ఉపాధి కోల్పోయిన వారికి కేంద్రం గుడ్ న్యూస్..



కోవిడ్ మహమ్మారి కారణంగా ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఈ మహమ్మారి వలన చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు ఊరట కలిగే ప్రకటన చేసింది.

కరోనా వైరస్ కాలంలో ఉపాధి కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు తీసుకువచ్చింది. అటల్ బీమత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకం పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా ఉండాలని కేంద్రం అనుకుంటుంది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న అటల్ మీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకం గడువును పొడిగిస్తూ ఉన్నట్లు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది.

అయితే ఈ స్కీం లో 2022 జూన్ వరకు కూడా అందుబాటులో ఉంటుంది. అయితే ఎవరైనా ఉపాధి కోల్పోయిన వారు కనుక ఉంటే వాళ్ళు అలవెన్స్ పొందవచ్చు. పరిస్థితులు ఇంకా అలానే కొనసాగడంతో 185 వ ఈఎస్ఐసి మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు అని వెల్లడించారు.
ఉపాధి కోల్పోయిన వారికి ఈఎస్ఐ నుంచి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఇదేవిధంగా కుటుంబ సభ్యులకు ఈఎస్ఐసి మెడికల్ ఫెసిలిటీస్ ఆరు నెలల వరకు ఉంటుంది. ఈఎస్ఐ లబ్ధిదారులు ఉద్యోగం కోల్పోతే మూడు నెలల వరకు జీతం ఇస్తారు. మూడు నెలల కాలంలో ఉపాధి కోల్పోయిన వారికి మళ్ళీ ఉద్యోగం సంపాదించుకుంటే ఏ ఇబ్బందులు ఉండవు.


Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker