Rags Benefits: ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు
Rags Benefits: రాగులకు ఉన్న శక్తి అంతా ఇంత కాదు. ఆహారపరంగా ఔషధపరంగా కూడా దీన్ని వాడవచ్చు.బార్లీ, గోధుమ, వరి ఇంక మొక్కజొన్నలతో పోలిస్తే ముఖ్యంగా ఈ రాగుల్లో బీజ కవచం ఫోలిపినాల్స్ తో సంపన్నమైనది.వరితో పోలిస్తే 45 రెట్లు, గోధుమతో పోలిస్తే 5రెట్లు ఫెనోలిక్ రాగుల్లో ఉంటుంది.రాగులు ఇతర ధాన్యాల కంటే బలవంతమైనవి.ఈ రాగులను దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
రాగులు రాజ పోషకాలు:
రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. రాగులతో తయారుచేసిన ఆహారం రుచికరంగా ఉండటంతోపాటు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుంది. 100 గ్రాముల వరి అన్నంలో ఎముకల పుష్టికి అవసరమైన కాల్షియం గరిష్టంగా 33 మిల్లీగ్రాములు ఉండగా…గోధుమల్లో 30 మిల్లీ గ్రాములు మాత్రమే లభిస్తుంది. అదే 100 గ్రాముల రాగి పిండితో చేసిన సంకటిలో 34 4 మిల్లీగ్రాముల క్యాల్షియం అందుతుంది.
ప్రస్తుత జీవనశైలితో చిన్న వయసులోనే, కాళ్లు,, నడుము నొప్పులు రావడం సర్వసాధారణంగా మారింది. ఇవి కొంచెం అధికం కాగానే మందులు వాడేస్తున్నారు. అయితే అలాంటివారు రోజు ఆహారంలో రాగి పిండిని వాడితే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.. రాగులతో ఎన్నో రకాల పదార్థాలను తయారు చేసుకోవచ్చు. వాటిలో కొన్ని. రాగి పిండితో లడ్లు, బిస్కెట్లు, కేకులు, రాగి చపాతి, రాగి ముద్ద ఇలా చేసి రుచికరమైన ఆహార పదార్థాలను పిల్లల లుకూడా ఇష్టపడి తింటారు.
రాగుల ఆహారంతో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి….. ఎముకలు, దంతాల గట్టితనానికి దోహదపడుతుంది. ఐరన్ అధికంగా ఉన్నందున రక్తహీనత ముప్పు తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని రాగులలో ఉండే పోషకాలు నియంత్రిస్తాయి. ఎదిగే పిల్లలు, గర్భిణీలు నిత్యం పాలు తాగుతుంటారు. పాల కన్నా అధికంగా కాల్షియం రాగుల్లో ఉంటుంది. బియ్యం, గోధుమలతో పోలిస్తే రాగుల్లో గ్లైసిమిక్ ఇండెక్స్, ఎక్కువగా ఉన్నందున ఈ ఆహారం తిన్నవారికి ఊబకాయం సమస్య తగ్గుతుంది.
మహిళలకు వయసుతోపాటు వచ్చే కొన్ని ఎముకల వ్యాధులను నివారణకు ఉపకరిస్తాయి ఈ రాగుల్లు. మానసిక ఒత్తిడి తగ్గడానికి కూడా ఈ ఆహారం ఉపయోగపడుతుంది . రాగులను నిత్యం ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎముకలు గట్టిగా తయారవుతాయి. ఈ రాగులలో క్యాల్షియంఎక్కువగా ఉంటుంది. రాగి గంజి తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..
రాగులలో గల పోషకాలు (Rags):
ప్రోటీన్లు 7.3 గ్రాములు. కార్బోహైడ్రేడ్లు 72 గ్రాములు. ఖనిజాలు 2.7 గ్రాములు. పీచు పదార్థం 3.6 గ్రాములు. మిల్లీగ్రాములలో పోషకాలు. రాగులలోకాల్షియం 34 4మిల్లీగ్రాముల. ఫాస్పరస్ 2 83 మిల్లీగ్రాములలో. ఐరన్ 3.9 మిల్లీగ్రాములు. దయామిన్ 0.42 మిల్లీగ్రామ్లలో రాగులు ఉంటాయి.
రాగులలోని కాల్షియం పిల్లలు చక్కగా ఎదగటానికి తోడ్పడుతుంది.రాగుల వల్ల జుట్టు ఒత్తుగాను, పొడవుగాను పెరుగుతుంది. షుగర్ కి రాగి జావా ఎంతో మంచిది.రాగులలో అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది.ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి పొడి చేసిన పిండిని తాగించినట్లయితే పిల్లలకు శక్తి లభిస్తుంది.శ్రమపడి పని చేసే వారికి ఈ రాగుల పిండితో తయారు చేసే పదార్థాలను తరచుగా తిన్నట్లయితే వారికి శక్తి లభిస్తుంది. స్త్రీలు 30 సంవత్సరాల వయసు దాటాక ఎముకలపట్టత్వాన్ని కోల్పోతుంటారు.అలా కాకూడదు అనుకుంటే ఈ రాగులతో రాగి మాల్ట్ రోజు తీసుకున్నట్లయితే ఎముకలు దూడత్వానికి తోడ్పడుతుంది.
రాగులు లో ఫ్యాట్ శాతాన్ని కలిగి ఉంటుంది.ఇది త్వరగా జీర్ణం అవుతుంది. రాగులలో ఐరన్ ఎక్కువగా ఉన్నటువంటి ఒక మూలకం.వీటిలో యాంటీ ఆక్సిడెంట్ లు కూడా ఎక్కువే.అందువల్ల వయస్సును తక్కువగా కనబడేలా చేస్తుంది.హై బీపీతో బాధపడే వారికి ఫైబర్ పుష్కలంగా ఉన్నటువంటి రాగులు బాగా పనిచేస్తాయి. అంతేకాక గుండె బలహీనత,ఉబ్బసం వంటి వాటిని తగ్గిస్తుంది.ముఖ్యంగా వేసవి కాలంలో రాగి జావా,బెల్లంతో చేసుకుని తాగడం చాలా మంచిది.దీనిని తాగడం వలన రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు.
Read more: Pearl Millet Uses in Telugu సజ్జల ఉపయోగాలు
ఈ రాగుల తో చేసిన పదార్థాలను తినడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. దీనివలన బరువు పెరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ రాగులలో క్యాన్సర్ రోగాలను తగ్గించే శక్తి ఉంది. ఈ రాగులను మరీ ఎక్కువగా తీసుకుంటే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మూత్రపిండాల రోగులలో అతిగా తినడం నివారించడానికి రాగులు సిఫారసు చేయబడ్డాయి.అంతేకాక థైరాయిడ్ ఉన్నవాళ్లు రాగులను తీసుకునే ముందు వైద్యున్ని సంప్రదించాలి.