Bengal Black Fever: బెంగాల్ ను భయపెడుతున్న బ్లాక్ ఫీవర్

గడిచిన కొద్ది రోజుల నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బ్లాక్ ఫీవర్ తీవ్రత ఎక్కువగా అవుచున్నది. సుమారు రెండు రోజుల నుంచి 11 జిల్లాలలో 65 కేసులు నమోదు చేయబడ్డాయి. అంతేకాక ఝార్ఖండ్ రాష్ట్రంలో బ్లాక్ ఫీవర్ తో ఒక మరణం సంబంధించినట్టు తెలుస్తుంది.

బ్లాక్ ఫీవర్ అనేది ఒక రకమైన పరాన్నజీవ కీటకం ద్వారా వ్యాపించే వ్యాధి. వ్యాధి సోకిన ఆడ సాండ్ ఫ్లై కీటకం(ఫ్లీ బొటమైన్)కాటు వేయడం వలన పరాన్న జీవులు రక్తం ద్వారా శరీరంలోకి ప్రవేశించి కాలేయంపై నేరుగా ప్రభావం చూపిస్తాయి. అలాగే ప్లీహము వాపునకు గురవుతుంది, రక్తహీనత సంభవిస్తుంది. ఈ వ్యాధికి కాలా అజార్ మరియు విస్రల్ లెస్మేనియా అని పేరు.

ఈ వ్యాధి సోకిన వ్యాధిగ్రస్తులు అసమాన జ్వరం, సడన్ గా బరువు తగ్గడం,రక్తహీనత, చర్మం పొడి బారి పొవటం,చర్మంపై దుద్దుర్లు ఏర్పడటం, చర్మం బూడిద రంగులో మారడం, జుట్టు రాలడం,కాళ్లు,పొట్ట,వీపు పై వాపు లక్షణాలు కనిపిస్తాయి.

ఈ వ్యాధికి చికిత్సగా యాంటీ పారాసెట్ మందులు నోటి ద్వారా వేయబడతాయి. అయితే బ్లాక్ ఫీవర్ కోసం టీకాలుగాని, నిరోధక మందులు గాని అందుబాటులో లేవు. దీనికి కేవలం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే.

అవి ఏమిటంటే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఇండ్లలోకి క్రిమి, కీటకాలు రాకుండా చూసుకోవాలి, ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణాలు చేయునప్పుడు నిండుగా దుస్తులు ధరించాలి. మంచి పోషక ఆహారం తినాలి, మంచి ఆహారపు అలవాట్లు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.