Mullangi Sambar: ముల్లంగి తో సాంబార్ తయారు చేసే విధానం

Mullangi Sambar: ముల్లంగి తో సాంబార్ తయారు చేసే విధానం. ఒక పాన్ తీసుకొని అందులో రెండు గరిటెలు నూనె పోసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర , కొద్దిగా ఆవాలు,రెండు ఎండు మిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవిబాగా వేగాక కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఆయిల్ లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.

ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ అనేది ఆప్షనల్ అండి. కానీ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న , మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి. ముల్లంగి నీ కూడా బాగా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ముల్లంగిని ఆయిల్ లో వేసుకోవాలి.

సన్నగా కట్ చేసుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది. కొంచెం లావుగా కట్ చేసుకున్నారంటే మీకు కుక్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. మూత పెట్టుకొని కాసేపు ఈ ముల్లంగి సాఫ్ట్ గా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు టమాట తీసుకొని లేదా చిన్నవిగా ఉండే రెండు టమాటాలను తీసుకోవాలి.వాటిని చిన్నగా కట్ చేసుకోవాలి. వాటిని కూడా ఆయిల్ లో వేసుకొని బాగా కలుపుకొని మెత్తగా ఉడికేటట్లు చేసుకోవాలి. ఒక టు ఆర్ త్రీ మినిట్స్ మూత పెట్టుకొని బాగా ఉడికినట్లు చేసుకోవాలి.

అదేవిధంగా ముల్లంగి ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ సాంబార్ పొడి వేసుకొని ఈ ముక్కలకి బాగా తగిలేటట్టు కలుపుకోవాలి .ఇలా ఈ మసాలాలన్నీ బాగా ముక్కలకి తగిలేటట్లు చూసుకోవాలి. ఇలా మసాలాలన్నీ బాగా ఉడికిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి.

ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని దాన్ని నీటిలో నానబెట్టుకోవాలి. తర్వాత ఆ చింతపండు రసాన్ని సాంబార్లో వేసుకోవాలి. మనం ముందుగానే ఉడకబెట్టుకున్న కందిపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. మనకు సాంబార్ ఏ కన్సిస్టన్స్లో కావాలో అలా నీళ్లు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ రెండు కప్పులు నీళ్లు వేసుకుంటున్నాను. దాదాపు 500 ఎంఎల్ వరకు ఉంటుంది. వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని అవసరం అనుకుంటే కొద్దిగా కలుపుకోవాలి.

ఇందులో తరిగిన కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి 15 నుంచి 20 మినిట్స్ వరకు ఫ్లేమ్ లో ఉంచుకొని ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మీరు మూత తీసి చూస్తే నట్లయితే ఇలా సాంబార్ మరుగుతూ ఉంటుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. ముల్లంగి సాంబార్ రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో లేదాఇడ్లీలో తినవచ్చు. మీరు కూడా ఏ ఈ రెసిపీనిట్రై చేసి ఇంట్లోవాళ్లతో లేదా మీ ఫ్రెండ్స్ తో ట్రై చేసి చూడండి.

Mullangi Sambar: ముల్లంగి ఉపయోగాలు

Exit mobile version