Horoscope: ఈ వారం ఈ రాశి వారు చాలా నష్టపోతారు.

weekly horoscope

మేషం

#horoscope week:ఈవారం అనుకూలంగా ఉంటుంది. ప్రముఖుల పరిచయాల వల్ల లాభాన్ని అర్జిస్తారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సంతానం, వృత్తి, వ్యాపార, విద్య, ఆర్థిక, ఉద్యోగాలలో ఆశించిన విధంగా ఫలితాలను పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కొత్త వస్త్రాలు, ఆభరణాలను కొనే ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. లక్ష్మీ నృసింహ కవచం పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు.

వృషభం:

horoscope this week

ఈవారం కొంత అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు అడ్డంకులు వచ్చిన నిదానంగా పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణ పనులు చేపట్టే అవకాశం ఉంది, అన్ని రంగాల వారికి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది, వారం మొదటిలో అప్పుల బాధ ఎక్కువవుతుంది, వ్యాపారం, వృద్ధి, విషయాలు కొంత అనుకూలిస్తాయి, ఆర్థిక పరిస్థితి కూడా కొంత పురోగతిని సాధిస్తుంది, ఈ రాశి వారికి ఉన్న ఆశయాలు నెరవేరుతాయి, ఉద్యోగులకు అందిన వార్త సంతోషాన్నిస్తోంది, హనుమాన్ బడబానల స్తోత్రం చదవడం వలన శుభ ఫలితాలు మంచి ఫలితాలను పొందుతారు.

మిధునం:

ఈవారం మంద కోడిలా సాగుతుంది, ముఖ్యమైన పనులు అధిక ఒత్తిడితో పూర్తి చేస్తారు, ఆప్తులతో చిన్నపాటి గొడవలు సంభవిస్తాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలలో కొంత పురోగతి ఉంటుంది, ఉద్యోగస్తులకు అధిక శ్రమ తప్పదు, చిన్న తరహా పరిశ్రమలకు కొంత నిరుస్తాహం తప్పదు, వాహనం కొనే అవకాశాలు ఉన్నాయి, నవగ్రహ స్తోత్రం పారాయణం చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు.

కర్కాటకం:

ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారం, విషయాలలో కలిసి రాదు. వ్యాపారం మొదట్లో అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది, ముఖ్యమైన పనులు ఆగిపోతాయి, కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉండదు, నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఇంటి నిర్మాణ పనులలో చిక్కులు తప్పవు, దేవాలయాలను దర్శిస్తారు, ఇంటా, బేయటా అనుకూలంగా ఉండదు. ఆపదుద్ధారణ స్తోత్రం చదవడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు.

సింహం:

ఈవారం అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది, వృత్తి, విద్యా, ఉద్యోగం, వ్యాపారం, సంతానం విషయాలలో ఆశించిన లాభాన్ని పొందుతారు, ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది, ఇంటిలో శుభకార్యాలు చేసే అవకాశం ఉంది, చేపట్టిన పనులలో తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగులకు పై అధికారుల నుండి ఒత్తిడి తగ్గుతుంది, చిన్నప్పటి స్నేహితులతో సంతోషంగా గడుపుతారు, అర్జునకృత దుర్గా స్తోత్రం పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు.

కన్య:

ఈ రాశి వారికి ఈ వారం మధ్యలో అనుకూలంగా ఉండదు, వారం మొదటిలో వృత్తి, వ్యాపారం, ఉద్యోగం విషయాలలో లాభాలను పొందుతారు, బంధువులతో సంతోషంగా ఉంటారు, వారం మధ్యలో ఈ రాశి వారికి కొంత ఇబ్బందులు తప్పవు, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది, కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు కూడా అధికమవుతాయి, గరుడ కవచం పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి.

తుల:

ఈ రాశి వారికి కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది, చేపట్టిన పనులలో ఆటంకాలు వచ్చిన నిదానంగా పూర్తి చేస్తారు, వృత్తి, వ్యాపారాలు కొంత లాభాలను పొందుతారు, వ్యాపారంలో పెద్ద వారి ఆలోచనలు పాటించడం మంచిది, స్నేహితులతో గొడవలకు వెళ్లకుండా ఉండటం మంచిది. బంధువుల నుండి వచ్చిన వార్త వల్ల కొంత సంతోషాన్ని ఇస్తుంది, కుటుంబంతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు, కొన్ని రంగాల వారికి ఇబ్బందులు తప్పవు. ఉద్యోగాలలో శ్రమ ఒత్తిడి పెరుగుతుంది, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి.

వృశ్చికం

ఈవారం మొదటిలో అనుకూలంగా ఉంటుంది, ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు, చిన్నప్పటి స్నేహితులతో సంతోషంగా ఉంటారు, ఇంటి పనులను చేపడతారు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, విషయంలో గతం కంటే కొంత సంతృప్తికరంగా ఉంటుంది, అన్ని రంగాల వారికి మంచి అవకాశాలు ఉన్నాయి, రుణ ఒత్తిడి తగ్గుతుంది, ఆర్థిక పరిస్థితి కొంత మేరా అనుకూలిస్తుంది, శత్రువులు మిత్రులుగా మారుతారు, వారం మధ్య ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. శ్రీకృష్ణ చింతాష్టకం పారాయణం చేస్తే మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి.

ధనస్సు:

ఈవారం అనుకూలంగా ఉంటుంది, వృత్తి, వ్యాపారం, విద్యా, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు లాభాలను అందిస్తాయి, చేపట్టిన పనులు త్వరగా పూర్తిచేస్తారు, బంధుమిత్రులతో ఉండే గొడవలు పరిష్కారం అవుతాయి, దూరపు బంధువుల నుంచి వచ్చిన ఆహ్వానం సంతోషాన్ని ఇస్తుంది, సొంత ఆస్తి గొడవలు పరిష్కారం అవుతాయి, ఇంటి పనులను వేగవంతం చేస్తారు, వారం మధ్యలో అనుకోని విధంగా అనవసరంగా ఖర్చు చేసే అవకాశం ఉంది, ఇంటిలో చిన్న చిన్న గొడవలు వస్తాయి, మనసుకు అశాంతి తప్పదు, గణేష్ హృదయ స్తోత్రం పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు.

మకరం:

ఈవారం అందరికీ అనుకూలంగా ఉంటుంది, వృత్తి, వ్యాపారం, విద్యా, ఉద్యోగం, విషయాలలో లాభాన్ని పొందుతారు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ఉద్యోగస్తులకు జీతం విషయంలో సంతోషాన్ని పొందుతారు, అన్నదమ్ములతో కలిసి స్థిరాస్తి విషయంలో పరిష్కారమార్గాలను వెతుకుతారు, ముఖ్యమైన పనులు త్వరగా పూర్తిచేస్తారు, చాలా కాలం నుంచి ఉన్న అప్పుల బాధలు తప్పుతాయి, చిన్నప్పటి స్నేహితులను కలుసుకొని కష్ట,సుఖాలను పంచుకుంటారు, వారం ప్రారంభంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇంట, బయట చికాకు తప్పదు, మేదో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది.

కుంభం:

వృత్తి, వ్యాపారాలలో పక్కవారి ఆలోచనలను అనుసరించడం మంచిది, విద్యార్థులకు శ్రమ తప్పదు, కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు చేయకుండా ఉంటే మంచిది. ఇంటి నిర్మాణ పనులు ఆగిపోతాయి, కుటుంబంలోని బాధ్యతలు వల్ల కొంత ఇబ్బందులు తప్పవు, చిన్న తరహా పరిశ్రమలకు కూడా కలిసి రాదు. వారం చివరలో విందు, వినోదాలు తో సంతోషంగా ఉంటారు, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది.

మీనం:

వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగం విషయాలలో నిరాశ తప్పదు, ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది, దేవుని సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, స్నేహితులతో గొడవలు పడే అవకాశం ఉంది, స్థిరాస్తి ఒప్పందాలను వాయిదా వేస్తారు, ప్రముఖులతో చర్చలు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి, చిన్న తరహా పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుంది, వారం మొదటిలో శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు, అనుకొని విధంగా ధన లాభం పొందే అవకాశాలు ఉన్నాయి, రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు.