Instagram New Update: మరొక కొత్త ఫీచర్

Instagram New Update: ఎప్పటికీ అప్పుడు కొత్త ఫీచర్స్ తో యూత్ ను ఆకర్షిస్తూ వస్తుంది ఇంస్టాగ్రామ్. దేశాలతో సంబంధం లేకుండా ఎక్కువమంది ఉపయోగిస్తున్న సోషల్ మీడియా సైట్లల్లో ఇన్స్టాగ్రామ్ కూడా ఒకటి. ఇదిలా ఉంటే నిత్యం కొత్త ఫీచర్లను తీసుకొచ్చి instagram తాజాగా యూజర్ల కోసం మరొక కొత్త ఫీచర్స్ ని తీసుకొచ్చి పనిలో ఉంది.

ఇప్పటివరకు ఇంస్టాగ్రామ్ లో ఎవరైనా చేసిన పోస్టును కామెంట్, షేర్, లైక్ ఆప్షన్ మాత్రమే ఉంది. కానీ సదర్ పోస్టులు మన టైం లైన్ పై రీ పోస్ట్ చేయడానికి ఆప్షన్ లేదు. చాలా కాలంగా యూజర్లు ఈ ఫీచర్ కోసం ఎదురుచూస్తున్నారు.

Instagram

యూజర్ల నుంచి వస్తున్న అభ్యర్థుల నేపథ్యంలో త్వరలోనే ఈ ఫీచర్ కూడా తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా ఈ ఫ్యూచర్ ను కొన్ని సెలెక్ట్ చేసిన ఇంస్టాగ్రామ్ యూజర్ల ద్వారా టెస్టింగ్ చేసి ఆ తర్వాత అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ ఫ్యూచర్ ను ఇంస్టాగ్రామ్ హెడ్ ఆండ్రూ మోస్సేరి పరీక్షిస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే రీ పోస్ట్ చేసిన పోస్టులు 24 గంటల తర్వాత ఉండవు. రి పోస్ట్ చేసిన వీడియో, ఫోటో, రీల్స్ కు యూజర్ కామెంట్స్ మాత్రమే మెసేజ్ సెక్షన్లో ఉంటాయి.

ప్రస్తుతం ట్విట్టర్లో అందుబాటులో ఉన్న రీ ట్వీట్ బటన్ తరహాలనే ఇంస్టాగ్రామ్ లో కూడా తీసుకువస్తున్నట్లు తెలుస్తుంది. టెస్టింగ్ అనంతరం రీ పోస్ట్ ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. 

Google Pixel 6a Flipkart లో ఈ ఫోన్ పై భారీగా తగ్గింపు