Dosa Batter: కేవలం రెండు మూడు గంటల్లోఇన్స్టెంట్ దోశ చేసుకోవడానికి పాటించాల్సిన పద్ధతి ఇదే…
మనం ప్రతిరోజు అనేక రకాల టిఫిన్ ఐటమ్స్ చేసుకొని తింటూ ఉంటాము. కొంతమంది చేసుకోవడానికి వీలు లేకపోతే హోటల్స్ లో ఆర్డర్ చేసుకొని తింటారు. కొంతసేపు హోటల్లో టిఫిన్స్ పక్కన పెడితే, చాలా మంది ఇంట్లో చేసుకొనే తినడానికి ఇష్టపడతారు. అందరూ అన్ని టిఫిన్ ఎక్కువగా ఇష్టపడరు కొందరికి ఉప్మా నచ్చితే, కొందరికి ఇడ్లీ, మరికొందరికి పూరి, అంతేకాక దోశ లాంటి వాటిని ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువ శాతం టిఫిన్స్ లో ఎక్కువ సమయం తీసుకునేది దోశ మాత్రమే.
దోశ చేసుకోవడానికి ప్రాసెస్ ఎక్కువ. దోశ గురించి మాట్లాడుకుంటే చాలా ఉంటుంది. ఈ టిఫిన్ పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా ఎక్కువగా అడిగేది దోశ. batter ను తయారు చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. కొంతకాలం క్రితం రేపు ఏ టిఫిన్ చేసుకోవాలి అని ముందు రోజే ఫిక్స్ అయ్యి రెడీగా పెట్టుకునేవారు. కానీ ప్రస్తుత కాలంలో అలా లేదు. ఆర్డర్స్ చేసుకొని లేకపోతే రెడీమేడ్ dosa batter mix ను తెచ్చుకొని అప్పటికప్పుడు తింటూ ఉంటారు. కానీ ఇంట్లోనే త్వరగా చాలా ఈజీగా దోశ పిండి ని రెడీ చేసుకునీ బయట హోటల్ నుంచి కాకుండా ఇంట్లోనే చేసుకుని తినవచ్చు ఈ దోశ తినాలి అనుకుంటే ముందు రోజు బియ్యం, మినప్పప్పు, నానబెట్టి మిక్స్ చేసి పిండిని తయారు చేసుకుని మరుసటి రోజు తినేవాళ్లు. ఇప్పుడు బియ్యంతో అటుకులు, మినప్పప్పు, పెరుగు కలిపి త్వరగా ఈ టిఫిన్ చేసుకోవచ్చు.
Dosa ingredients: Dosa batter తయారు చేసుకోవడానికి కావలసినవి:
- బియ్యం ఒక కప్పు
- అటుకులు అరకప్పు
- పెరుగు అరకప్పు
- మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్లు
- మెంతి గింజలు ఒక టీ స్పూన్
- చక్కెర హాఫ్ టీ స్పూన్
- దోసె చేసుకోవడానికి కావలసినంత నూనె
- తగినన్ని నీళ్లు
- రుచికి సరిపడా ఉప్పు.
Dosa batter అటుకుల దోశ పిండి తయారీ విధానం:
ముందుగా మనం తీసుకున్న బియ్యాన్ని ఒక పాత్రలో పోసి బాగా కడిగి అందులో మినప్పప్పు మెంతులు వేసి నీటిని పోసి నానబెట్టుకోవాలి. తర్వాత అటుకులను కూడా కొంచెం సేపు నానబెట్టుకోవాలి. ఇలా నాలుగు లేదా ఐదు గంటల వరకు నానబెట్టి ఆ తర్వాత మిక్సీ పట్టాలి. లేకపోతే గ్రైండర్ లో వేసి పిండిని పట్టుకోవచ్చు. తర్వాత అందులో కొంచెం బాగా పుల్లగా ఉన్న పెరుగు వేసి కలుపుకోవాలి. దోశ పిండి మందంగా కాక పలుచకాక మీడియంగా ఉండేలా చూసుకోవాలి. ఆ పిండిలో కొంచెం చక్కెర, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని 15 నిమిషాలు మగ్గనివ్వాలి. దోశ పిండి లో చక్కెర కలపడం వల్ల దోశ రుచిగా ఉంటుంది.
1.ఇన్స్టంట్ దోశ తయారీ విధానం:
ముందుగా స్టవ్ పై దోశ పెనం పెట్టుకోవాలి. పేన్నం బాగా వేడయ్యాక దానిపై ఉల్లిపాయను రుద్దాలి. ఇలా చేయడం వల్ల దోశ వేసినప్పుడు పేన్నానికి అంటుకోకుండా ఉంటుంది. మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి దోశ పిండిని గరిటతో తీసుకొని పెనంపై వేసి గరిటతో అంతా రుద్దుకోవాలి. తర్వాత మంటను అడ్జస్ట్ చేసుకుని పెద్ద మంటపై పెట్టి దోశ అంతా నూనె వేసుకొని కాల్చుకోవాలి. దోశ బాగా ఎర్రగా కాలిన తర్వాత తీసుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా ఇన్స్టంట్ అటుకుల దోశ తొందరగా తయారవుతుంది. ఈ విధంగా ఇన్స్టాంట్ దోశ తొందరగా తయారు చేసుకుని తినవచ్చు. ఎక్కువ శ్రమ ఉండదు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
మరొక విధంగా చేసే ఇన్స్టంట్ దోశ:
దోశ వెంటనే తినాలి. మూడు, నాలుగు గంటలు కూడా ఆగలేము అనుకునేవారు ఈ విధంగా తయారు చేసుకొని తినవచ్చు. చాలా త్వరగా ఈజీగా ఉంటుంది. రుచిగా కూడా ఉంటుంది.
కావలసిన పదార్థాలు:
- బొంబాయి రవ్వ ముప్పావు కప్పు
- గోధుమపిండి అరకప్పు
- బియ్యం పిండి పావు కప్పు
- పెరుగు అరకప్పు
- నీళ్లు తగినన్ని
- ఉప్పు రుచికి సరిపడినంత
- సోలాపొడి పావు టీ స్పూన్
ఇన్స్టంట్ దోశ తయారీ విధానం:
ముందుగా బొంబాయి రవ్వ, గోధుమపిండి, బియ్యం పిండి కలిపి నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పెరుగు ఉప్పు సోలాపొడి వేసి బాగా కలిపి 15 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత దోశ ను వేసుకోవచ్చు. ఈ విధంగా కూడా దోసెలు తయారు చేసుకొని తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. దోశ తిన్నాము అన్న తృప్తి కలుగుతుంది.
Dosa powder and packets:
ప్రస్తుత కాలంలో దోశ చేసుకోవడానికి సమయం లేనివారు, మార్కెట్లలో దొరికే దోశ పౌడర్ తెచ్చుకొని అప్పటికప్పుడు దోశ తయారు చేసుకొని తింటున్నారు. దోశ చేయడానికి అవసరమైన బియ్యం, మినప్పప్పు, శనగపప్పు మెంతులు అన్నీ కలిపి మెత్తగా పౌడర్ల మిక్స్ చేసి ప్యాకెట్ రూపంలో అమ్ముతున్నారు. ఈ ప్యాకెట్ను తెచ్చుకొని అందులోనే కొంచెం పుల్లటి పెరుగు కలిపి, నీళ్లు పోసి దోశ పిండిలా చేసుకుని ఇన్స్టంట్ చేసుకొని తినవచ్చు.
దోశ రకాలు:
దోశలను మామూలు దోశలే కాక చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు. ఎగ్ దోశ, ఆనియన్ దోశ, కారం దోశ, కల్ దోశ, బొంబాయి రవ్వ దోశ, అటుకుల దోశ ఇలా చాలా రకాలుగా తయారు చేసుకుంటారు.
Dosa calories:
1.ఒక దోశలో-168 కేలరీలు ఉంటాయి.
పిండి పదార్థాలు-20 గ్రాములు
ప్రోటీన్-3.9 గ్రాములు
ఫైబర్-0.9 గ్రాములు
సోడియం-94 మిల్లిగ్రాములు
పొటాషియం-76 మిల్లి గ్రాములు
కొలెస్ట్రాల్-.0 గ్రాములు
విటమిన్స్:
విటమిన్ A -0.1 శాతం
విటమిన్ C-0.6 శాతం
కాల్షియం-0.4 శాతం
ఇనుము-4.7 శాతం ఉంటాయి.