మహిళా జడ్జిల నియామకంపై రాష్ట్రపతి హర్షం



లక్నో: భారత అత్యున్నత న్యాయస్థానం తాజాగా మహిళ జడ్జీలను ముగ్గురుని నియమించడంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హర్షం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం సుప్రీంకోర్టులో 33 మంది జడ్జీలు ఉన్నారని, తాజాగా నియామకంతో సుప్రీంకోర్టు మహిళా జడ్జిల సంఖ్య నాలుగు పెరిగిందని ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో ఇంత మంది మహిళా జడ్జీలు ఉండడం ఇదే మొదటిసారి అని, ఈ సంఖ్య మరి ఇంత వరకు పెరగాలని, శనివారం మధ్యాహ్నం ప్రయోగరాజ్ లో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం కి పునాది కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

అనంతరం అలహాబాద్ కోర్టు సమీపంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. కోర్టుల్లో మహిళా జడ్జిల ప్రాధాన్యతను వివరించారు. భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా న్యాయవాది 1921 కార్నెలియోనోరాబ్జీ పని చేసింది. అలహాబాద్ హైకోర్టులో నేనేనని గుర్తు చేసి ఆయన మహిళా సాధికారత తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొనియాడారు.