ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 పోటీలో సినీ శెట్టి విజేతగా నిలిచింది. సినీ శెట్టి (21) కర్ణాటక కు చెందినది. మిస్ ఇండియా వరల్డ్ 2022 పోటీల్లో విజేతగా నిలిచి మానస వారణాసి అనే కిరీటాన్ని కైవసం చేసుకుంది. అంతేకాక మిస్ స్టాలెంటెడ్, మిస్ టైమ్స్, మిస్ బాడీ బ్యూటిఫుల్ అనే ప్రశంసలను అందుకుంది.
ఈమె 3 జులై 2000 సంవత్సరం ముంబైలోని మహారాష్ట్రలో పుట్టింది. తండ్రి సదానంద్ శెట్టి, తల్లి హేమ శెట్టి. ఆమె తండ్రి షకీన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు. అలాగే మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా. సినీ శెట్టి కి ఒక అన్న (షేకిన్ శెట్టి) ఉన్నాడు. ఈమె మోడల్, డాన్సర్ ,నటి కూడా.
సినీ శెట్టి తన పాఠశాల విద్యను ముంబైలోని సెయింట్ డొమినిక్ సోవియో విద్యాలయంలో పూర్తి చేసింది. తన కళాశాల విద్యను S.K సోమయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పూర్తి చేసింది. ఈమె ఫైనాన్స్ అకౌంటింగ్ గ్రాడ్యుయేట్ చేసి సి ఎఫ్ ఏ కోర్సులు కొనసాగించింది. ఈమె మిస్ ఇండియా విజేతగా నిలిచినందుకు మీడియాలో తన గురించి కొన్ని వివరాలు వెల్లడించింది.
తన వృత్తి అయిన భారతీయ నృత్యం, మోడలింగ్ ను కంటిన్యూ చేస్తాను అన్నది. తను చిన్నతనం నుండి నాట్యం నేర్చుకోవడం అలవాటు చేసుకున్నాను. 14 ఏళ్ల వయసులో భరతనాట్యంతో ప్రేక్షకులకు పరిచయమయ్యానని చెప్పుకొచ్చింది. ఫ్యాబ్ ఇండియా ద్వారా గ్లోబల్ డాన్స్ చాలెంజ్ ఈవెంట్లలో పాల్గొన్నారు.
ఆ సమయంలోనే షుగర్ కాస్మెటిక్ ,పాంటెలూన్స్ బ్రాండ్లకు మోడల్ గా చేసా. సామాజిక సంక్షేమం కోసం కెట్రో సంస్థలో పనిచేశానన్నది .అలాగే క్యాన్సర్ ఉన్నవారికి మందులను అందజేయడానికి కూడా హెల్ప్ చేశాను.. ఇవే కాక పర్సుల్ థాట్ అనే మోడల్ ఏజెన్సీలో కూడా మోడల్ గా చేస్తున్నానని చెప్పారు.
తను విజయం సాధించడానికి శ్రమతో పట్టుదలతో చాలా కృషి చేశానన్నారు. ప్రియాంక చోప్రాను ఆదర్శంగా తీసుకుంటాను అన్నారు. ఎక్కువ సమయం జిమ్లో గడుపుతాను ,అలాగే ధ్యానం కూడా చేస్తానని తన మనసులో భావాలను మీడియాతో పంచుకుంది.