boAt Storm Pro Call Smartwatch: ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే ఏడు రోజులు

boAt Storm Pro Call Smartwatch: దేశీయ పాపులర్ బ్రాండ్ అయినటువంటి boAt నుంచి ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్ లతో మరొక బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ విడుదల అయింది. boAt స్టామ్ ప్రో కాల్ అనే పేరుతో ఈ కొత్త మోడల్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో 2.5D కర్వ్ డ్ గ్లాస్ తో పాటు AMOLED డిస్ప్లేతో ఈ వాచ్ వస్తుంది. ఈ వాచ్ కి బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంది.

ఈ రెండు ఫీచర్స్ తో పాటు మరిన్ని ఫీచర్లు ఆకటుకునేలా ఉన్నాయి. 100 క్లాడ్ బెస్ట్ వాచ్ ఫేసెస్ కూడా అందుబాటులో ఉంటాయి. ఫాస్ట్ ఛార్జింగ్, 700 యాక్టిివ్ స్పోర్ట్స్ మోడ్స్ సపోర్టుతో ఈ వాచ్ వస్తుంది. బోట్ స్ట్రామ్ ప్రో కాల్ స్మార్ట్ వాచ్ వాచ్ ధర సుమారు ₹3,799 ఉంటుంది. బోట్ వెబ్ సైట్ తో పాటు ఈ కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ లో కూడా ఈ వాచ్ సేల్ మొదలయింది.

ఫ్లిప్కార్ట్ లో ఆఫర్లతో ఈ వాచ్ యొక్క ధర ₹3,499 కు అందుబాటులో ఉంది. స్కార్టేడ్ రెడ్, నేవీ బ్లూ, చార్కోల్ బ్లాక్, వంటి కలర్ ఆప్షన్స్ లో ఈ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ లభిస్తుంది. ఇందులో 1.78 అంగుళాల 2.4D కర్వ్ డ్ AMOLED డిస్ప్లేతో బోటు స్ట్రామ్ ప్రో కాల్ స్మార్ట్ వాచ్ వస్తుంది. ఇది 60Hz రిఫ్రిష్ రేట్ తో వస్తుంది. 100కు పైన క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసేస్ కూడా అందుబాటులో ఉంది.

boAt Storm Pro Call Smartwatch

బ్లూటూత్ కాలింగ్ ఫీచర్స్ తో ఈ స్మార్ట్ వాచ్ వస్తుంది. ఇందుకోసం ఈ స్మార్ట్ వాచ్ లో ఇన్ బిల్డ్ గా స్పీకర్లు మైక్రోఫోన్ వంటివి ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ చేసుకున్నప్పుడు వాచ్ నుండి కాల్స్ మాట్లాడవచ్చు. ఈ వాచ్ లో 10 కాంటాక్ట్ ల వరకు సేవ్ చేసుకోవచ్చు, డయల్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. దీంతో నేరుగా వాచ్ నుంచి కాల్స్ కూడా చేసుకోవచ్చు.

మొబైల్ కు కనెక్ట్ అయినప్పుడు యాప్స్ నోటిఫికేషన్స్ ను వాచ్ లోనే చూడవచ్చు. కెమెరాను, మ్యూజిక్ ను కంట్రోల్ చేయవచ్చు. క్రికెట్ స్కోర్స్ ను కూడా ఈ వాచ్ లోనే చూడవచ్చని బోటు తెలిపింది. బ్లడ్ ఆక్సిజన్ సాచూరేషన్ లెవెల్స్ ట్రాకింగ్, స్లీప్ ట్రాకర్, హార్ట్ రేట్ మానిటరింగ్ వంటి హెల్త్ ఫిచర్ లను కలిగి ఉంటుంది. రన్నింగ్, వాకింగ్, ఏరోబిక్స్ లాపింగ్ డాన్సింగ్ వంటి మొత్తం 700కు పైగా యాక్టివ్ స్పోర్ట్స్ మోడ్స్ కు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.

స్మార్ట్ ఫోన్లో బోటు క్రస్డ్ యాప్ కు ఈ వాచ్ ను సింక్ చేసుకొని వర్కౌట్, సెట్టింగ్స్ ను, ఫెట్ నెస్ తో సహా చాలా వివరాలను కూడా తెలుసుకోవచ్చు. ఒకసారి ఫుల్ చాట్ చేస్తే ఏడు రోజుల పాటు బ్యాటరీ లైఫ్ వస్తుంది అని బోట్ తెలిపింది. ఆల్ వేర్ ఆన్ డిస్ప్లే తో, బ్లూటూత్ కాలింగ్ తో వినియోగిస్తే రెండు రోజులపాటు బ్యాటరీ లైఫ్ వస్తుంది.

30 నిమిషాల్లోనే ఈ వాచ్ ఫుల్ ఛార్జ్ అయ్యే విధంగా ASAP ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇందులో వాటర్ డస్ట్ రెసిస్టీమ్ట్స్ కోసం IP68 రేటింగ్ తో ఈ బోటు బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ ఉంది.