Bitter Gourd benefits Telugu: మధుమేహానికి మందు

Bitter Gourd benefits Telugu: కాకర ని ఇంగ్లీషులో bitter gourd అంటారు. ఇండియా అంతాపెంచబడుతున్న ఓ చేదు తీగ జాతి మొక్క. దీని శాస్త్రీయ నామం momordica charantia. ఇది కుక్కుర్బిటేసి కుటుంబానికి చెందినది. హిందీలో అయితే కరేలా అంటారు. సంస్కృతంలో కారా వెల్ల అంటారు. కాకర చాలlరకాలుగా ఉంటుంది. అవి నల్ల కాకర, తెల్ల కాకర, బారామసి ,పొట్టి కాకర ,బోడ కాకర అని మరొక గుండ్రని కాయ. కాకరకాయ భారతదేశమంతా పెంచబడుతున్న మొక్క. చేదు అయినప్పటికీ ఆరోగ్యాన్నిచ్చేదని అందరూ తింటారు.

కాకరను మధుమేహానికి మందుగా వాడుతున్నారు. కాకర రసంలో హైపోగ్లసామిక్ పదార్థం ఉండటం వల్ల, ఇన్సులిన్ స్థాయిలో తేడా రాకుండా నియంత్రణ చేస్తూ ,రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. కాకర రసం ను కుక్క నక్క కాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు. సోరియాసిస్ నివారణలో కాకర కీలకపాత్ర వహిస్తుంది. కాకరలో సోడియం కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ. విటమిన్ b6పాంథోనిక్ యాసిడ్, ఫాస్ఫరస్లు ,ఎక్కువగా లభిస్తాయి .అందుచేతనే కాకరను తినడం మంచిది. కనీసం 15 రోజులకు ఒకసారి అయినా టీ స్పూన్ కాకర రసం త్రాగడం వలన ఆరోగ్యంగా జీవించవచ్చు. కాకర గింజలలో రక్తంలో గ్లూకోస్ ను తగ్గించే చారన్ టిన్ అనే ఇన్సులిన్ వంటి పదార్థం ఉంటుంది.

Bitter gourd vitamins కాకర లో ఉండే విటమిన్లు:

ఇందులో విటమిన్ ఏ ,సి, ఈ ,కే,లతో పాటు ఐరన్ ,మెగ్నీషియం ,ఫాస్పరస్ ,పొటాషియం, సోడియం, జింక్, ఫైబలతో పాటు ,అనేక పోషక పదార్థాలు ఉన్నాయి. కాకరలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. జీర్ణ క్రియల ఫలితంగా ఏర్పడే వ్యర్ధాలను బయటకు పంపడంతో పాటు మలబద్దక సమస్యలను దూరం చేస్తుంది. కడుపులో ఏర్పడే పరా న్న జీవులను తొలగిస్తుంది. కాకరలో 80 నుంచి 90 శాతం తేమ ఉంటుంది. ఇందులో b1,b2, b3,b4,b5,b6, మరియు విటమిన్ సి ఉన్నాయి. 100 గ్రాముల కాకరలో సోడియం 10mg, పొటాషియం 296mg, కొవ్వు o.17g, కాల్షియం 10mg, పీచు పదార్థం 2.80 గ్రాములు.100ల గ్రామాలలో కాకరలో లభిస్తాయి.

కాకరకాయ ఉపయోగాలు:

మనలో చాలామంది కాకరకాయ అనగానే ముఖం చిట్లించుకుంటారు .తినడానికి ఇష్టపడరు. దీనికి కారణంఅది చేదుగా ఉండటమే. అయితే ఈ చేదు వెనుక అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగి ఉన్నాయి .ఇది శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కాకరకాయ కిడ్నీ మరియు మూత్రశాయ న్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాకరకాయ రసాన్ని తీసుకోవడం వల్ల కిడ్నీలో ఏర్పడే రాళ్లను సైతం తగ్గించుకోవచ్చు ని ఆరోగ్యాన్నిపుణులు చెప్తున్నారు. లివర్ను డ్యామేజీ భారీ నుండి కాపాడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎన్నో విధాల మంచిది. శరీరంలో ఏర్పడే బ్యాడ్ కొలెస్ట్రాల్ వలన రక్తాన్ని గుండెకు సరఫరా చేస్తుంది. చేసే ధమనుల్లో ఏర్పడే అవరోధాలను నివారించి ,గుండెకు రక్తసరపర సాఫీగా జరిగేలా చేస్తుంది.

అందువల్ల గుండె ఆరోగ్యంతో ఉంటుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారికి కాకరకాయ ఒక వరంగా చెప్పవచ్చు. కాకరకాయలో ఇన్సూరెన్స్ను పోలి ఉండే రసాయనాలు రక్తంలోని షుగర్ లెవెల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది .అందువల్ల మధుమేహంతో బాధపడేవారు కాకరకాయను తీసుకుంటే మంచిది. కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో ఏర్పడే వ్యర్ధాలను బయటకు పంపి శరీరాన్ని అధిక బరువు సమస్య నుండి కాపాడుతాయి. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

అందువల్ల బరువు తగ్గాలి అనుకునేవారు తమ డైట్లలో కాకరకాయను తీసుకుంటే చాలా మంచిది. కాకరకాయ శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది .ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరాన్ని ఫ్రీడాడికల్స్ వారి నుండి కాపాడుతుంది .చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. జలుబు మరియు దగ్గు లాంటి వ్యాధులను తగ్గిస్తుంది. అంతేకాకుండా యూరినరీ ప్రాబ్లమ్స్ ను తగ్గిస్తుంది .ప్రతిరోజు తాజా కాకరకాయను జ్యూస్ చేసుకొని ,తీసుకోవడం ద్వారా మొలల వ్యాధి నుండి ఉపశమనం పొందవచ్చు, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు ,లివర్ సమస్యను తగ్గించుకొ వచ్చు.

ప్రతిరోజు కాకరకాయ జ్యూస్ ను తీసుకోవడం ద్వారా రక్తసంబంధిత దోషాలను తగ్గించుకోవచ్చు. జుట్టు ఆరోగ్యాన్ని కికూడా కాకరకాయ ఎంతో మేలును చేస్తుంది .ఇందులో ఉండే యాంటీ క్యాన్సర్ లక్షణాలు మిమ్మల్ని క్యాన్సర్ బారినుండి కాపాడుతుంది.

కాకరకాయ జ్యూస్ Bitter gourd juice benefits:

https://telugu.thefinexpress.com/health/wp-content/uploads/sites/12/2022/11/bitter-gourd-juice.mp4

కాకరకాయ జ్యూస్ త్రాగండి 100 రోగాలను తరిమికొట్టండి .కాకరకాయ రసం చేదుగా ఉన్న ఎన్నో ఔషధ గుణాల సమ్మేళనం. ఎన్నో ఔషధ గుణాలు దాగివున్న కాకరకాయను పండువలే సేవించమని సలహా ఇస్తున్నారు. కాకరకాయ జ్యూస్ పరిగడుపున రోజు తాగడం వల్ల డయాబెటిక్ కంట్రోల్ లో ఉంచుతుంది. పరిగడుపున కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల రక్తంలోని గ్లూకోస్జ్ స్థాయిలను అదుపులో ఉంటాయి. కాకర లో ఉన్న ఔషధ గుణాలు ఇన్సులిన్ లాగా పని చేస్తాయి.

షుగర్ స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి .మన ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కాకరకాయ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది .షుగర్ మాత్రమే కాకుండా ఇతర ఆనారోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా కాకరకాయ జ్యూస్ ఉపయోగపడుతుంది. కాకరకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మలబద్ధక సమస్యలు నివారిస్తుంది. గ్యాస్ , అసిడిటీ,అజీర్ణం ఉండవు .కాకరకాయ లో ఉండే పోషకాలు విలువలు శరీరాన్ని శుభ్రం చేస్తాయి. కాకరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల విష ,వ్యర్థ పదార్థాలు బయటికి పంపించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

కాకరకాయ జ్యూస్ పరిగడుపున తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో కూడా కాకరకాయ జ్యూస్ ఉపయోగపడుతుంది. గుండె సమస్యలు రావు .శరీర రోగ నిరోధక శక్తిని పెరిగి ,ఇన్ఫెక్షన్లు రావు. కాకరకాయ జ్యూస్ ప్రతిరోజు గ్లాస్ తాగడం వల్ల హైబీ.పీ రక్తపోటు అలర్జీ వాటికి దూరంగా ఉండవచ్చు. అలాగే రెండు స్పూన్ల కాకరకాయ జ్యూస్ ను, కాసింత నిమ్మరసం కలిపి ఆరు నెలల పాటు తీసుకుంటే రక్తసంబంధిత వ్యాధులనుదూరం చేస్తుంది. కాకరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల కలరాను ఆరించుకోవచ్చు.

ఇంకా కాకరకాయ juice తీసుకోవడం వల్లప్రారంభ దశలో ఉన్న కలరాను దూరం చేస్తుంది. కాకర రక్తంలో కలిసిన చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. కాకరకాయ జ్యూస్ ను డైలీ తీసుకోవడం ద్వారా కంటి సమస్యలు ,దృష్టి సమస్యలను దూరం చేసుకోవచ్చు. సోరియాసిస్ వ్యాధులను కూడా నయం చేస్తుంది. శ్వాస సంబంధిత వ్యాధులను చెక్ పెట్టవచ్చు. కాకరకాయ జ్యూస్ ను తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. కాకరకాయలు లోవిటమిన్ ఏ ,సి ,ఈ, కే లతోపాటు, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ,పొటాషియం ,సోడియం ,జింక్ ,ఫైబర్లతో పాటు అనేక పోషక పదార్థాలు ఉన్నాయి.

గర్భిణీ స్త్రీలు ,పిల్లలకు పాలిచ్చే తల్లులు కాకరకాయను తీసుకకపోవడమే మంచిది. కాకరకాయ నెలకు మూడుసార్లు అన్న తీసుకోవాలి . అనారోగ్య సమస్యలు రావు.దీన్ని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల ను,నీవారించవచ్చు. రోజుకు రెండుసార్లు కాకరకాయ జ్యూస్ ను తీసుకోవడం వల్ల షుగర్ స్థాయిలను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. కడుపులో పరాన జీవులను తొలగించుకోవచ్చు. కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల కామెర్ల వ్యాధి తగ్గుతుంది. కళ్ళు పచ్చగా ఉన్నవారు పచ్చదనం పోయేంతవరకు కాకరకాయ జ్యూస్ తీసుకోవాలి. కాకరకాయ రసం చేదుగా ఉన్నట్లయితే కొద్దిగా తేనె ,కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు.

కాకరకాయ రసం వల్ల టైప్ వన్ షుగర్ తో బాధపడే వారికి ఇవ్వడం ద్వారా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. చెడు కొలెస్ట్రాను తగ్గిస్తుంది. గుండెపోటును, రక్త పోటును తగ్గిస్తుంది. కాకరకాయ రసంలో ఇనుము ,ఫోలిక్ ఆమ్లంఉండడం వల్ల స్టో క, వచ్చే ప్రమాదాన్ని నివారిస్తుంది. ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటివి దరిచేరనీయవు. కాకరఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల చర్మ వృ ద్యాపాన్ని పోగొడుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ సంబంధిత రోగాలను నివారిస్తుంది.

విటమిన్ ఏ ,విటమిన్ సి, జింక్, ఉండడం వల్ల చర్మం కాంతివంతంగా ప్రకాశిస్తుంది. కాకరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల,చుండ్రును నివారించుకోవచ్చు. తల దురదను తగ్గించుకోవచ్చు. కాకరకాయ రసాన్ని పెరుగు, జీలకర్ర, స్పూన్ నిమ్మకాయ రసం ,కలిపి పేస్ట్ గా చేసుకొని తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత తలస్థానం చేస్తే జుట్టు రాలడం ఆగిపోతుంది. కాకరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల దాన్ని కాలేయాన్ని,శుభ్రపరచుకోవచ్చు. హానికరమైన యువి కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.

మూత్రం పనితీరు కూడా బాగుపడుతుంది. కాకరకాయలు యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి. కొవ్వు శాతాన్ని తగ్గించి బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తాయి. కంటి సమస్యలను తగ్గిస్తుంది. ఉదర సమస్యలకు ,అర్జీర్ణం, కడుపులో మంట వంటి సమస్యలకు కాకరకాయ రసం మంచిది. కడుపులో పురుగులు పోవడానికి కూడా కాకర చూర్ణం బాగా ఉపయోగపడుతుంది. పీరియడ్లో కడుపునొప్పి సమస్యలకు కూడా కాకరకాయ రసం తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

కాకరకాయ ఆకులను నూరి ఆ రసాన్ని తీసుకుంటే మొలల,సమస్య తగ్గుతుంది. ఆకుల రసాన్ని ఉదయం సాయంత్రం 250 ఎం.ఎల్ తీసుకోవడం ద్వారా సోరియాసిస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. దీర్ఘకాల సమస్యలతో బాధపడే వారికి కూడా కాకరకాయ రసం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఫాస్పరస్; అధిక మొత్తంలో పీచు లభిస్తుంది. సోరియాసిస్: నివారణలో కాకర కీలక పాత్ర పోషిస్తుంది.

శరీరానికి అత్యావశక పోషకాలైన పోలేట్ ,మెగ్నీషియం ,పొటాషియం, జింక్ కూడా సమృద్ధిగా లభిస్తాయి. కాకరలో సోడియం కొలెస్ట్రాల్ శాతం తక్కువ ధయామిన్ విటమిన్b6, పాన్తోతినిక్ యాసిడ్, ఇనుము రైబోఫ్లమిన్ , ఫాస్పరస్ లు మాత్రం పుష్కలంగా లభిస్తాయి.

సైడ్ ఎఫెక్ట్స్ Bitter gourd side effects:

డయాబెటిక్ పేషెంట్లు కాకరకాయ తినడానికి ముందు వైద్యుల సలహా తీసుకోవాలి .ఎందుకంటే శరీర,రక్తం లో చక్కెర స్థాయి,ఏ స్థాయిలో ఉందో తెలుసుకుని, వైద్యుని ప్రమేయం లేకుండా మందులను ఆపకూడదు. పిల్లలకు పాలిచ్చే తల్లులు, గర్భధారణ సమయంలో కూడా కాకరను తీసుకోకూడదు .తీసుకోవడం వల్ల కడుపులో తిమ్మర్లు లేదా గ్యాస్ ఏర్పడవచ్చు. పొట్టలో నొప్పి,విరేచనాలు, తలనొప్పి, జ్వరం కలగవచ్చు..

Exit mobile version