Ground water pollution:మనిషి పుట్టినప్పుడు నుంచి చనిపోయే వరకు నీరు చాలా అవసరం.మనిషి త్రాగునీరు లేకుండా ఒక పూట కూడా ఉండలేడు.ఒక వ్యక్తి ఆహారం లేకుండా ఒక నెల జీవించగలడు కానీ నీరు లేకుండా ఒక్కరోజు కూడా జీవించలేడు. అంతటి ఆవశ్యకతమైన నీరు నేడు కలుషితం అయిపోయి కలవరపెడుతుంది.ఈ విషయం ఎవరో చెప్పింది కాదు సాక్షాత్ భారత పార్లమెంటు సాక్షిగా మన కేంద్ర ప్రభుత్వమే. భూగర్భ జలాలలో నీరు చాలా వరకు కలుషితమైనట్టు సర్వే చేసి మరి చెప్పింది.
ముఖ్య విషయం ఏమిటంటే పట్టణాల్లో కంటే కూడా గ్రామాల్లోని బోరు బావిలో నీరు కలుషితమైనట్టు వాస్తవాలు వెల్లడించింది. దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు మోతాదుకు మించి విషపూరిత లోహాల పరిమాణం ఎక్కువ ఉన్నట్లు తెలిపింది. ఆర్సెనిక్, ఐరన్,కాడ్మియం, క్రోమియం, యురేనియం లాంటి దాతువులు మోతాదుకు మించిఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
జల శక్తి మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం 25 రాష్ట్రాల్లోని 29 జిల్లాల్లో ఒక లీటర్ నీటిలో 0.01 మి. గ్రా ఆర్సెనిక్ ఉంది. 11 రాష్ట్రాల్లో 29 జిల్లాలలో ఒక లీటర్ నీటిలో కాడ్మియం 0.003 మి.గ్రా కంటే ఎక్కువ ఉంది. అలాగే 18 రాష్ట్రాల్లో 150 జిల్లాలలో ఒక లీటర్ నీటిలో యురేనియం 0.03 మిల్లీగ్రామ్ కంటే ఎక్కువ ఉంది.దేశం మొత్తం మీద జనాభా సుమారు 75% నుంచి 80 శాతం వరకు భూగర్భం నుంచి వచ్చే నీటి పైనే ఆధారపడి ఉన్నారు.అదేవిధంగా తాగునీటి వనరులు కాలుష్యం ప్రదేశాలను కూడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నైట్రేట్ (517 ),ఫ్లోరైడ్ (671),ఆర్సెనిక్ (814) సాలినిటి (9930) ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయని తెలిపింది.
ప్రభుత్వం ఎందుకు కలవర పడుతుందంటే ఈ నీటిలో కలిసిన హానికర మూలకాల నుంచి చాలా వరకు సమస్యలు వస్తాయి. అవి ఆర్సెనిక్ వల్ల చర్మ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వచ్చే అవకాశం. ఎక్కువ మోతాదులో క్రోమియం వల్ల చిన్నప్రేగులు దెబ్బ తినే అవకాశం కలదు. సీసం వలన నాడీ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది ఇనుము దాతువలన పర్కిన్సన్ వ్యాధులు వస్తాయి. యురేనియం ఎక్కువ వలన క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు వస్తాయి.
భూగర్భ జలాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు:ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు నెలలో జెల్ జీవన్ మిషను ప్రారంభించింది దీని ముఖ్య ఉద్దేశం 2024 సంవత్సరం నాటికి ప్రతి గ్రామీణ కుటుంబానికి కుళాయిల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని పథకం ముఖ్య ఉద్దేశం.మరియు అమృత్ 2.0 పథకాన్ని అక్టోబర్ 2021 లో ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం 2026 నాటికి అన్ని నగరాల్లో ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలని ప్రధాన ఉద్దేశం. కాబట్టి మానవులు ఇప్పటికైనా మేల్కొని నీటి కాలుష్యాన్ని నివారించవలసి ఉంది.