దేశ వ్యాప్తంగా నీట్ ప్రారంభం
Hyd: వైద్య విద్య ప్రవేశాలు జాతీయ స్థాయిలో నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా ఈ మధ్యాహ్నం ప్రారంభమైంది. అయితే నిర్ణీత సమయం తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్డీయే) ప్రకటించినట్టుగానే అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద కచ్చితంగా ఆ నిబంధనలు అమలు చేశారు.
మధ్యాహ్నం ఒకటిన్నర గంటల తర్వాత వచ్చిన వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. దాంతో అనేక మంది విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు అనుమతించకపోవడంతో, వారు అక్కడున్న అధికారులను బతిమాలు పోవడం పలుచోట్ల కనిపించింది. అయినప్పటికీ అధికారులు నిబంధనలకు కట్టుబడి వ్యవహరించడంతో విద్యార్థులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. హైదరాబాద్ లోని నిజాం కళాశాల వద్దకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులును అధికారులు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు.