Kargil: 500 మందికి పైగా సైనికులు ప్రాణాలను అర్పించిన రోజు జూలై 26

జమ్మూ మరియు కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో భారత్ మరియు పాకిస్తాన్ సైన్యాల మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో దేశం కోసం 500 మందికి పైగా సోల్జర్స్ మరియు అధికారులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కార్గిల్ యుద్ధం మే నెలలో ప్రారంభమై జూలై 1999 వరకు కొనసాగింది. ప్రతి సంవత్సరం కార్గిల్ సంస్మరణ దినోత్సవం గా జూలై 26న జవాన్లకు నివాళులు అర్పించడం మరియు గాయపడిన సోల్జర్స్ లను సన్మానించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇండియన్ సోల్జర్స్ తో కలిసి లడఖ్ ప్రజలు 23వ కార్గిల్ విజయ దినోత్సవాన్ని లడఖ్ జరుపుకుంటున్నారు. కార్గిల్ విజయాన్ని స్మరించుకుంటూ 24 మందికి పైగా విద్యార్థులు ప్రజల కోసం పెయింటింగ్స్ వేశారు.



లడఖ్ రీజియన్ ఆర్మీ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ సేన్ గుప్తా, ప్రజల కోసం 24 మంది విద్యార్థులు కళాత్మక చిత్రాలను చిత్రించినందుకు వారిని ప్రశంసించారు. అలాగే కార్గిల్ లో విజయం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధం లో సాధించిన విజయాన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై 26వ తేదీన’ కార్గిల్ విజయ్ దినం’గా జరుపుకుంటారు. నేడు కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు మౌనంగా నివాళులర్పించారు. ఆ రోజున మన కోసం సరిహద్దుల్లో సేవలందిస్తున్న జవాన్లను స్మరించుకుందాం.