రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలలో మన అనంతపురం జిల్లా జట్టు ప్రథమ స్థానం

ఈ నెల 28 ,29 ,30 తేదీన చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగిన రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలలో మన అనంతపురం జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించింది మన అనంతపురం జిల్లా జట్టు తరఫున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బుక్కరాయసముద్రం పాఠశాలకు చెందిన సింహాద్రి , ఆశ్రిత్ పాల్గొన్నారు అనంతపురం జిల్లా జట్టుకు సింహాద్రి కెప్టెన్గా ప్రాతినిధ్యం వహించి అత్యంత ప్రతిభ కనబరిచి టోర్నమెంట్లో బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా ఎంపికైనాడని గోపాల్ రెడ్డి పీ.డి తెలిపారు.

ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు శారద మాట్లాడుతూ మా పాఠశాల ఈనెల 29వ తారీఖున ధ్యాన్చంద్ పుట్టినరోజు జాతీయ క్రీడా దినోత్సవం రోజున డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ప్రకటించిన స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ క్రీడా ప్రతిభా అవార్డు కు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం రాష్ట్ర స్థాయిలో ఆరో స్థానం సాధించింది ఈనెల 29వ తారీఖున గవర్నమెంట్ హై స్కూల్ అనంతపురం నందు DEO గారి చేతుల మీదుగా మెమెంటో సర్టిఫికెట్ నగదు పురస్కారం తో ప్రత్యేకంగా పిడి గోపాల్ రెడ్డి ని సన్మానించారాని ఇది మా పాఠశాల కు ప్రత్యేక పురస్కారం అని తెలిపారు.

మాపాఠశాలకు సాఫ్ట్బాల్ కిట్ ను అందజేసి సాఫ్ట్బాల్ క్రీడకు ఎదగడానికి దోహదం చేసిన సాఫ్ట్బాల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ వెంకటేశులు గారిని ప్రత్యేకంగా అభినందించారు, ఈ కార్యక్రమంలో లలితమ్మ పి డి ,నాగరాజ్ గౌడ్, దివాకర్ రెడ్డి, నీలకంఠారెడ్డి, పాల్గొని విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.