iPhone 14: ఐఫోన్ 14 పూర్తిగా ఇండియాలోనే తయారు అవుతుందా!

iPhone 14: ఐఫోన్ 14 పూర్తిగా ఇండియాలోనే తయారు అవుతుందా?. యాపిల్ ఈ సంవత్సరంలో మార్కెట్లోకి తీసుకురాబోతున్న ఐఫోన్ 14ను పూర్తి గా భారతదేశంలోనే తయారు చేయిస్తుంది. ఎప్పటి లాగానే వచ్చే నెలలో ఈ ఐఫోన్ 14 విడుదల చేసే కార్యక్రమాలు ఉంటాయి అని అంచనా.

యాపిల్ కంపెనీ ఇప్పటికే భారతదేశంలోని తమకు సంబంధించిన కాంట్రాక్టు సంస్థలైన ఫ్యాక్స్ కాన్ మరియు విస్ట్రన్ సంస్థలలో ఐఫోన్11, ఐఫోన్12, ఐఫోన్13, ఎస్ఈ మోడల్స్ ను తయారు చేయిస్తుంది.

ఇవే మోడల్స్ ను చైనాలో కూడా తయారు చేయిస్తుంది. ఐఫోన్ 14 ను పూర్తిగా ఇండియాలోని తయారు చేయిస్తుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 మాక్స్ ప్రో ఈ మోడల్స్ అన్ని వచ్చే నెలలో ఇండియాలో లాంచ్ అవుతాయి.

iPhone 14: ఐఫోన్ 14 పూర్తిగా ఇండియాలోనే తయారు అవుతుందా!

భారతదేశంలో తయారు చేయడం వలన వీటి యొక్క ధరలలో మార్పు ఉంటుందా. అంటే దీని యొక్క ధరలలో ఎటువంటి మార్పు ఉండదు. ఐఫోన్ 13 సిరీస్ యొక్క ఆరంభంలో నిర్ణయించినట్లుగానే 799 డాలర్లు లేదు అంటే ఇంకా ఎక్కువగానే ఐఫోన్ 14 సిరీస్ యొక్క ధరలు ఉంటాయి.

ఐఫోన్ 14 యొక్క ధర సుమారు 64000 ఉండవచ్చు. యాపిల్ ఐఫోన్ దీని యొక్క పూర్తి తయారీ భారతదేశంలో మొదలుపెడితే ధరలు అందుబాటులో ఉంటాయి అని ఎక్కువమంది ఆశించి ఉంటారు. కానీ అది ఏమీ జరగలేదు.

ధరలు తగ్గించి ప్రపంచంలో తమకు ఉండే ప్రీమియం బ్రాండ్ గా ఐఫోన్ యాపిల్ కు ఉన్న గుర్తింపును అది త్యాగం చేసి స్థితిలో లేదు అని పూర్తిగా అర్థమవుతుంది.