•8 మందికి పదోన్నతి… ఐదుగురికి బదిలీ
• తెలంగాణ హైకోర్టు సీజే గా సతీష్ చంద్ర
•ఏపీ హైకోర్టు సీజే గా ప్రశాంత్ కుమార్
•కేంద్రానికి సుప్రీం కొలీజియం సిఫారసు
•మరో ఆరుగురు జడ్జిల బదిలీకి నిర్ణయం
న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (CJI) జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నియమితులు కానున్నారు.
ఈ మేరకు తెలంగాణ, ఏపీతో పాటు మొత్తం 13 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఎనిమిది మందికి పదోన్నతి కల్పించాలని, మరో ఐదుగురికి సిట్టింగ్ సీజేలను గా బదిలీ చేయాలని కేంద్రాన్ని కోరింది. వీటిని కేంద్రం ఆమోదం లభిస్తే హైకోర్టులకు కొత్త సీజేలు రానున్నారు.సీజేలుగా పదోన్నతి సిఫార్సు చేసిన జడ్జిల పేర్లు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ (తెలంగాణ), జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా (ఆంధ్ర ప్రదేశ్), జస్టిస్ రంజిత్ వి మోర్ (మేఘాలయ), జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ(కోల్కత్తా), జస్టిస్ ఆర్వీ మలిమత్(మధ్యప్రదేశ్),జస్టిస్ రితూ రాజ్ అవస్థీ (కర్ణాటక), జస్టిస్ అర్వింద్ కుమార్ (గుజరాత్), జస్టిస్ రాజేశ్ బిందాల్ (అలహాబాద్). బదిలీకి సిఫారసు చేసిన హైకోర్టుల సీజేల పేర్లు. జస్టిస్‌లు ఏఏ ఖురేషీ, ఇంద్రజిత్ మహంతి, మహమ్మద్ రఫీక్, బిశ్వనాథ్ సొమద్దర్, ఏకే గోస్వామి. వీరు ప్రస్తుతం వరుసగా త్రిపుర, రాజస్థాన్,మధ్యప్రదేశ్,మేఘాలయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులజస్టిస్ రితూ రాజ్ అవస్థీ (కర్ణాటక), జస్టిస్ అర్వింద్ కుమార్ (గుజరాత్), జస్టిస్ రాజేశ్ బిందాల్ (అలహాబాద్). బదిలీకి సిఫారసు చేసిన హైకోర్టుల సీజేల పేర్లు. జస్టిస్‌లు ఏఏ ఖురేషీ, ఇంద్రజిత్ మహంతి, మహమ్మద్ రఫీక్, బిశ్వనాథ్ సొమద్దర్, ఏకే గోస్వామి. వీరు ప్రస్తుతం వరుసగా, త్రిపుర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మేఘాలయ,ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టుల సీజేలుగా పని చేస్తున్నారు. 17 మంది హైకోర్టు జడ్జి ల బదిలీ, పునర్ బదిలీకి కూడా కొలీజియం సిఫారసు చేసింది.
దీంతోపాటు ఆరుగురి హైకోర్టు జడ్జీల బదిలీ కూడా సిఫారసు చేయాలని మంగళవారం నిర్ణయించింది.