ఎస్సి, గిరిజనులపై దాడులు ఆపండి – ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు

అనంతపురం : రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ,ఎస్టీలను లక్ష్యంగా చేసుకుని దాడులు,హత్యచారలు పెరుగుతున్నాయని వాటిని అరికట్టాలని ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకే హరి పేర్కొన్నారు. బుధవారం ఉరవకొండ పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సాకే హరి మాట్లాడుతూ ఎస్సి, గిరిజన ప్రాంతాల్లో అనేక రూపాలుగా అన్యాయాలు జరుగుతున్నాయని వాటికి అడ్డుకట్ట వేయాలని కోరారు.

ఎస్సీ, ఎస్టీ యువతి,యువకుల ప్రేమ పేరుతో దారుణ హత్యలు చేయడము చాలా భాదకరమన్నారు.ప్రేమ ఎటు వైపు నుంచి మొదలైన చివరికి హత్య గావించేది కూడా ఎస్సీ,ఎస్టీ లే బలికావడమంటే కారణం కుల వివక్షత అన్నారు.కుల మహమ్మారి అనేది ప్యాక్షన్ కన్న ప్రమాదకరంగా మారిందన్నారు.ప్రతి రంగంలో కూడ కుల రక్కసీ కాటేస్తూనే ఉందనీ కుల నిర్మూలనకు కృషి చేయాలని కోరారు.ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ లపై జరిగే అణచివేత,అన్యాయాలను ఎదురించి పోరాడాలని పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి మహిళలకు రక్షణ కల్పించాలని ప్రవేశపెట్టిన దిశ చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని ఆచరణలో మాత్రం లేదని వాపోయారు.ఇప్పటికే పదుల సంఖ్యలో ఎస్సీ,ఎస్టీలు దారుణ హత్యలకు గురైనారని వాటికి విచారణ,న్యాయం కరువైందని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. నల్లప రమ్య హత్య కేసు 21 రోజుల్లో దిశ చట్టము ప్రకారం శిక్షించక పోతే ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఎస్సి, గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ధర్నా లు చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు మీనుగ గోపాల్,ఎస్సీ,ఎస్టీ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు కుళ్ళాయప్ప,ఎస్సీ,ఎస్టీ ఐక్య వేదిక అధ్యక్షుడు మధు ప్రసాద్,బిజేపి ఎస్సీ సెల్ కార్యదర్శి మందల శాంతకుమార్,ఎస్సీ,జన సంఘం ఉరవకొండ నియోజకవర్గ అధ్యక్షుడు రాయంపల్లి రాజేష్,చాబాల సర్పంచ్ మల్లెల జగదీష్,ఎరుకుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శింగంపళ్లి కేశవ,దళిత హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు సాకే నర్సింహులు,ఎస్ఎప్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సిద్దార్థ,జేఏసీ నాయకులు రాయంపల్లి సోమ శేకర్,ఓబులేసు,రాళ్ళపల్లి చంద్ర శేకర్,రామాంజినేయులు,హనుమంతు తదితరలు పాల్గొన్నారు.