రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడితే… రూ.5 వేలు ప్రోత్సాహకం
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారి ప్రాణాలు కాపాడే వారిని ప్రోత్సాహం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకం తో ముందుకు వచ్చింది.
క్షతగాత్రులను మొదటి గంటల్లోగా (గోల్డెన్ అవర్) ఆసుపత్రికి తరలించిన వారికి ఐదు వేల రూపాయలు ప్రోత్సాహక బహుమతి అందించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం 2021 అక్టోబర్ 15 నుంచి అందుబాటులోకి వచ్చి, 2026 మార్చి 31 వరకు కొనసాగుతుందని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల రవాణా శాఖల కార్యదర్శిల కు సమాచారం పంపింది.
రూ.5 వేలు ప్రచారంతో పాటు అభినందన సర్టిఫికెట్ అందించనున్నట్లు పేర్కొంది. అత్యంత విలువైన సాయం అందించిన వారి మిర్చి కొంతమందిని ఎంపిక చేసి ఏడాదికోసారి జాతీయస్థాయి అవార్డులను ప్రకటించినట్లు తెలిపింది. వారికి రూ. లక్ష చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఒకరి కంటే ఎక్కువమంది బాధితులను, ఒకరి కంటే ఎక్కువ మంది ప్రాణాలు కాపాడితే.. ఒక్కొక్కరికి ఐదు వేల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపింది.