సులువైన పద్ధతి ద్వారా డబ్బును సంపాదించాలి అనుకుంటున్నారా?
మీరు ఎంత సంపాదించినా తొందరగా ఖర్చు అవుతూ ఉంటుంది. అలా ఖర్చు కావడంతో మీకు అవసరానికి డబ్బు చేతిలో లేక చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సరైన ప్లాన్స్ చేసుకోలేక నెల చివరికి వచ్చేసరికి జీతం మొత్తం అయిపోతుంది. డబ్బు విషయంలో కచ్చితంగా నిర్ణయాలు ఎప్పుడైతే తీసుకుంటారో, అప్పుడే ప్రాబ్లమ్స్ లేకుండా ఉండగలుగుతారు. దీనికోసం మీరు మీ సంపాదన ప్రకారం ఖర్చులను అంచనా వేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఫైనాన్షియల్ గా ధైర్యంగా ముందుకు వెళతారు. డబ్బులు పొదుపు చేసుకోవాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే డబ్బును పొదుపు చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా ముందడుగు వేయవచ్చు.
మనీ సేవింగ్స్ చేయడానికి పాటించాల్సినపద్ధతులు:
1. లైఫ్ స్టైల్ మార్చుకోవడం:
చాలామంది ఎక్కువగా ఫ్యాన్సీ, ఫోర్స్స్ గా స్టైల్ ను మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు. అలా చేయడం ద్వారా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. చాలామంది బ్రాండెడ్ ఐటమ్స్ మాత్రమే వాడుతూ వాటికోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. వాటి వల్ల హోదా పెరుగుతుంది కానీ ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా లైఫ్ స్టైల్ కోసం ఖర్చు చేయడం ప్రారంభిస్తే అది ఎప్పటికీ ఆగదని ఫైనాన్షియల్ సహా సలహాదారులు చెబుతున్నారు. కనుక మీ ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగా ఉండడం మంచిది.
2. సేవింగ్స్(పొదుపు):
ఈ మధ్యకాలంలో రేట్లు పెరిగిపోవడం ద్వారా చాలా ఖర్చులు పెరుగుతున్నాయి. దానివల్ల సేవింగ్స్ చేయాలని విషయం కూడా మర్చిపోతున్నారు. సేవింగ్స్ చెయ్యకపోతే జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనుకోకుండా డబ్బు అవసరమైనప్పుడు దానికోసం అప్పులు చేయాల్సి వస్తుంది. అందువల్ల డబ్బు పొదుపు చేయడం ద్వారా ఎలాంటి సమస్యలు వచ్చినా, అప్పులు చేయకుండా తీర్చుకోవచ్చు. ఉద్యోగస్తులు మీ రిటైర్మెంట్ అయ్యే వరకు కొంత డబ్బును పొదుపు చేయడం చాలా అవసరం. అందువల్ల జీవితంలో కొంత భాగాన్ని పొదుపు చేయండి.
3. ఇన్వెస్ట్మెంట్ (పెట్టుబడులు):
పెట్టుబడి పెట్టి చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. పెట్టుబడి పెట్టి తెలివిగా చాలా తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. పెట్టుబడులు పెట్టడానికి అనువైన మార్గం స్టాక్ మార్కెట్లు వంటివి చాలా మంచిది. స్టాక్ మార్కెట్లపై మంచి అవగాహనతో వాటిలోని షేర్స్ పై పెట్టుబడులు పెట్టి డబ్బు సంపాదించుకోవడం చాలా మంచిపని.
4. ఎమర్జెన్సీ ఫండ్స్ (అత్యవసర నిధులు):
ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా మంచిపని. సంవత్సరంలో ఆరు నెలల పాటుగా అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని, ఆ డబ్బును దాచి పెట్టుకోవాలి. ఇలా ఎంత వీలైతే అంత డబ్బును దాచి పెట్టుకోవడం చాలా మంచిది. ఆ డబ్బు అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది. మన చేతిలో సమయానికి డబ్బు లేనప్పుడు ఆ డబ్బు ఉపయోగపడుతుంది. దీనిని ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. ఇలా సేవింగ్స్ చేయడం వల్ల జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా సాగిపోవచ్చు.
5. క్రెడిట్ కార్డ్స్:
ప్రస్తుత జనాభాలో ఎక్కువ శాతం క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నారు. సమయానికి కట్టకపోతే అవి పెరిగిపోతూ ఉంటాయి. కనుక ఎంత తొందరగా త్వరగా తక్కువగా ఉన్నప్పుడే బిల్లు కట్టడం మంచిది. క్రెడిట్ కార్డ్ స్కోర్ ని మెయింటెనెన్స్ చేయాలని అనుకుంటే, ఇలా ఉపయోగించడం కన్నా డబుల్ క్రెడిట్ కార్డ్స్ ని ఉపయోగించడం మేలు. క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించడం వల్ల ఎక్కువ వడ్డీకి అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు.
6. ఇన్సూరెన్స్:
ప్రతి మనిషికి జీవితంలో ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యమైనది. ప్రతిసారి హెల్త్ ఇన్సూరెన్స్ కోసం కొంత డబ్బు పక్కకు పెట్టడం చాలా మంచిది. అత్యవసర సమయాల్లో ఆ డబ్బు ఉపయోగకరంగా ఉంటుంది.
7. బడ్జెటింగ్:
మీరు ప్రతి నెల చేసే ఖర్చులను రాసుకోవడం వల్ల దేనిపై అనవసరమైన ఖర్చులు చేస్తున్నారు అనేదితెలుస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి అలవాటులను మార్చుకుంటూ ఉండాలి. మనం చేసే ఖర్చులపై అవగాహన ఉంటేనే ఖర్చులు తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. చాలా మంది ఖర్చులు చేసేటప్పుడు పిసినారిగా ఆలోచిస్తారు. అలా చేయడం ద్వారా జీవితంలో చాలా మిస్ అవుతారు. కొందరు అతిగా ఖర్చులు పెడుతూ ఉంటారు. అందువల్ల తర్వాత మీరే బాధపడతారు. కనుక ఖర్చులు చేసే ముందు బాగా ఆలోచించి చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి పద్ధతులను పాటించడం ద్వారా డబ్బును సేవింగ్ చేసుకోవచ్చు అలాగే జీవితంలో సంతోషంగా ఉండవచ్చు.