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సజ్జలు బహుళ ప్రయోజనాకారి.
సజ్జ దేహదారుధ్యానికి చాలా మంచిది ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మొలకెత్తిన సజ్జలను అల్ప ఆహారంగా తీసుకోవడం వల్ల టిబి, మొలలు ,చక్కెర వ్యాధి, క్షయ, రక్తపోటు బాగా అదుపులో పెట్టుకోవచ్చు. సజ్జలు బాగా జీర్ణం అవుతాయి. ఇవి ఎలాంటి అలర్జీలు కలగవు.
ఈ ధాన్యం మలబద్ధకం కడుపులోని అల్సర్ లపై బాగా ప్రభావం చూపించి వాటిని తగ్గిస్తుంది. ఫైర్విక్ ఆమ్లం నియాసిన్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోనూ కొవ్వు తగ్గిస్తుంది. పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల చక్కెర వ్యాధితో బాధపడుతున్న వారికి చాలా మేలు చేస్తుంది. గ్లూకోజ్ స్థాయి శాతాన్ని క్రమబద్ధకరించి సాధారణ స్థాయిలో ఉంచుతుంది.
సజ్జలతో చేసిన జావా గంజి తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. అన్ని ధాన్యాల్లోకి సజ్జలు ఇనుము దాతువులు కలిగి ఉండటం వల్ల స్త్రీలకు, పిల్లలకు చాలా మంచిది. సజ్జల గింజలలో కెరోటిన్ ఉండటం వల్ల కంటి చూపుకు చాలా మంచిది. బరువు తగ్గాలనుకున్నవారు సజ్జలను ఆహారంగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత ఎసిడిటీకి సమస్యలను నియంత్రిస్తుంది.
Read More: Carom Seeds in Telugu ఉపయోగాలు
ఫాస్పరస్ ఎక్కువగా ఉండటం వల్ల రక్త కణాల నిర్మాణాలలో బాగా తోడ్పడుతుంది. సజ్జలలో మెగ్నీషియం ఉండటం వల్ల టైప్ టు షుగర్ రాకుండా నియంత్రిస్తుంది. ప్రోటీన్లు విటమిల్లు మినర్లు ఎక్కువగా ను క్యాలరీల తక్కువగా ఉంటాయి. పెసలు సజ్జలు కలిపి నా పిండితో పెసరట్లు వేసుకోవచ్చు. ఆరోగ్యానికి రుచికి జీర్ణశక్తికి చాలా మంచిది.
Pearl Millet Uses in Telugu: సజ్జలతో సజ్జ బూరెలు సజ్జ రోటి సజ్జ పాయసం సజ్జ రవ్వతో ఉప్మా తయారు చేసుకోవచ్చు. మొలకెత్తిన సబ్జా గింజలు తొందరగా అర్గుతాయి. సజ్జలోగల పోషక విలువలు. రైబోఫ్లవిన్ 0.25 మిల్లీగ్రామ్, పిండి పదార్థాలు 67.1 గ్రాములు, మాంసకృతులు 11.8 గ్రాములు, 132 మిల్లీగ్రాములు, థయామిన్ 0. 33 మిల్లీగ్రాములు, పీచు పదార్థాలు 1.2 గ్రాములు, ఐరన్ 8 మిల్లీ గ్రాములు, క్యాల్షియం 42 మిల్లీగ్రాములు.