విజయవాడలో నిర్వహించిన ఫోటోగ్రఫీ కార్నివాల్ ఎక్స్ పో కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మంత్రి రోజా. మంత్రి రోజాను వందల మంది ఫోటోగ్రాఫర్లు ఏకకాలంలో ఫోటో తీశారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈ అరుదైన ఘట్టం స్థానం సంపాదించుకుంది.
ఇంతమంది ఫోటోగ్రాఫర్లు ఒకే వేదికపై రావడం సంతోషం కలిగిస్తుందని రోజా అన్నారు. ఓకే వేదికపై ఇంత మంది ఫోటోగ్రాఫర్లు తనను ఫోటో తీయడం మధురమైన అనుభూతి అందించింది అన్నారు.
ఇప్పుడున్న సమాజంలో కెమెరా మూడో కన్ను వంటిదని కెమెరా లేకపోతే చరిత్ర లేదని భవిష్యత్తులో ఏదీ ఉండదని తెలిపారు. ఒక ఫోటో తన జీవితాన్ని మార్చేసింది అని రోజా తెలిపారు.
తాను సినీ ప్రపంచంలో అడుగుపెట్టడానికి ఓ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో కారణమని తెలిపారు. తనని చూడకుండా ఆ ఫోటోను చూసి ప్రేమ తపస్సు సినిమాలో అవకాశం వచ్చిందని రోజా తెలిపారు.