Krishnam Raju: ప్రముఖ నటుడు కృష్ణంరాజు మరణం

Krishnam Raju: ప్రముఖ సినిమా నటుడు కృష్ణంరాజు (83) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడిన ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3:25 గంటలకు తుది శ్వాసను విడిచారు.

ఈయన 1940 జనవరి 20వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. చదువు పూర్తిగా గాని కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశారు. హీరోగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ విలన్ గా కూడా అలరించారు.

1966 సంవత్సరములో ‘చిలకా గొరెంకా ‘ చిత్రంలో వెండితెర అరంగ్రేటం చేశాడు. అవేకళ్ళు చిత్రంలో కూడా ప్రధానాయకుడిగాను చేశారు. 1977 1984 సంవత్సరాల నంది అవార్డును కూడా పొందారు. 1986 సంవత్సరంలో త్రాండ పాపారాయుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును కూడా పొందారు.

Krishnamraju

2026లో ఫిలింఫేర్ దక్షిణాది జీవిత సఫల్యం పురస్కారం కూడా పొందారు. బొబ్బిలి, భక్త కన్నప్ప, బ్రాహ్మణ చిత్రాలు ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. విజయనగర సామ్రాజ్యం కాకతీయ రాజా వంశానికి చెందిన కృష్ణంరాజు దివంగత మాజీ ప్రధాని వాజ్ పేయి వాయంలో కేంద్ర మంత్రిగాను ఈయన సేవలందించారు.

కృష్ణంరాజుకు భార్య శ్యామలాదేవి కుమార్తెలు ప్రకీర్తి, ప్రదీప్తి, ప్రసిది ఉన్నారు. ఆయన సోదరుడు ఉప్పలపాడు సూర్యనారాయణరాజు కుమారుడి ప్రముఖ సినీ నటుడు ప్రభాస్. చేసిన పాత్రలలోని రెబల్ స్టార్ గా కృష్ణంరాజు చేసిన పాత్రలోని ఈయనకి రెబల్ స్టార్ అనే పేరు కూడా వచ్చింది.

ఆ పేరుకు తగినట్టుగానే ఆయన ప్రయాణం కూడా సాహసోపేతంగా సాగింది. భిన్నమైన పాత్రల్లో నటుడిగా పరిశ్రమ స్థాయిని పెంచి చిత్రాలలో నిర్మాతగాను ఆయన ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. అలనాటి అగ్రతారాలు ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ లకు దీటుగా తనదైన నటనతో రాణించిన కథానాయకుడు కృష్ణంరాజు.

Krishnam Raju’s Favourite Movies