Conocarpus: కోనో కార్పస్ మొక్కను ప్రభుత్వాలు ఎందుకు నిషేధిస్తున్నాయో తెలుసా?

కోనో కార్పస్ ప్లాంట్: ప్రస్తుతం లేటెస్ట్ ట్రైన్డింగ్ అవుతున్న మొక్క కోనో కార్పస్ మొక్క. కారణం ఈ మొక్క అందంగా ఉండటమే కాకుండా విషం చిమ్ముతుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

గడిచిన మూడు సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం హరితహారం ప్రాజెక్టులో భాగంగా ఈ మొక్కలను చాలావరకు విరివిగా నాటింది. ఈ మొక్కలను నాటడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ మొక్కలు త్వరగా పెరుగుతాయి. చూడటానికి అందంగా ఉంటాయని మరియు నీటి ఎద్దడిని మరియు నీటి ప్రవాహాన్ని తట్టుకొని కూడా జీవించగలుగుతాయి.


ఈ మొక్క మంగ్రూ జాతికి చెందిన మొక్కఉద్దేశంతో ప్రభుత్వం ఈ మొక్కలు నాటడానికి ఆసక్తి చూపింది. కానీ పర్యావరణ వేత్తల ప్రకారం ఈ మొక్కలు పర్యావరణంలో ఎలాంటి లాభం చేకూర్చే విధంగా లేదని, మొక్కలు జంతువులకి, పక్షులకి ఎలాంటి ఉపయోగకారిగా లేదని తెలిపారు.

ముఖ్యంగా మానవులకు జంతువులకు ఈ మొక్క యొక్క పుష్పం నుంచి వచ్చే పుప్పొడి వలన శ్వాసకోశ వ్యాధులు మరియు చర్మకోస వ్యాధులు వస్తున్నాయని ప్రయోగాల ద్వారా నిర్మితమైనది.

అలాగే మొక్క యొక్క వేర్లు భూగర్భంలోని నీటిని మరియు భూగర్భంలో వేసే పైపులైనువ్యవస్థ, టెలిఫోన్ వ్యవస్థలాంటిని ధ్వంసంచేస్తున్నట్టు నిరూపితమైనది. అందువలన ఈ కోనో కార్పస్ మొక్కను మధ్య ప్రాచ్య దేశాలు అయినటువంటి పాకిస్తాన్, ఇరాన్ ఇతర ముస్లిం దేశాలతో పాటుగా తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా మనదేశంలో నాటుట నిషేధించినవి.

Exit mobile version