తాలిబన్ విజయంతో ఉగ్రమూకలకు ధైర్యం..



ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ ఆందోళన

న్యూయార్క్: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల విజయం సాధించడం ప్రపంచం లో ఇతర ప్రాంతాల లో ఉగ్రవాదులకు ధైర్యం ఇచ్చే ప్రమాదం ఉందని,ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిఆంటోనియో గుటెర్రస్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ఒకపక్క అంతర్జాతీయ ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేస్తూనే, మరోపక్క తాలిబాన్లతో ఐరాస చర్చలు జరపాల్సి ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అంతర్జాతీయ సంబంధాలు ఆఫ్గన్ కీలక పాత్ర పోషించాలని, ఐరాస ఆశిస్తున్నాను అన్నారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

అఫ్గాన్ తాలిబన్ల విజయం సాధించడం ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాదులకు మనోధైర్యం ఇస్తున్నది నిజం. అయితే ఇతర గ్రూపులు తాలిబన్లతో పోలిస్తే భిన్నమైనవి.. వీరి మధ్య పోలిక కనిపించదు. అని అని ఆంటోనియో అభిప్రాయపడ్డారు. పలు టెర్రరిస్టు గ్రూపుల తాలిబాన్ లకు అభినందనలు పంపడమే కాకుండా తమ సామర్థ్యం పై బలమైన నమ్మకాన్ని పెంచుకుంటాం అన్నారు. ఆఫ్రికాలో సహేల్ ప్రాంతంలో తీవ్రవాదులు దుశ్చర్యలను ఆయన ప్రస్తావించారు. చాలా ప్రాంతాల్లో ఉగ్రవాదాన్ని సమర్థంగా తిప్పి కొట్టే పరిస్థితులు లేవన్నారు. దీనివల్ల టెర్రరిస్టులు క్రమంగా పట్టు సాగిస్తున్నారు. వీరి తాజా పరిమాణాలు ధైర్యాన్ని ఇస్తున్నాయని చెప్పారు.

ఆఫ్ఘన్ ఉగ్రవాదులకు నిలయంగా మారుతున్న చూడాల్సిన బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు. అఫ్గాన్ తాలిబన్ల తో నిరంతరం చర్చిస్తోంది అని, ఈ పరిస్థితుల్లో చర్చలో ఉత్తమ మార్గమని ఆయన తెలిపారు. తాలిబన్ల ప్రభుత్వం సమ్మిళితం గా ఉంటుందని ఆశించాము అని చెప్పారు. మానవ హక్కులను కాపాడాలని, మహిళలు, బాలికల హక్కుల పై నెలకొన్న ఆందోళనలు పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ సంబంధాలు ఆఫ్ఘనిస్తాన్ నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కోరారు.