టాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించి స్టార్ హీరో , ఒక షోకు హోస్ట్ చేస్తున్న అక్కినేని నాగార్జున కొడుకు అక్కినేని నాగచైతన్య కు సంబంధించిన ఒక న్యూస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత విడాకులు అయిన తర్వాత మరో హీరోయిన్ తో జంటగా కనిపించిన నాగచైతన్య. ప్రస్తుతం వీరిద్దరిలా కనిపించడం వల్ల చైతు మరో హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి.
హీరోయిన్ శోభిత దుళిపాళ్లతో కొంతకాలంగా నాగచైతన్య రిలేషన్ లో ఉన్నాడంటూ వార్తలు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి. వీరిద్దరూ నిన్న బయట కలిసి దిగిన ఒక ఫోటో వైరల్ గా మారింది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వచ్చిన వార్త నిన్న ఇద్దరు కలిసి దిగిన ఫోటో ద్వారా మరింత ప్రచారంలోకి వచ్చింది.
మరోవైపు సమంత అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే చైతు మరో హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడంటూ నెగిటివ్ న్యూస్ లు వస్తున్నాయి. మయోసైటీస్ వ్యాధితో సమంత ఇటీవల కాలంలో బాధపడుతున్నారు. సమంతను నాగచైతన్య 2017 అక్టోబర్ ఆరో తేదీన వివాహం చేసుకున్నాడు.
వీరిద్దరూ టాలీవుడ్ లో స్టార్ కపుల్స్ గా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. 2021 అక్టోబర్ రెండో తేదీన వారిద్దరూ వ్యక్తిగత కారణాలవల్ల విడిపోయారంటూ, డివోర్స్ తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి.
ఇటీవల కాలంలో సమంత హాస్పిటల్ ఉన్నప్పుడు నాగచైతన్య, అక్కినేని నాగార్జున హాస్పిటల్ వెళ్లి సమంతాను చూసిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం సమంత అభిమానులైతే చైతుకు నెగిటివ్గా ఉన్నారు.
సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ ఉంటే చైతు మరోవైపు మరో హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.