Murukulu: మురుకులు కరకరలాడాలంటే ఇలా చేయండి.
Murukulu Making: మనదేశంలో అనేక రకాలైనస్నాక్స్ఐటమ్ వెలుగులోనికి వస్తు ఉంటాయి. వాటన్నింటినీ అందరూ ఇష్టపడుతూ, ఇంట్లోనే చేసుకుని తినే వారే ఎక్కువ. బయట చేసినవి తినడం కంటే ఇంట్లో చేసుకొని తినడమే చాలామందికి ఇష్టం. పూర్వం నుంచి వెలుగులోకి ఉన్న స్నాక్స్ లలో మురుకులు ముఖ్యమైనవి.
మురుకులు తెలియని వారు ఉండరు. వీటిని అందరూ ఇష్టపడతారు. ఎక్కువగా మన భారతీయులు సంప్రదాయం వంటకంగా చేసుకుంటారు. పండగలు వచ్చాయంటే ఏ ఇంటిలోనైనా మురుకులు తప్పనిసరిగా ఉంటాయి. పండగలకే కాక, ఏ కాలంలో నైనా తినగలిగే స్నాక్స్ మురుకులు. వాన కాలంలో సాయంత్రం పూట వర్షం పడుతుండగా మురుగులు తిని, టీ తాగితే ఆ మజానే వేరుగా ఉంటుంది. అంతేకాక పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏదో ఒక స్నాక్స్ తినాలని మారం చేసే పిల్లలకి మురుకులను స్నాక్స్ గా ఇవ్వవచ్చు. ఎన్ని తిన్న మళ్లీ తినాలి అనిపించేంత టేస్ట్ గా ఉంటాయి. ఈ మురుకులను ఇంట్లోనే ఈజీగా, తొందరగా తయారు చేసుకోవచ్చు. బయటకొన్న మురుకులు కంటే ఎక్కువ టెస్ట్ గా క్రిస్పీగా కూడా ఉంటాయి.
మురుకుల తయారీకి కావలసిన పదార్థాలు:
- 1.బియ్యం
- 2.పుట్నాల పప్పు
- 3.సెనగపప్పు
- 4..మినప్పప్పు
- 5.జీలకర్ర
- 6.వాము గింజలు
- 7.మురుకులు వేయించడానికి కావలసినంత నూనె
- 8.కారం
- 9.ఉప్పు
- 10.తగినంత నీరు.
మురుకుల తయారీ విధానం:
ముందుగా బియ్యాన్ని బాగా కడిగి 4 లేదా 5 గంటల వరకు బాగా నానబెట్టుకోవాలి. తరువాత నానబెట్టిన బియ్యం లోనే నీరంతా ఒంపి, ఒక పలుచటి క్లాత్ పై పోసి ఎండలో బాగా అర పెట్టాలి. బియ్యం ఎంత వట్టిగా ఆరిపోతే మురుకులు అంతా స్మూత్ గా ఉంటాయి. బియ్యాన్ని ఇంచుమించు ఒక రోజంతా ఎండలో ఆరబెట్టుకోవాలి. తర్వాత బియ్యం కేజిన్నర అయితే దానికి తగినట్లుగా, అరకేజీ పుట్నాల పప్పు, పావు కేజీ మినప్పప్పు, పావు కేజీ సెనగపప్పు కలిపి పిండిని పట్టించుకోని, మురుకుల పిండిని తయారు చేసుకోవాలి.
పుట్నాల పప్పు, మినప్పప్పు శనగపప్పు, దోరగా వేయించి కూడా పిండిని పట్టించుకోవచ్చు. వీటిని కలపడం వల్ల మురుకులు ఎక్కువ టేస్టీగాను, క్రిస్పీ గాను వస్తాయి. ఈ పిండిలో స్పైసీ కి తగ్గట్టుగా మీరు తినగలిగేంత కారం, టేస్ట్ కు తగ్గట్టుగా ఉప్పు, కొంచెం వాము గింజలు, కొంచెం జీలకర్ర వేసుకొని పిండి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత బాగా వేడి చేసిన నూనెను పిండిలో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత తగినంత నీరు పోసుకొని పిండిని రొట్టెలు చేసే పిండిలాగా ముద్దగా కలుపుకోవాలి.
Read More: Smooth Chapati recipe రుచికరమైన, మృదువైన చపాతి చేయడం మీకు వచ్చా?
మురుకులు కరకరలాడాలంటే:
ఈ విధంగా కలిపిన పిండిని కొంచెం కొంచెం సేపు 10 లేదా 15 నిమిషాల వరకు మగ్గనించాలి. తర్వాత స్టవ్ పై బాండీ పెట్టి నూనెను బాగా వేడెక్కనివ్వాలి. కలుపుకొని తయారు చేసుకున్న పిండిని చిన్నచిన్న ముద్దలుగా తీసుకొని చుట్టాల పావులో లేక చుట్టాల అచ్చులలో పెట్టుకొని నూనెలో వేయాలి. ఈ విధంగా చేసి రెండు వైపులా క్రిస్పీగా వచ్చేలాగా కాల్చుకోవాలి.
ఇలా చేయడం వల్ల మురుకులు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మురుకులను కట్టెల పొయ్యి మీద చేసుకోవాలి అనుకునేవారు మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మురుకులు చేసుకోవాలి.Murukulu: మురుకులు కరకరలాడాలంటే ఇలా చేయండి.