Skin Chicken: చికెన్ ను స్కిన్ తో మంచిదా? స్కిన్ లెస్ గా తీసుకోవడం మంచిదా?
Skin Chicken: ప్రపంచంలో చాలామంది చికెన్ అంటే ఇష్టపడి తింటారు. అలాగే కొంతమంది శాఖాహారులు కూడా ఉంటారు. మాంసాహారాలు మాత్రం చికెన్ తినకుండా ఒక వారం రోజుల వరకు కూడా ఉండలేరు. వారంలో కనీసం ఒక్కరోజైనా చికెన్ తినాల్సిందే! వారంలో రెండు లేదా మూడుసార్లు తింటూ ఉంటారు. కనీసం వారంలో కర్రీ, లేదా ఫ్రై, చికెన్ తో చేసిన ఐటమ్స్ లలో ఏదో ఒకటి కచ్చితంగా తింటారు. కొంతమంది అయితే ప్రతిరోజు తినాలని అనుకుంటారు.
అసలు ముక్క లేనిదే ముద్ద దిగదు అని అన్నట్లుగా ఉంటారు. అయితే చికెను అంతగా ఇష్టపడి తినేవారు, షాప్ కు వెళ్లగానే స్కిన్ లెస్ చికెన్ లేదా స్కిన్ తో చికెన్ అని చెప్పి, చికెన్ ను కొంటారు. అలా ఎవరికి నచ్చిన దానినివాళ్ళు తీసుకుంటారు. అందువలనే చికెన్ వ్యాపారస్తులు వాటికి స్కిన్ తో ఉంటే ఒక రేటు, స్కిన్ లెస్ అయితే ఒక రేటు పెట్టి అమ్ముతారు. సాధారణంగా స్కిన్ కంటే స్కిన్ లేస్ చికెన్ కొంచెం ఎక్కువ రేటుతో ఉంటుంది.
పోయిన సంవత్సరం ప్రపంచమంతటా 13.30 కోట్ల టన్నుల చికెన్ వినియోగించిందని, ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తెలిపింది. అయితే ఇండియాలో 41 లక్షల టన్నులకు పైగా నే వాడిందని చెప్పవచ్చు. అయితే చికెన్ లో కొవ్వు తక్కువగా ఉండి, పోషకాలు ఎక్కువగా ఉండటం వలన, అదే విధంగా మన శరీరానికి అవసరమయ్యే మోనోశ్యాచ్యురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అరికడుతుంది.
చికెన్ స్కిన్ తో లేదా స్కిన్లెస్ తినడం మంచిదా తెలుసుకుందాం:
స్కిన్ చికెన్ లో 32 శాతం కొవ్వు ఉంటుంది. అంటే ఒక కిలో చికెన్ లో 320 గ్రాముల క్రూ ఉంటుంది, అని నిపుణులు అంటున్నారు. స్కిన్ లో ఉండే చికెన్ లో ఉండే కొవ్వులో మూడింటిలో రెండు వంతుల అసంతృప్త కొవ్వులు ఉంటాయి. అసంతృప్త కొవ్వులను మంచి క్రోవ్వులు అని అంటారు. అదేవిధంగా రక్తంలో కొవ్వును పెంచడానికి కూడా సహాయపడతాయి. అందువలన చికెన్ స్కిన్ తో సహా తింటే 50% కేలరీలు పెరుగుతాయి అని నిపుణులు తెలియజేస్తున్నారు.
170 గ్రాముల స్కిన్ లేస్ చికెన్ తింటే, 284 కేలరీలు ఉంటాయి. కెలరీలలో 80%, ప్రోటీన్ ల నుంచి 20% క్రోవు శరీరానికి అందుతుంది. 170 గ్రామ్స్ చికెన్ స్కిన్ తో కలిపి తింటే, 386 కేలరీలు అందుతాయి. ఇందులో ప్రోటీన్ ల నుండి 50% కేలరీలు, ప్రోటీన్ల నుండి 50% కొవ్వులు అందుతాయి. అందువలన ఎలాంటి రోగాలు లేకుండా ఉండి, చురుకుగా తగినంత ఎత్తు బరువు ఉండేవారు, స్కిన్ లేస్ చికెన్ తింటే మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే స్కిన్ తో ఉండే చికెన్ రుచి చాలా బాగుంటుందని కూడా తెలియజేశారు.
చాలామంది చికెన్ ఫ్రిజ్లో పెట్టుకొని చాలా రోజుల తర్వాత తింటారు. కొందరు అయితే వండటానికి ముందు చికెన్ ఫ్రిజ్ నుండి తీసి బయట పెడతారు. మరికొందరు ఫ్రిజ్ నుండి బయటకు తీసి, మళ్ళీ ఫ్రిజ్లో పెడతారు. ఒకసారి ఫ్రిడ్జ్ నుండి తీసిన చికెన్ మళ్లీ లోపల పెట్టకూడదు, అని పోషకాహార నిపుణులు అంటున్నారు.
తినే ఆహార పదార్థాలలో సూక్ష్మజీవులు పెరుగుదలను ఆపడం కోసం, చికెన్ని ఫ్రిడ్జ్ లో ఉంచుతారు. ఒకసారి బయటకు తీసి కూలింగ్ తగ్గిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. అలా చేస్తే సూక్ష్మజీవులు మరింత పెరుగుతాయి. అందువలన ఒకసారి బయటకు తీస్తే మళ్లీ లోపల పెట్టకూడదు అని, అన్ని రకాల మాంసాహార పదార్థాలకు ఇది వర్తిస్తుందని చెబుతున్నారు. ఒకసారి తీసి వండిన తర్వాత మళ్లీ ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు. వండినప్పుడు అందులో ఉండే సూక్ష్మజీవులు నశిస్తాయి. అందువలన ఎటువంటి హాని ఉండదు.