Recipes

Peanuts Uses:పల్లీలతో ప్రయోజనాలు ఎన్నో తెలుసుకో!

మనదేశంలో వేరుశనగలను ఉపయోగించి అనేక రకాల వంటకాలు చేస్తారు. వీటిని ఒక్కోచోట ఒక్కో విధంగా పిలుస్తారు కొన్ని చోట్లలో పల్లీలని కొన్నిచోట్ల వేరుశెనగపప్పులని అలా అనేక రకాలుగా పిలుస్తారు. వీటిని మన దేశంలో ఎక్కువ శాతం సాగు చేస్తారు. పూర్వకాలంలో నుంచే ఈ సాగు అందుబాటులో ఉంది. దక్షిణాది బ్రెజిల్ లో పేరులో మొదటిగా సాగు చేయబడింది. 3500 సంవత్సరాల క్రితమే అమెరికాలో కూడా సాగులో ఉందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.వేరుశనగలను పేదవారి జీడిపప్పు అని అంటారు. ఎందుకంటే జీడిపప్పులో ఉండే అన్ని పోషకాలకు సమానంగా వేరుశనగలో ఉంటాయి. వీటిని చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు తినవచ్చు. ఎలాంటి రోగాలు ఉన్నవారైనా వీటిని ఆహారంగా తీసుకోవచ్చు. వేరుశనగలో ఉండే అన్ని ప్రోటీన్లు మన శరీరానికి అందాలంటే ఎక్కువ శాతం ఉడకబెట్టుకొని తినాలి.

వేరుశనగలలో ఉండే మూలకాలు:

1.విటమిన్ E

2. పోలేట్.

3.మెగ్నీషియం

4. రాగి భాస్వరం

5.ఫైబర్ 

6.నియాన్ 

7.మాంగనీస్ 

8.జింక్. మొదలైనవి ఉంటాయి.

విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. మెగ్నీషియం గుండె సక్రమంగా పనిచేయలా చేస్తుంది. ఫైబర్ అంటే పీచు పదార్థం ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి ఉపయోగపడుతుంది. వేరుశనగలో ఉండే పోలేట్ క్యాన్సర్ ను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.

100 గ్రాముల పల్లీలలో ఉండే ప్రోటీన్స్:

100 గ్రాముల వేరుశనగలను ఆహారంగా తీసుకుంటే

  •            567 గ్రాముల కేలరీలు.
  •            21 గ్రాముల పిండి పదార్థాలు
  •            25 గ్రాముల మాంసకృతులు 
  •            48 గ్రాముల కొవ్వులు
  •            0.9 గ్రాముల లవణాలు
  •            9 గ్రాముల పీచు ఉంటాయి

అంతేకాక  కొలెస్ట్రాల్ అసలు ఉండదు.  

ఒక కప్పు అనగా, 25 గ్రాముల పల్లీలు తీసుకుంటే ఉండే ప్రోటీన్లు:

  •    కెలరీలు-170 గ్రాములు.
  •     సంతృప్తకొవ్వులు-3గ్రాములు
  •     సోడియం-5.5 గ్రాములు
  •     కార్బోహైడ్రేట్స్-7 గ్రాములు
  •     చక్కెర       -1 గ్రాము. కొలెస్ట్రాల్ ఉండదు.

    ఒక కప్పులో సగం పల్లీలు తీసుకుంటే అందులో ఉండే ప్రోటీన్లు:

  •           207 కేలరీలు
  •           9 గ్రాముల ప్రోటీన్
  •           18 గ్రాముల క్రొవ్వు
  •           1.6 గ్రాముల కార్బోహైడ్రేడ్లు
  •           3 గ్రాముల ఫైబర్
  •           1 గ్రాము చక్కెర కలిగి ఉంటాయి.

పల్లీలను ఆహారంగా తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు:

మామూలుగా పల్లీలను పచ్చిగా తినడం కంటే వాటిని ఆరు గంటల సేపు నానబెట్టి ఉడికించి తినడం ద్వారా చాలా ఫలితాలను పొందవచ్చు.

పల్లీలు ఉడకబెట్టుకొని తినడం ద్వారాత్వరగా జీర్ణం అవుతాయి. పల్లీల లో ఉండే అన్ని పోషకాలు మన రక్తంలోకి త్వరగా చేరుతాయి. పిల్లలు బాగా బరువు పెరగాలి అన్నా, బాగా ఆరోగ్యంగా ఉండాలి అన్న బ నీరసం లేకుండా ఉండాలి అన్నా, ప్రతిరోజు పిల్లలకు ఉడకబెట్టిన పల్లీలు ఇస్తే నీరసం లేకుండా హుషారుగా ఉంటారు.

అలాగే బరువు కూడా బాగా పెరుగుతారు. ఇలా ఉడకబెట్టుకున్న పల్లీలను పిల్లలే కాక పెద్దలు కూడా తినవచ్చు. గర్భవతులు ఇలా తినడం ద్వారా పిల్లల గ్రోత్ చాలా బాగుంటుంది. పాలిచ్చే తల్లులు వీటిని తింటే పాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది. రాత్రంతా నానబెట్టి పెట్టుకున్న పల్లీలకు, ఒక అరటిపండు కలిపి పేస్టులా చేసి జావలాగా రోజు ఉదయం పూట టిఫిన్లా తీసుకుంటే ఆకలి ఎక్కువగా ఉండదు.

Peanuts Uses:పల్లీలతో ప్రయోజనాలు ఎన్నో తెలుసుకో!

జాతీయ పోషకాహార సంస్థ వీటిపై పరిశోధన చేసి వేరుశనగ, బెల్లం, కలిపి చేసిన చిక్కీలు పిల్లలు తింటే వారి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. గుప్పెడు వేరుశనగలు, బెల్లం, మేకపాలు కలిపి ప్రతిరోజు ఆహారంగా ఆహారంగా తీసుకుంటే రోగనిరోధక శక్తి తొందరగా పెరుగుతుంది. మధుమేహం ఉన్నవారు వీటిని తినడం వల్ల ఎటువంటి హాని ఉండదు. ఉడకబెట్టిన వాటిని ప్రతిరోజు ఆహారంగా తీసుకుంటే మధుమేహం వారికి కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని లభిస్తాయి.

షుగర్ కూడా పెరగకుండా ఉంటుంది. ఎసిడిటీ ఉన్నవారికి, అల్సర్, కడుపులో మంట ఉన్నవారు కూడా వీటిని ఆహారంగా తీసుకోవచ్చు అందువల్ల మంచి లాభాలను పొందవచ్చు. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు కూడా వారంలో రెండు మూడు రోజులు వీటిని ఆహారంగా తీసుకుంటే కిడ్నీలలో రాళ్లు కరిగిపోతాయి. అలాగే మళ్లీ కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా ఉంటాయి.

బరువు తగ్గాలి అనుకున్న వారు ఆహారం తినక ముందు గుప్పెడు వేరుశనగలను ముందు తిని తర్వాత భోజనం చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. బరువు కూడా తగ్గుతారు. ఎందుకంటే పల్లీలు తింటే ఆకలి గుణం తక్కువ, అందువల్ల ఆహారం తక్కువగా తింటారు. అలాగే పల్లీలు ప్రతిరోజు ఆహారంగా తీసుకున్న వారు ఎక్కువ రోజులు జీవించవచ్చు అని వైద్యులు తెలుపుతున్నారు. వేరే కారణాల వల్ల మరణించే ప్రమాదాలు కూడా తగ్గుతాయి. పల్లీలను పేస్ట్ లా చేసి పేస్ కి ప్యాక్లా వేసుకుంటే మృత కణాలు తగ్గి, చర్మం మృదువుగా కాంతివంతంగా ఉంటుంది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button