Uncategorized

Dondakaya Benefits in Telugu: ఆరోగ్యంతో పాటు , అందం

Dondakaya Benefits in Telugu: దొండకాయ సంవత్సరం పొడువునా దొరికే తీగ మొక్క. మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు దొండకాయ చాలా సహాయం చేస్తుంది. దొండకాయలో మంచి ఆరోగ్యంతో పాటు , అందాన్నిఇస్తుంది .దొండకాయ పచ్చిగా మరియు వండుకొని తింటారు .దొండకాయ తరచుగా తినడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది .దొండకాయ తినడం వలన అలసట ,ఒత్తిడిని తగ్గిస్తుంది . దొండకాయను ఇంగ్లీషులో”tindora “అని, హిందీలోబీoట్, కొందరి అని, సంస్కృతంలో రక్తపలా అంటారు. ఇది కుక్కుర్బిటేసి కుటుంబానికి చెందినది.దీన్ని సైంటిఫిక్ నేమ్, “కాక్సినియా గ్రాండీస్ లేదా కార్డిఫోలియా” అంటారు.

దొండకాయలో ధయామిన్ అధికంగా ఉంటుంది. ఇది కార్బోహైడ్రేడ్లను గ్లూకోజ్ గా మార్చి మన శరీరానికి శక్తిని ఇస్తుంది .అంతేకాదు మన శరీర జీవక్రియ రేటును పెంచుతుంది .దొండలో యాంటీ ఆక్సిడెంట్లు అలాగే విటమిన్ సి ,బీటా కిరోటిన్ ,అధికంగా ఉంటాయి .ఇది మన శరీరంలో క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది .దొండలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. క్యాల్షియం కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది.. అలాగే తరచుగా దొండకాయను ఆహారంలో భాగంగా చేర్చుకుంటే కిడ్నీలో రాళ్ళను కరిగిస్తుంది .

షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా మంచిది .పచ్చిదండకాయ తినడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. దొండకాయలోఅధిక మొత్తంలో క్యాల్షియం ఉంటుంది. కాబట్టి ఎముకలు దృఢంగా ఉంచుతుంది. వయసు పైబడిన వారిలో అయినా సరే ఎముకలు దృఢంగా ఉంచుతుంది .దొండకాయలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి సహాయం చేస్తుంది.

Dondakaya Benefits in Telugu
Dondakaya Benefits in Telugu

దొండకాయలోపొటాషియం ఉండటం వల్లగుండె యొక్క పనితీరు సరిగ్గా జరిగేటట్లు చేస్తుంది. గుండె అన్ని అవయవాలకు రక్త సరఫరా బాగా జరిగేటట్లు చేస్తుంది .కాబట్టి గుండె పోటు రాకుండా చేస్తుంది. అంతేకాకుండా దొండకాయ తరచుగా తినడం ద్వారా చిన్నచిన్న రోగాలను దరిచేరనీయవు .ఇందులో విటమిన్ సి ,విటమిన్ ఏ ,b 1, b2,b3,b6, b12 విటమిన్లుమరియు ఖనిజ,లవణాలు అధికంగా ఉన్నాయి. దొండకాయలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ చురుకుగా పనిచేసేటట్టు చేస్తుంది.

దొండకాయలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ ,మరియు విటమిన్ సి ,విటమిన్ ఎ మరియు పోషకాలు ఉన్నాయి. దొండకాయలో విటమిన్ ఏ ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఇందులో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి మొలలు రాకుండా కాపాడుతుంది.

యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంవల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దొండకాయలో ఎక్సర్బిక్ యాసిడ్ ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ,చర్మం నిగనిగా లాడుతుంది. చర్మం పైన మచ్చలు ,మొటిమలు, ముడతలు, రాకుండా చేస్తుంది. దొండకాయలో పొటాషియం ఉండటం వల్ల హైబీ.పీని తగ్గిస్తుంది.

దొండకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని డిహైడ్రేడ్ నుంచి కాపాడుతుంది. శరీరంలో సూక్ష్మ పోషకాలు, వైరస్లు, ఫంగస్, లోపలికి వెళ్లకుండా కాపాడుతుంది. విటమిన్ ఎ,ఉండటం వల్ల వృద్యాప చాయలు త్వరితగతిన రాకుండా చేస్తుంది. చర్మం పైన గజ్జి ,తామరను ని వారిస్తుంది. దగ్గు ,గొంతు నొప్పి, గొంతులో గరగర, శ్వాస సమస్యలు రాకుండా చేస్తుంది.

దొండకాయ మసాలా కర్రీ తయారీ విధానం (dondakaya curry):

ముందుగా నేను ఆఫ్ కేజీ దొండకాయలను తీసుకున్నాను. దొండకాయలను రెండు మూడు సార్లు నీటితో శుభ్రంగా వాష్ చేసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకుని దొండకాయ కి రెండు వైపులా చివరన కట్ చేసుకున్నాను. దొండకాయలను గుత్తి వంకాయ చేసేటప్పుడు కట్ చేసుకునేటట్లు దొండకాయను కట్ చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల దొండకాయకి ఉప్పు ,కారం బాగా పడుతుంది.

ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్ల వేరుశెనగ విత్తనాలు, రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు , ఒక టీ స్పూన్ ధనియాలు,వేసుకొని అందులోనే ఒక యాలుక,రెండు లవంగాలు, నువ్వులు చిటపటలాడిన వరకు వేడి చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అదే పాన్ లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ,ఆయిల్ వేడైన తర్వాత, ఒక టీ స్పూన్ మినప్పప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర ,హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ,చిటపటలాడింతవరకు వేడి చేసుకోవాలి .

ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఒక ఉల్లిగడ్డను వేసుకొని ,రెండు ఎండు మిరపకాయలు సగానికి తుoచుకొని వేసుకోవాలి. నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ దోరగా వేయించుకోవలసిన అవసరము లేదు. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసుకొని ,మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే దొండకాయలు మరియు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కూడా దోరగా మగ్గిపోయి ఉంటాయి.

ఆ తర్వాత ఒక చిటికెడు పసుపు, కారం టేస్ట్ కు సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు మూత పెట్టి దొండకాయలను మగ్గనివ్వాలి. మూత తీసి దొండకాయ ముక్కలను మొత్తం ఒకసారి బాగా కలుపుకొని, మనం మిక్సీ పట్టుకున్న వేరుశెనగ లు నువ్వుల,పేస్టును దొండకాయలు వేసి కొద్దిగా వాటర్ కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు గ్రేవీ ఏ కన్సిస్టేట్లో కావాలో, దానికి సరిపడినంత నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి .

ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే దొండకాయలు బాగా మెత్తగా ఉడికిపోయి, నూనె మొత్తం పైకి తేలుతుఉంటుంది.చివరగా కొద్దిగా కొత్తిమీర ,ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని, రుచికి సరిపడినంత ఉప్పు ఉందో లేదో టేస్ట్ చూసుకోవాలి. వేడివేడిగా ఉండే దొండకాయ మసాలా కర్రీ రెడీ. దీనిని చపాతీల్లోకి గాని రైస్ లోకి గాని చాలా బాగుంటుంది.

దొండకాయ ఫ్రై తయారీ విధానం (dondakaya fry):

దొండకాయలను ఆఫ్ కేజీ తీసుకున్నాను. ముందుగా ఈ దొండకాయలను శుభ్రంగా నీటితో వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకోని చివరన రెండు పక్కల చివర,కట్ చేసుకున్నాను. ఆ తర్వాత
దొండకాయలను నిలువుగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇట్లా నిలువుగా కట్ చేసుకోవడం వల్ల దొండకాయలు త్వరగా ఫ్రై అవుతాయి. వీటిని పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల శనగ బ్యాళ్లు, రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు, రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని ,వాటిని దోరగా వేయించుకొని ,పక్కన పెట్టుకున్నాను.

అవి చల్లారింతవరకు, అదే ఫ్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడి అయిన తర్వాత, దొండకాయ ముక్కలను వేసుకుని ,చిటికెడు పసుపు వేసి దొండకాయ ముక్కలను ఫ్రై చేసుకున్నాను. ఈ దొండకాయ ముక్కలు ఫ్రై అయ్యేంతవరకు, మన ముందుగా ఫ్రై చేసుకున్న శనగబేలు ,మినప్పప్పు ,నువ్వుల పొడిని బరకగా మిక్సీ పట్టుకున్నాను .

అందులోనే త్రి టేబుల్ స్పూన్ల కారం ,రెండు స్పూన్ల ఉప్పు ,7- 8 వెల్లుల్లి రెమ్మలు వేసుకుని ,కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇంతలోపు ఈ దొండకాయ ముక్కలు ఫ్రై అయి ఉంటాయి. దొండకాయలు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో కొద్దిగా , కొద్దిగావేసుకుంటూ కలుపుకున్నాను. ఈ మిశ్రమాన్ని మొత్తం వెయ్యవలసినఅవసరం లేదు .మనకు కావాల్సినంత వేసి దొండకాయ ముక్కలకు పట్టినంతవరకు వేసుకోవాలి. ఈ విధంగా దొండకాయ ఫ్రై ని తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారైన దొండకాయ ఫ్రై అన్నంలోకి మరియు సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది.

దొండకాయ పచ్చడి తయారీ విధానం (dondakaya pachadi):

పావు కేజీ దొండకాయలను శుభ్రంగా వాష్,చేసుకొని రౌండ్ గా సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత టు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకున్నాను పల్లీలు కొద్దిగా దూరంగా వేగిన తర్వాత, అందులోనే పది పచ్చిమిరపకాయలను సగానికి కట్ చేసుకుని వేసుకున్నాను.

ఇందులోనే కొద్దిగా కొత్తిమీరవేసుకొని ,దోరగా వేయించుకున్నాను. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అదే ఆయిల్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, జీలకర్ర దోరగా వేగిన తర్వాత, ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్నా దొండకాయలను వేసుకొని, చిటికెడు పసుపు వేసి, బాగా కలుపుకొని, ఐదు నిమిషాలకు పాటు మూత పెట్టుకొని ముగించుకున్నాను. ఈ దొండకాయలు మగ్గేంతవరకు మనం ముందుగా తయారు చేసుకున్న పల్లీలు, మిర్చి లను మిక్స్ లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను.

ఆ తర్వాత మూత తీసి దొండకాయలను లో ఫ్లేమ్ లో పెట్టుకొని, ఒక పెద్ద సైజు టమాట పండు సన్నగా కట్ చేసుకుని అందులో వేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసుకున్నాను. చి oత పండు వేయడం వల్ల దొండకాయ పచ్చడి టేస్ట్ గా ఉంటుంది. కాబట్టి కొద్దిగా చింతపండు వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదు. ఈ దొండకాయలు, టమాటా పండు, చింతపండు మూత పెట్టి మగ్గించుకున్నాను. మూత తీసి ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ దోరగా వేయించుకున్నాను. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నాను.

ఇవి చల్లారిన తర్వాత మన ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిలోనే ఈ దొండకాయలను , టమాట పండు ,చింతపండు వేసుకొని, కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్నాను. చివరగా ఒక పెద్ద ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసుకుని ఈ మిక్సీ లోనే వేసుకుని ,కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను. ఉల్లిగడ్డలు కచ్చాపచ్చా ఉండడం వల్ల పచ్చడికి టేస్ట్ వస్తుంది. కాబట్టి ఈ మిశ్రమం మొత్తం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుండదు. కాబట్టి ఈ మిశ్రమం మొత్తం కచ్చాపచ్చాగా ఉండాలి. చివరగా తాలింపు పెట్టుకొని ,ఈ దొండకాయ పచ్చడిలోకి కలుపుకున్నాను. వేడి వేడిగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button