Kim Jong-un:అమెరికా, దక్షిణ కొరియాకు వార్నింగ్ ఇచ్చిన నార్త్ కొరియా అధ్యక్షుడు

మరోసారి రెచ్చిపోయి వార్నింగ్ ఇచ్చిన నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఎప్పుడు ఏదో ఒక వివాదాంశంతో వార్తల్లో నిలిచే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా మరోసారి అమెరికా ను హెచ్చరించాడు. దక్షిణ కొరియా, అమెరికా నా దేశాన్ని రెచ్చగొడితే ఈసారి అణ్వాయుధాలు ప్రయోగిస్తామని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు నార్త్ కొరియా అధ్యక్షుడు. ప్రస్తుతం నార్త్ కొరియాలో కొరియా యుద్ధం 69వ వార్షికోత్సవాలు ప్యాంగ్యాంగ్ లో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.1950-53 నాటి యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులను అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఈ సందర్భగా ప్రసగించిన ఆయన పలు కీలక వ్యాక్యాలు మాట్లాడారు.



అమెరికా, దక్షిణ కొరియాలకు కీమ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు దేశాలు సంయుక్తంగా చేపట్టిన యుద్ధ విన్యాసాలను తప్పు బట్టిన కిమ్,ఆ విన్యాసాలను తమ దేశం పై దండయాత్రకు రిహార్సల్స్ గా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. కొరియా ద్వీపకల్పాన్ని అమెరికా, దక్షిణ కొరియా యుద్ధంలోకి నెడుతున్నాయని భావిస్తున్నారు. అమెరికా ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తూ ఉత్తర కొరియాను బూచిగా చూపుతోందని ఆరోపిస్తున్నారు.

ఈ విషయమై నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఇంకా మాట్లాడుతూ, దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు యున్ సుక్ యోల్ యుద్ధ ఉన్మాదిగా ప్రవర్తింస్తున్నడు అని కిమ్ పేర్కొన్నాడు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యన్ సుక్ యోల్ అధికారం చేపట్టి దగ్గరా నుంచి అమెరికాతో సైనిక సహకారాన్ని బలోపేతం చేసుకుంటూ పోతున్నాడు. తమ దేశంపై అమెరికా, దక్షిణ కొరియా యుద్ధానికి వస్తే ఉత్తర కొరియాను నాశనం చేస్తామని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వార్నింగ్ ఇచ్చాడు. నార్త్ కొరియా అధ్యక్షుడు చేసిన వాక్యాలు అంతర్జాతీయంగా ఏలాంటి వాటికి దారితీస్తాయో చూడాలి.