Lunar Eclipse 2022: ఈ సంవత్సరం దీపావళి 25వ తేదీన వచ్చింది.ఆరోజు సూర్యగ్రహణం వచ్చిన కారణంగా ఒకరోజు ముందు జరుపుకున్నాం. అయితే మళ్లీ గ్రహణం రాబోతుంది. ఈసారి వచ్చేది సూర్యగ్రహణం కాదు, చంద్రగ్రహణం చంద్రగ్రహణం నవంబర్ 8న రాబోతుంది. ఈ సంవత్సరం వచ్చే గ్రహాలలో ఇది లాస్ట్ గ్రహణం.
ఈ చంద్రగ్రహణం నవంబర్ 8వ తేదీన ఏర్పడబోతున్నట్లుగా, ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహణం భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఉత్తర అట్లాంటిక్,లతో పాటుగా పసిఫిక్ మహాసముద్రాలలోని ప్రాంతాలలో మాత్రమే ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
ఈ చంద్రగ్రహణం ఎంతో అరుదైనదిగాని కూడా చెప్పారు. ఈ అరుదైన చంద్రగ్రహణం లాటిన్ అమెరికాలోని కొన్ని దేశాలలో పాక్షక చంద్ర గ్రహణంగా కనిపిస్తున్నది అని కూడా చెప్పారు.
చంద్రగ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుందో? ఏ సమయంలో ఎలా ఉంటుందో? తెలుసుకుందాం.
ప్రపంచం మొత్తంగా ఏర్పడే ఈ చంద్రగ్రహణం నవంబర్ 8న ఏర్పడుతుంది. అయితే ఆరోజు గ్రహణం ఒకచోట పాక్షికంగా, ఒకచోట సంపూర్ణంగా ఉంటుంది. చంద్రగ్రహణం పాక్షికంగా అలాగే సంపూర్ణంగా ఉండే సమయాలు తెలుసుకుందాం.
పాక్షిక చంద్రగ్రహణం:
భారతదేశం యొక్క కాలమానం ప్రకారం గ్రహణ ప్రారంభ సమయం మధ్యాహ్నం 2:39 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. అదేవిధంగా సంపూర్ణగ్రహణం పూర్తి అయ్యి గ్రహణం తొలిగేటప్పుడు 6:19 గంటలకు మళ్లీ పాక్షికంగా ఉండి, ఆ తర్వాత గ్రహణకాలం పూర్తి అవుతుంది.
సంపూర్ణ చంద్రగ్రహణం: మధ్యాహ్నం గ్రహణం ప్రారంభమైనప్పుడు పాక్షికంగా ఉండి, ఆ తర్వాత 3:46 గంటలకు సంపూర్ణంగా కనిపిస్తుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం 3:46 గంటల నుండి సాయంత్రం 5:11 గంటల వరకు ఉండి, ఆ తర్వాత పాక్షికంగా కనిపిస్తుంది. అయితే ఎక్కువగా సంపూర్ణ చంద్రగ్రహణం నుండి చంద్రుడు మబ్బుగా కనిపించే సమయం 4 గంటల 29 నిమిషాలు.
భారత్లో చంద్రగ్రహణం చూడాలంటే చంద్రోదయం వరకు వేచి ఉండాలి. ఆకాశంలో చంద్రుడు కనిపించినప్పటి నుండి గ్రహణాన్ని చూడవచ్చు. అయితే అప్పటికే సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణం ప్రారంభ దశను మాత్రం మనం చూడలేము. భారత్ కాక, కోల్కతా తో పాటుగా, తూర్పు భారతదేశంలో ఉండే కొన్ని ప్రాంతాలలో సంపూర్ణంగా చంద్రగ్రహణం కనిపిస్తుంది.
మిగిలిన కొన్ని ప్రాంతాలలో పాక్షికంగా చంద్రగ్రహణం కనిపిస్తుంది. కోహిమా,అగర్తలా, గుహహతి వంటి ప్రాంతాలలో కోల్కతా కంటే ముందుగానే సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. అయినప్పటికీ కోహిమా లో మాత్రమే చంద్రగ్రహణం రోజు చంద్రుడు మరింత చీకటిగా కనిపిస్తాడని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.