Karthika Pournami 2022:కార్తీక పౌర్ణమి విశిష్టత, కార్తీక పౌర్ణమి జరుపుకునే తేదీ, సమయం .

Karthika Pournami: సంవత్సరం దీపావళి అమావాస్యనాడు సూర్యగ్రహణం వచ్చింది. దీనివల్ల దీపావళి ఒక రోజు ముందుగా జరుపుకున్నాము. ఇక ఇప్పుడు కూడా అలాగే కార్తీక పౌర్ణమి రోజు చంద్రగ్రహణం వచ్చింది. అందువలన ఎప్పుడు పౌర్ణమి జరుపుకోవాలని, దీపావళి లాగానే కార్తీక పౌర్ణమి కూడా ఏడవ తేదీన జరుపుకోవాలా, లేదా 8వ తేదీన జరుపుకోవాలనే, తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు జరుపుకోవాలి అనే సందేహంలో ఉన్నారు.

కార్తీక పౌర్ణమి:

8తేదీన అంటే మంగళవారం అంతా కార్తీక పౌర్ణమి తిధి ఉంటుంది. అయినప్పటికీ కార్తీక పౌర్ణమి జరుపుకోవడానికి రాత్రి చంద్రోదయం వరకు పౌర్ణమి ఘడియలు లేవు అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా సంపూర్ణ చంద్రగ్రహణం కూడా ఇదే రోజున ఉందని చెబుతున్నారు.

Karthika Pournami

అయితే భారతదేశంలో పాక్షికంగా చంద్రగ్రహణం కొద్ది గంటలు మాత్రమే ఉంటుంది. ఆ సమయం కూడా మధ్యాహ్నం సమయంలో గ్రహణ సమయం ఉంటుందని పేర్కొంటున్నారు. సాయంత్రం గ్రహణం వీడిపోయోసరికి పౌర్ణమి తిది అయిపోతుంది. అందువలన కార్తిక పౌర్ణమి జరుపుకోవడానికి వీలుకాదు.

ఏ పండుగలోనైనా సాధారణంగా ఉదయం పూట ఏ తేదీ ఉంటే ఆ రోజంతా అదే తిధిగా భావించి పండుగను జరుపుకుంటారు. అయితే కార్తీక పౌర్ణమి విషయంలో అలా జరుపుకోవడానికి వీలుకాదు. ఎనిమిదో తేదీ ఉదయం నుంచి సాయంత్రం, నాలుగు గంటల వరకు మాత్రమే పౌర్ణమి ఘడియలు ఉంటాయి. రాత్రిపూట చంద్రగ్రహణం వీడిన తర్వాత పౌర్ణమి ఘడియలు మారుతుంది. అందువలన మంగళవారం పౌర్ణమిని జరుపుకోకూడదు అని శాస్త్రజ్ఞ నిపుణులు చెబుతున్నారు.

కార్తీక పౌర్ణమి ఏ రోజు ఏ టైం లో చేసుకోవాలో తెలుసుకుందాం:

దృక్ పంచాంగం ప్రకారం నవంబర్ 7వ తేదీన సాయంత్రం 4:15 నిమిషాల నుండి పౌర్ణమి తిధి వస్తుంది. ఈ ఘడియలు మరుసటి రోజు సాయంత్రం 4:31 నిమిషాల వరకు ఉండి, ఆ తర్వాత తిది మారుతుంది. అయితే కార్తీక పౌర్ణమికి ముఖ్యంగా పౌర్ణమి ఘడియలు, అంతేకాకుండా సంపూర్ణంగా ఉండే చంద్రుడు కూడా చాలా ముఖ్యం.

అందువలన ఏడవ తేదీన పరిగణలోనికి తీసుకొని కార్తీక పౌర్ణమి గా భావించి, కార్తీక పౌర్ణమి జరుపుకోవాలని శాస్త్ర నిపుణులు భక్తులకు సూచించారు.అయితే ఏడవ తేదీ ఆదివారం ఉన్నందున, సోమవారం అయితే బాగుంటుంది అని అనుకునేవారు, అదేవిధంగా ఏడవ తేదీ జరుపుకోవాలని తెలియని వారు వచ్చే సోమవారం 14వ తేదీ రోజున కార్తీక సోమవారం గా భావించి ఆరోజు పూజలు చేసుకోవచ్చని తెలుపుతున్నారు.

Karthika Pournami

అంతేకాకుండా ఆరోజు సంపూర్ణ చంద్రుడు కూడా ఉంటాడు. వచ్చే సోమవారం కూడా కార్తీక సోమవారమే కాబట్టి ఆ రోజున పౌర్ణమిగా భావించి 365 దీపాలను వెలిగించి, ఉసిరిక దీపాలను వెలిగించి, పూజలు చేస్తే మంచిదని తెలియజేశారు. ఇలా దీపాలను వెలిగించి దేవుడికి శ్రద్ధగా పూజ చేయడం ద్వారా సకల పాపాలు తొలగుతాయని పేర్కొంటున్నారు.

365 దీపాలు వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు:

కార్తీక పౌర్ణమి రోజు కార్తీక సోమవారం రావడం వలన చాలా బాగుంటుంది. మంగళవారం చంద్రగ్రహణం రావడం కారణంగా 14వ తేదీన కూడా బాగుంటుందని, ఆరోజు కార్తీక పౌర్ణమి జరుపుకోవచ్చని నిపుణులు తెలియజేశారు. ఆరోజు ఉదయాన్నే కార్తీక స్నానం చేసి, ఎంతో భక్తిశ్రద్ధలతో శివునికి అభిషేకం చేసి, విష్ణువు కూడా భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఉపవాస దీక్షను ఆచరించి, రాత్రి చంద్రోదయం తర్వాత 365 దీపాలను వెలిగించి దీపారాధన చేయాలి.

కార్తీక పౌర్ణమి రోజు విశిష్టత:

శివునికి ,విష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో భక్తులు శివుడిని, విష్ణువుని విశేషంగా పూజిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు మహావిష్ణువు మత్య అవతారం దాల్చాడని పురాణాలలో ఉంది. కనుక కార్తీక పౌర్ణమి రోజు విష్ణువు ను అలంకార ప్రియుడిగా భావించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు.

అదేవిధంగా శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని ఇదే రోజున వధించిన కారణంగా, త్రిపురారీగా ప్రజలు శివుడిని పూజిస్తారు. అంతేకాకుండాత్రిపురాసుర వద జరిగినందున దేవతలందరూ ఆకాశం నుండి భూమికి దిగి వచ్చి, కార్తిక స్నానం ఆచరించి, దీపాలను వెలిగించి పండగ చేసుకున్నారని, అందుచేతనే ఈ కార్తీక పౌర్ణమి అంతా విశిష్టత ఉండడం వలన, కార్తీక పౌర్ణమి జరుపుకుంటారు.

కార్తీక పౌర్ణమి రోజు మహావిష్ణువును అలంకార ప్రియుడుగా భావించి భక్తుశ్రద్ధలతో పూజ చేస్తారు. శివుడిని అభిషేక ప్రియుడుగా భావించి, శివునికి అభిషేకాలు చేసి ఆరాధిస్తారు. కార్తీక దీపాలను వెలిగించి పూజ చేయడం ద్వారా 1000 యుగాలలో చేసిన పాపాలను తొలగిపోతాయని శాస్త్ర నిపుణులు అంటున్నారు.