Horoscope Weekly: ఈ వారం అనుకూలంగా ఉన్న రాశులు

Horoscope Weekly: ఈ వారం అనుకూలంగా ఉన్న రాశులు 30-10-2022 to 05-11-2022.

మేషం:

స్థిర ఆస్తి గొడవలు పరిష్కారం దిశగా వెళతాయి, అడ్డంకులు వచ్చి ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు, వారం మొదటిలో అనుకోని విధంగా ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగ ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు, బంధువుల రాకతో ఇంటిలో సంతోషకర వాతావరణ నెలకొంటుంది, ఇంటి నిర్మాణ పనులు చేపడతారు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, పరిశ్రమలు లాభాలను అర్జిస్థాయి, కుటుంబంలో శుభకార్యాల విషయమై పెద్దల ఆలోచనలను ఆచరిస్తే మంచిది. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు.

వృషభం:

కుటుంబంలో చిన్నపాటి గొడవలు సంభవిస్తాయి, ముఖ్యమైన విషయాలపై స్నేహితులతో చర్చించి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు, విద్యార్థుల పరీక్ష ఫలితాలు సంతోషకరంగా ఉంటాయి, వారం మొదటిలో అనవసరమైన ఖర్చులు తప్పవు, ఇంటా, బయట అనుకూలంగా ఉంటుంది, ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత అప్పులు తీరుస్తారు, చిన్నప్పటి స్నేహితులను కలిసి సంతోషంగా ఉంటారు, వృత్తి వ్యాపారాలలో కొంత లాభాన్ని అర్జిస్తారు, ఉద్యోగాలలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది, దేవుని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, కొన్ని రంగాల వారికి అనుకూలంగా లేదు, కాలభైరవాష్టకం పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

మిధునం:

బంధువులతో ఉన్న గొడవలు పరిష్కారం అవుతాయి, చేయవలసిన పనులు ఆటంకాలు ఎదురైన నిదానంగా పూర్తి చేస్తారు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, సొంత ఆస్తి గొడవలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి, అన్ని రంగాల వారికి అనుకూలంగా లేదు, వృత్తి వ్యాపారాలు ఆశించిన లాభాలను అర్జీ స్థాయి, వారం చివరలో స్నేహితులతో గొడవలు పడకుండా ఉండటం మంచిది. ఇంటి నిర్మాణ పనులు చేపడతారు, ప్రయాణాలలో అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలను అందుకోవచ్చు.

కర్కాటకం:

ఆర్థికంగా ఎక్కువ లాభాలను అర్జిస్తారు, ఉద్యోగాలలో ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, చేయవలసిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు, వారం మధ్యలో గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన వారి పరిచయాలు పెరుగుతాయి, చిన్న తరహా పరిశ్రమలు లాభాల బాట పడతాయి, కొత్త వాహనం, భూమి కొనే ప్రయత్నాలు చేస్తారు, వృత్తి, వ్యాపారాలు లాభాలను అర్జిస్తాయి, వాహనం చివరలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడటం జాగ్రత్త పాటించడం మేలు, అనుకోని విధంగా ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి, దుర్గ ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

సింహం:

ఇంటిలో మీ నిర్ణయాలకు ఎదురు ఉండదు, శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు, విద్యార్థుల పరీక్ష ఫలితాలు నష్టాన్ని ఇస్తాయి, ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు, మీకు అందవలసిన డబ్బు అనుకున్న సమయానికి అందుతుంది, వృత్తి వ్యాపారాలు పురోగతిని సాధిస్తాయి, వారం మొదటిలో కుటుంబంలోని వారితో చిన్నపాటి గొడవలు తప్పవు. తోడబుట్టిన వారితో కలిసిమెలిసి ఉంటారు, దేవుని సేవ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు, అనారోగ్య సమస్యలు తప్పవు. కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది, దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు.

తుల: ఫలిస్తాయి. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

కన్య:

చేయవలసిన పనులకు అడ్డంకులు ఎదురైన పట్టుదలతో పూర్తి చేస్తారు, ఇంటిలో శుభకార్యాల విషయమై సంతోషకరంగా ఉంటారు, అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది, కొత్త వాహనం, ఆభరణాలు కొనే అవకాశాలు ఉన్నాయి, సంతానం, పోటీ పరీక్షలలో సంతోషాన్ని పొందుతారు, వారం మధ్యలో అనుకొని విధంగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి, ఇంటి నిర్మాణ పనులు, గృహప్రవేశం జరిపే సూచనలు ఉన్నాయి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

ఉద్యోగాలలో ప్రమోషన్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగ ప్రయత్నాలు బంధువుల నుండి అనుకోని విధంగా శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది, వృత్తి, వ్యాపారం ఉద్యోగాలలో విజయాలను పొందుతారు, వారం మొదటిలో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది, నిరుద్యోగులు కొంత ఊరటను పొందుతారు, వ్యాపారాలలో ఆశించిన విధంగా లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి, కొన్ని రంగాల వారికి అనుకొని అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు.

వృశ్చికం:

ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి, మీ నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు, సొంత ఆస్తి గొడవలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి, చేయవలసిన పనులు త్వరగా పూర్తి చేశారు, ఇంటి నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు, సేవా దేవుని సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది, వారం చివరలో అనవసరమైన ప్రయాణాలు తప్పవు, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు.

ధనస్సు:

ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి, మీ నిర్ణయాలు అందరూ గౌరవిస్తారు, సొంత ఆస్తి గొడవలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. చేయవలసిన పనులు త్వరగా పూర్తి చేస్తారు, ఇంటి నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు, దేవుని సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది, వారం చివరలో అనవసరమైన ప్రయాణాలు తప్పవు. సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు.

మకరం:

దేవుని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, చిన్నప్పటి స్నేహితులతో సంతోషంగా ఉంటారు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, వారం మొదటిలో ఆరోగ్య విషయంపై జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆస్తి విషయంలో గొడవలు తగ్గ్గుముఖం పడతాయి, అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది, ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేస్తారు, విద్యార్థులకు సంతోషకరంగా ఉంటుంది, వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి, చేయవలసి చేయవలసిన పనులు అడ్డంకులు వచ్చి నిదానంగా పూర్తి చేస్తారు, విలువైన వాటిని కొనే అవకాశాలు ఉన్నాయి, బంధువులతో అనుకొని విధంగా గొడవలు తప్పవు, హయగ్రీవ స్తోత్రం పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

కుంభం:

మీకు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి, చిన్నప్పటి స్నేహితులతో సంతోషంగా గడుపుతారు, ఇంటిలో శుభకార్యాలను జరిపిస్తారు, సంఘంలో ముఖ్యమైన వార్త పరిచయాలు పెరుగుతాయి, తెలివితేటలతో గొడవలనుపరిష్కారం చేస్తారు, విద్యార్థులకు తగిన ప్రతిఫలం లభిస్తుంది, వారం చివరలో అనవసరమైన ప్రయాణాలు తప్పవు, ఉద్యోగ పరంగా అనేక ఇబ్బందులు తప్పవు. వృత్తి, వ్యాపారాలు ఆశించిన లాభాలను పొందుతాయి, అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది, ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

మీనం:

కుటుంబ సభ్యులతో అనుకోని గొడవలు వస్తాయి, ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. కుటుంబంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి, సొంత ఆస్తి గొడవలు పెద్దల సహాయంతో పరిష్కరించుకుంటారు, ముఖ్యమైన పనులు అడ్డంకులు వచ్చిన పూర్తి చేస్తారు, కోర్టు పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు, స్నేహితులతో సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు, దేవుని సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు, సంతానం, వివాహం, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా లాభాలను పొందుతాయి. వారం మధ్యలో ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది. ఉద్యోగాలలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది, గణనాయక అష్టకం పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.